AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో వైరల్

ప్రస్తుత సోషల్ మీడియా, AI యుగంలో అబద్ధాలు నిజం కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. అలాంటి ఒక వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంటర్నెట్‌లో తాజాగా వైరల్ అయిన ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లను గందరగోళానికి గురి చేసింది. ఈ వీడియోలో ఒక చీతా హోలీ పండుగ వేడుకలో రంగులు ఆడుతూ ఉత్సాహంగా దూకుతుండటం కనిపిస్తుంది. అయితే, నిశితంగా పరిశీలిస్తే ఆ వీడియో నిజం కాదని స్పష్టమవుతుంది. అది AI సృష్టించిన డిజిటల్ కంటెంట్. పూర్తి వివరాల్లోకి వెళితే..

Video Viral: ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో వైరల్
Cheetah Playing Holi
Jyothi Gadda
|

Updated on: Mar 04, 2026 | 12:17 PM

Share

హోలీ రోజున భాంగ్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. అలాగే, AI వీడియోలతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైన వీడియోని ఒకటికి రెండుసార్లు చూసి ఏదో నిజం, ఏది అబద్ధం చెక్‌ చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా ఈ చిరుతపులి నిజమని నమ్మితే ప్రమాదం. సరద కోసం ఇలాంటి ట్రై చేశారంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. హోలీ వేళ మీలో మీరు రంగులు చల్లుకుంటే పర్వాలేదు.. కానీ, ఇలాంటి ప్రమాదకరమైన జంతువులతో ఆటలు మీ ప్రాణాలకే ప్రమాదం కావొచ్చు. ముఖ్యంగా కొన్న జర్మన్ షెపర్డ్, పిట్‌బుల్‌ రకం వంటి పెంపుడు కుక్కలతో కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీహార్ పేరుతో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరినీ అయోమయం గందరగోళంలోకి నెట్టివేస్తుంది.

వైరల్ వీడియోలో చీతా ఒకటి బిహార్‌లోని ఒక గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో గ్రామవాసులంతా కలిసి ఆ చీతాతో హోలీ ఆడినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. అయితే, వాస్తవం అది కాదు..ఈ వీడియో పూర్తిగా AI క్రియేషన్‌. CGI (కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్) ఆధారంగా తయారైంది. స్థానిక అధికారులు కూడా దీన్ని ధృవీకరించారు. ఏ చీతా కూడా గ్రామంలో హోలీ ఆడేందుకు రాలేదని స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వీడియోను చూసిన కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు భయంతో తీసుకున్నారు. వాస్తవానికి, చీతాలని ప్రజల మధ్యలోకి తీసుకురావడం, గ్రామస్తులతో కలిసి హోలీ, ఇతర ఆటలు ఆడించడం ప్రమాదకరమే. ఇలాంటి AI వీడియోలు ప్రజల్ని వాస్తం అనుకుని భ్రమ పడేలా చేస్తుండటం ఇప్పుడు కొత్త సమస్యగా మారుతోంది. ప్రముఖ fact-checking వెబ్‌సైట్లు ఈ వీడియోను పరిశీలించి ఇది ఫేక్ వీడియో అని గుర్తించారు. AI వీడియోలు రోజూ ఎక్కువగా వైరల్ అవుతున్న నేపథ్యంలో నెట్‌జన్లు వాటిని నిజమైన వీడియోలు అనుకొని షేర్ చేసుకోవడం, భయపెట్టడం సాధారణమవుతోంది.

వీడియో ఇక్కడ చూడండి…

వీడియోను తయారు చేసిన వారి ఉద్దేశం సరదా కోసం లేదా క్రియేటివ్ వీడియో కోసం అయినా, వాస్తవాన్ని దానితో కలపడం అనర్థకంగా మారుతోంది. నిపుణులు సూచిస్తున్నట్టు, సోషల్ మీడియాలో ఏదైనా వీడియో చూసిన వెంటనే..దాని సోర్స్‌, ప్రామాణికతను చెక్‌చేసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు.

Follow Us
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..