AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాయు కాలుష్యంతో కిడ్నీలు ఖతం.. ఊపిరితిత్తులే కాదు మూత్రపిండాలకూ డేంజర్!

దేశంలోని ప్రధాన నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని ఎక్కువగా విన్నాం. కానీ కలుషితమైన గాలి మన మూత్రపిండాల (కిడ్నీలు) ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గాలిలో ఉండే అతి సూక్ష్మమైన PM2.5 కాలుష్య కణాలు రక్తప్రవాహంలోకి చేరి కిడ్నీల పనితీరును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

వాయు కాలుష్యంతో కిడ్నీలు ఖతం.. ఊపిరితిత్తులే కాదు మూత్రపిండాలకూ డేంజర్!
Air Pollution
Balaraju Goud
|

Updated on: Nov 25, 2026 | 9:17 PM

Share

దేశంలోని ప్రధాన నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని ఎక్కువగా విన్నాం. కానీ కలుషితమైన గాలి మన మూత్రపిండాల (కిడ్నీలు) ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గాలిలో ఉండే అతి సూక్ష్మమైన PM2.5 కాలుష్య కణాలు రక్తప్రవాహంలోకి చేరి కిడ్నీల పనితీరును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

కిడ్నీలపై కాలుష్యం ఎలా ప్రభావం చూపుతుంది?

గురుగ్రామ్‌లోని సీకే బిర్లా ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజీ కన్సల్టెంట్ డాక్టర్ మోహిత్ ఖిర్బత్ కీలక విషయాలను వెల్లడించారు. PM2.5 వంటి సూక్ష్మ కాలుష్య కణాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాపు, ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతాయి. ఇవి రక్తనాళాలను దెబ్బతీయడంతో పాటు కిడ్నీలకు రక్త సరఫరాపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా రక్తంలోని వ్యర్థాలను వడపోసే మూత్రపిండాల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది.

PM2.5తో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల ముప్పు!

PM2.5 అనేవి గాలిలో తేలియాడే అత్యంత సూక్ష్మమైన కాలుష్య కణాలు. వీటిని మనం శ్వాస ద్వారా లోపలికి పీల్చుకుంటాం. దీర్ఘకాలం పాటు వీటికి గురికావడం వల్ల మెంబ్రేనస్ నెఫ్రోపతీ వంటి కిడ్నీ వ్యాధుల ముప్పు పెరగవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ వ్యాధిలో కిడ్నీల్లో రక్తాన్ని వడపోసే భాగం దెబ్బతిని, మూత్రం ద్వారా ప్రోటీన్ బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది.

పరిశోధనలో షాకింగ్ విషయాలు!

జర్నల్ ఆఫ్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీలో ప్రచురితమైన ఒక పరిశోధనలో వాయు కాలుష్యానికి, కిడ్నీ వ్యాధులకు మధ్య సంబంధాన్ని పరిశీలించారు. ఈ అధ్యయనంలో సుమారు 25 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. కాలుష్య స్థాయిలు, ఇతర ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించారు.

ఈ పరిశోధనలో ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో కాలుష్య సాంద్రత 10 మైక్రోగ్రాములు పెరిగినప్పుడు కొత్తగా కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం 25 నుంచి 37 శాతం వరకు పెరిగినట్లు గుర్తించారు. అలాగే కిడ్నీల పనితీరు వేగంగా క్షీణించే ప్రమాదం 36 శాతం, డయాలసిస్ అవసరమయ్యే స్థితికి చేరే ప్రమాదం 31 శాతం పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది.

ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి

తైవాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాల్లో నిర్వహించిన పరిశోధనల్లోనూ వాయు కాలుష్యానికి, కిడ్నీల పనితీరు తగ్గడానికి మధ్య సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా అధిక కాలుష్యానికి గురైన ప్రాంతాల్లో నివసించే వారిలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉండవచ్చని పరిశోధకులు గుర్తించారు.

కిడ్నీలను కాపాడుకోవాలంటే ఏం చేయాలి?

వాయు కాలుష్యాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

– గాలి నాణ్యత (AQI) తక్కువగా ఉన్న రోజుల్లో బయట తిరగడం తగ్గించాలి.

– బయటకు వెళ్లాల్సి వస్తే సరైన ఫిట్ ఉన్న N95 మాస్క్ ఉపయోగించాలి.

– శరీరానికి తగినంత నీరు అందించాలి.

– రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.

– ధూమపానానికి దూరంగా ఉండాలి.

– అవసరాన్ని బట్టి వైద్యుల సలహాతో కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలి.

మొత్తంగా చెప్పాలంటే.. వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తుల సమస్య మాత్రమే కాదు. గుండె, రక్తనాళాలు, మూత్రపిండాల ఆరోగ్యంపైనా ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకం.

గమనిక: కాలుష్యానికి గురికావడం వల్ల ప్రతి ఒక్కరికీ కిడ్నీ వ్యాధి వస్తుందని కాదు. పరిశోధనలు కాలుష్యం, కిడ్నీ సమస్యల మధ్య సంబంధాన్ని సూచిస్తున్నాయి. ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయం మేరకు అందించడం జరుగుతుంది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఊపిరి తీసుకోవడమే ప్రమాదమా?.. వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్!
ఊపిరి తీసుకోవడమే ప్రమాదమా?.. వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్!
గుడిలోకి వెళ్లే ముందు గంట ఎందుకు మోగిస్తారు? ఆధ్యాత్మిక రహస్యం..
గుడిలోకి వెళ్లే ముందు గంట ఎందుకు మోగిస్తారు? ఆధ్యాత్మిక రహస్యం..
ఓటర్లకు అలర్ట్.. ఓటర్ లిస్టులో తప్పులుంటే సరిచేస్తామంటున్న ఈసీ!
ఓటర్లకు అలర్ట్.. ఓటర్ లిస్టులో తప్పులుంటే సరిచేస్తామంటున్న ఈసీ!
 పిల్లల చదువు, పెళ్లి కోసం బెస్ట్ పెట్టుబడి పథకాలివే!
 పిల్లల చదువు, పెళ్లి కోసం బెస్ట్ పెట్టుబడి పథకాలివే!
హైదరాబాద్ నుంచి కాశీ, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు టూర్..
హైదరాబాద్ నుంచి కాశీ, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు టూర్..
రోజూ తినే ఈ పదార్థాలతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం.. జాగ్రత్త!
రోజూ తినే ఈ పదార్థాలతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం.. జాగ్రత్త!
కలయా.. నిజమా.. కిర్రాక్ ఫీచర్లతో స్మార్ట్‌వాచ్.. కేవలం రూ.902కే !
కలయా.. నిజమా.. కిర్రాక్ ఫీచర్లతో స్మార్ట్‌వాచ్.. కేవలం రూ.902కే !
చలికాలంలో గులాబీ మొక్కను ఇలా చూసుకోండి.. కొమ్మకొమ్మకు పూలే!
చలికాలంలో గులాబీ మొక్కను ఇలా చూసుకోండి.. కొమ్మకొమ్మకు పూలే!
నిద్రపోయే ముందు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే ఇన్ని లాభాలా?
నిద్రపోయే ముందు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే ఇన్ని లాభాలా?
ఇంత ట్రాజేడీ సినిమా ఎవరు చూస్తారు అన్నారు..
ఇంత ట్రాజేడీ సినిమా ఎవరు చూస్తారు అన్నారు..