AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టలపై పడ్డ మొండి హోలీ రంగులు పొవాలంటే ఈ ట్రిక్స్ తప్పక ట్రై చేయండి.. మరకలు మొత్తం తొలగిపోతాయి

హోలీ పండగ పూర్తైంది.. అసలు పండగ ఇప్పుడే మొదలవుతుంది.. ఎందుకంటే.. హోలీ ఆడుతూ ఎంతగా ఎంజాయ్‌ చేశారో.. ఇష్టమైన బట్టలపై పడ్డ మొండి హోలీ మరకలను తొలగించేందుకు అంతే కష్టపడాల్సి వస్తుంది. లేదంటే, ఇష్టమైన బట్టలపై మొండి రంగులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కానీ, ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు.. ఇందుకోసం సూపర్ ఐడియాలు ఉన్నాయి. కొన్ని లాండ్రీ టిప్స్‌ పాటించటం వల్ల బట్టలపై పడ్డ ఎలాంటి మొండి రంగు మరకలైన ఇట్టే ఈజీగా తొలగిపోతాయి. తిరిగి మీరు ఆ బట్టలు మళ్ళీ ధరించగలిగేలా చేస్తుంది.

బట్టలపై పడ్డ మొండి హోలీ రంగులు పొవాలంటే ఈ ట్రిక్స్ తప్పక ట్రై చేయండి.. మరకలు మొత్తం తొలగిపోతాయి
Holy Colors From Clothes
Jyothi Gadda
|

Updated on: Mar 05, 2026 | 10:14 AM

Share

హోలీ ఆడటం ఎంత సరదాగా ఉంటుందో ఆ తర్వాత బట్టల పరిస్థితిని చూడటం కూడా అంతే బాధాకరం. రంగుల ఆనందం కొన్ని గంటల్లోనే పోతుంది, కానీ చొక్కా, కుర్తా, మన చీరలపై పడ్డ రంగు మరకలు శాశ్వతంగా, చాలా రోజుల పాటు అలాగే ఉండిపోతాయి. ముఖ్యంగా తెల్లటి బట్టలపై గులాల్ లేదా తడి రంగు మరకలు మొండిగా కనిపిస్తాయి. వాటిని పూర్తిగా శుభ్రం చేశామంటే.. దాని రంగు మసకబారుతుందనే భయంతో చాలా మంది ఖరీదైన దుస్తులను పక్కన పెడతారు. కానీ, ఇప్పుడు లాండ్రీ నిపుణుడి పద్ధతి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది మీ బట్టలపై పడ్డ మొండి రంగు మరకలను ఈజీగా క్లీన్‌ చేస్తుంది. మొండి రంగును కూడా తొలగించి బట్టలు మళ్లీ ధరించగలిగేలా చేస్తుంది. అదేలాగో ఇక్కడ చూద్దాం..

హోలీ తర్వాత ప్రజలు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, వారి దుస్తులకు నేరుగా డిటర్జెంట్ రాసి, ఆపై వాటిని స్క్రబ్ చేస్తుంటారు. దీనివల్ల రంగు ఫాబ్రిక్ ఫైబర్‌లలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. అలా కాకుండా, ముందుగా, ఒక పెద్ద టబ్‌లో బట్టలు పూర్తిగా మునిగిపోయేంత సాదా నీటితో నింపండి. వాటిని 4 నుండి 5 గంటల పాటు అలాగే వదిలేయండి. రంగు చాలా ముదురుగా ఉంటే, రాత్రంతా నానబెట్టడం మంచిది. ఈసారి, రంగు కొద్దిగా వదులుతుంది. దీని వలన వాటిని శుభ్రపరచడం మరింత సులభం అవుతుంది.

