AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవి

అవును.. నిజంగానే గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌.. పెళ్లిళ్ల సీజన్‌ మొదలైన నేపథ్యంలో బంగారం కొనాలని చూస్తున్నవారికి అదిరిపోయే న్యూస్. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. గత వారం కొన్ని రోజులుగా ఈ విలువైన రెండు లోహాలు తగ్గుతూ వస్తున్నాయి. ఒకవైపు ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా బంగారం ధరలు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. పెళ్లిళ్లు లేదా ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది కొంతవరకు అనుకూలమైన సమయంగా భావిస్తున్నారు. అయితే బంగారం కొనుగోలు చేయడానికి ముందు రోజువారీ మార్కెట్ ధరలు తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Gold Rate Today: గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవి
Gold Rate
Jyothi Gadda
|

Updated on: Mar 06, 2026 | 7:07 AM

Share

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ మార్పులు, మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్న భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో ఈ విలువైన లోహాల ధరలు తరచుగా మారుతున్నాయి. తాజాగా ఇవాళ భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కొంత తగ్గగా, వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు నమోదయ్యాయి. హైదరాబాద్ మార్కెట్‌ను తీసుకుంటే, ఇవాళ 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 లు ధర పలుకుతోంది.

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,64,940 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,51,190 గా ఉంది.

ఇవి కూడా చదవండి

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,63,020 క్యారెట్ల ధర రూ.1,49,440 గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 గా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,62,870, 22 క్యారెట్ల ధర రూ.1,49,290 గా ఉంది.

ఇక వెండి ధర విషయానికి వస్తే, భారత్‌లో గ్రాము వెండి ధర రూ.294.90లుగా ఉంది. అంటే 10 గ్రాముల వెండి ధర రూ. 2,94,900 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరల మార్పుల కారణంగా దేశీయ మార్కెట్‌లో కూడా ధరలు తరచూ మారుతున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచ మార్కెట్‌లో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గుచూపినప్పుడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల తర్వాత ఇప్పుడు కొంత తగ్గుదల కనిపిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈసారి అంత పెరిగిందా?
మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈసారి అంత పెరిగిందా?
దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ
దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ
చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష
చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష
యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!
యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!
తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..
తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..