ఇక, ఇప్పుడు నానబెట్టిన బట్టలను నీటి నుండి తీసి తేలికగా పిండండి. ఇప్పుడు మరొక బకెట్‌ను శుభ్రమైన నీటితో నింపండి. 2 నుండి 3 టీస్పూన్ల బ్లీచింగ్ పౌడర్ వేసుకోండి. తరువాత, 2 టీస్పూన్ల బేకింగ్ సోడా, మీ రోజువారీ డిటర్జెంట్‌ను వేసి కలపండి. ఈ మిశ్రమం బట్టలపై పడిన రంగును విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తుంది. ఈ పద్ధతి ముఖ్యంగా లేత రంగు లేదా తెలుపు దుస్తులకు ప్రభావవంతంగా ఉంటుంది. ముదురు రంగు దుస్తులపై బ్లీచ్ ఉపయోగిస్తే అవి పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్లీచ్ ప్రభావం సూర్యకాంతిలో ఎక్కువగా ఉంటుంది. ఈ ద్రావణంలో దుస్తులను ఉంచి 20 నిమిషాలు ఎండలో ఉంచండి. ద్రావణం ప్రతి భాగానికి చేరేలా దుస్తులను మధ్యలో తలక్రిందులుగా తిప్పుతూ ఉండండి. సూర్యకాంతి, బ్లీచ్ మిక్సింగ్‌ రంగును బలహీనపరుస్తుంది. గతంలో ముదురు గులాబీ లేదా ఆకుపచ్చగా ఉన్న మరక తేలికపడటం ప్రారంభమవుతుంది. ఎండలో పెట్టిన తరువాత మరకలను లాండ్రీ బ్రష్‌తో సున్నితంగా బ్రష్ చేయండి. ఎక్కువ ఫోర్స్ వాడటం వల్ల ఫాబ్రిక్ దెబ్బతింటుంది. తర్వాత, బ్లీచ్, డిటర్జెంట్ అవశేషాలన్నింటినీ తొలగించడానికి శుభ్రమైన నీటితో రెండు మూడుసార్లు బాగా జాడించుకోవాలి.

బ్లీచింగ్ తర్వాత బట్టలు కొద్దిగా పసుపు రంగులోకి మారుతాయి. దీనివల్ల తెల్లదనం తక్కువగా కనిపిస్తుంది. అలాంటి సందర్భంలో, ఒక టబ్ నీళ్ళు తీసుకుని దానికి కొద్దిగా కలర్‌బైట్ కలపండి. బ్లీచ్‌లో బట్టలను నానబెట్టినంత సమయం మరో 20 నిమిషాల పాటు ఈ ద్రావణంలో నానబెట్టండి. ఇది వాటి మెరుపును తిరిగి తెస్తుంది. పసుపు రంగును తగ్గిస్తుంది.

చివరగా, ఒక టబ్‌ను నీటితో నింపి అందులో ఆక్సాలిక్ కణికలను కరిగించండి. దుస్తులను నీటిలో 5 నుండి 7 నిమిషాలు నానబెట్టండి. ఇది మీ బట్టలపై ఎక్కడైన మిగిలిపోయిన మరకలను కూడా పూర్తిగా కనిపించకుండా పోయేలా చేస్తుంది. ఆక్సాలిక్ ఆమ్లం తేలికపాటి వాయువును, బలమైన వాసనను విడుదల చేస్తుంది, కాబట్టి, ఈ పనిని బహిరంగ ప్రదేశంలో చేయండి. తరువాత, దుస్తులను 2-3 సార్లు శుభ్రమైన నీటితో శుభ్రం చేసి ఆరబెట్టండి. ఇలా చేశారంటే.. హోలీ రంగులు మొండిగా అనిపించవచ్చు, కానీ సరైన విధానంతో వాటిని తొలగించడం అసాధ్యం కాదు. కొంచెం ఓపిక, సరైన పరిమాణం, జాగ్రత్తతో, మీరు మీకు ఇష్టమైన దుస్తులను మళ్ళీ ధరించగలిగేలా చేసుకోవచ్చు. ఈసారి, హోలీ తర్వాత మీరు వాటిని పారవేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
NEET UG 2026 కౌన్సెలింగ్‌.. సీట్ల కేటాయింపు ఫలితాలు వాయిదా..!
NEET UG 2026 కౌన్సెలింగ్‌.. సీట్ల కేటాయింపు ఫలితాలు వాయిదా..!
సూపర్‌‌ కార్ల రేసులోకి డచ్ సంస్థ రీ ఎంట్రీ.. పూర్తి వివరాలు
సూపర్‌‌ కార్ల రేసులోకి డచ్ సంస్థ రీ ఎంట్రీ.. పూర్తి వివరాలు
ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.
ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. కొత్తగా వారికి కూడా..
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. కొత్తగా వారికి కూడా..
టాటా ఎస్‌యూవీల్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏది
టాటా ఎస్‌యూవీల్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏది
గిరినాగుతో అట్లుంటాది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. 
గిరినాగుతో అట్లుంటాది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. 
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర