AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ వేడుకల్లో సరికొత్త ట్రెండ్.. ల్యాప్‌టాప్‌తో కలర్‌ఫుల్‌ డ్యాన్స్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం రంగుల పండుగ కూడా రెండు రోజుల పాటు జరుపుకున్నారు జనాలు. మార్చి 3న కొన్ని ప్రాంతాల్లో 4న ఎక్కువ మంది హోలీ వేడుకలు నిర్వహించారు. ఇంతలోనే సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్త ట్రెండ్‌ హోలీ వేడుకలు వైరల్‌ అవుతున్నాయి. ఇది కార్పొరేట్ హోలీ సందడి అంటున్నారు నెటిజన్లు..ఎందుకంటే.. ఈ వీడియో ఒక ప్రముఖ ఐటీ కంపెనీ కార్యాలయంలో జరిగిన హోలీ సందడి. సంబరాల్లో ఉద్యోగులు రంగులతో, సంగీతంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో జరిగిన ఒక సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఒక యువకుడు చేతిలో ల్యాప్‌టాప్‌తో హోలీ కలర్స్‌తో ద్యాన్స్‌ చేయటం హాట్‌టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

హోలీ వేడుకల్లో సరికొత్త ట్రెండ్.. ల్యాప్‌టాప్‌తో కలర్‌ఫుల్‌ డ్యాన్స్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Corporate Holi
Jyothi Gadda
|

Updated on: Mar 04, 2026 | 8:54 AM

Share

గురుగ్రామ్‌లోని ఒక కార్పొరేట్ కార్యాలయం నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొందరు తమను తాముగా చెప్పుకుంటున్నారు.  ల్యాప్‌టాప్‌తో డ్యాన్స్ చేస్తున్న ఉద్యోగిని చూశారు. ఈ వీడియోను గౌరాన్షి అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో రంగుల సముద్రం మధ్య ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తున్న యువకుడితో వీడియో ప్రారంభమవుతుంది. వీడియోలో కొందరు ఉద్యోగులు డీజే సంగీతానికి తాళం వేసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ఒక యువ ఉద్యోగి చేతిలో ల్యాప్‌టాప్ పట్టుకుని స్టెప్పులు వేయడం కనిపిస్తుంది. హోలీ రంగులు చల్లుకుంటూ, ల్యాప్‌టాప్‌తోనే డ్యాన్స్ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది సెకన్ల ఈ క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతూ పెద్ద చర్చకు దారితీసింది.

అందుకే దీనిని కార్పొరేట్ హోలీ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. ఆఫీస్‌లోని ఇతర ఉద్యోగులు కూడా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ, నవ్వుతూ, ఫోటోలకు పోజులిస్తూ కనిపిస్తారు. అయితే, తన ల్యాప్‌టాప్‌తో డ్యాన్స్‌ చేస్తున్న వ్యక్తి మాత్రం సూపర్‌ అంటున్నారు ఇంటర్‌నెట్‌ అభిమానులు. కొంతమంది నెటిజన్లు దీనిని సరదాగా తీసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కార్యాలయ పరికరాలను ఇలా నిర్లక్ష్యంగా ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. కంపెనీ ఆస్తులను సంరక్షించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని పేర్కొంటున్నారు. హోలీ వంటి పండుగల్లో ఉత్సాహం మంచిదే కానీ భద్రతా ప్రమాణాలు పాటించడం కూడా అంతే ముఖ్యమని గుర్తుచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై సంబంధిత కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే కార్యాలయాల్లో హోలీ వేడుకలు నిర్వహించేటప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్వర్లు, ఇతర సున్నితమైన సామగ్రి భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రంగులు, నీరు వంటివి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, నెట్‌వర్క్ పరికరాలకు హానికరం కావచ్చని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేగంగా వైరల్ అవుతోంది. కొందరు దీన్ని సరదా సంఘటనగా చూస్తుండగా, మరికొందరు కార్యాలయ సంస్కృతి, ప్రొఫెషనలిజం అంశాలపై చర్చ మొదలుపెట్టారు. మొత్తానికి, గురుగ్రామ్ కార్పొరేట్ హోలీ వేడుకల్లో ల్యాప్‌టాప్ డ్యాన్స్ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

Follow Us
ఒకప్పుడు విడాకుల కోసం కోర్లు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు
ఒకప్పుడు విడాకుల కోసం కోర్లు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు
గనులు లేని దేశం.. బంగారంలో మాత్రం ప్రపంచంలోనే టాప్!
గనులు లేని దేశం.. బంగారంలో మాత్రం ప్రపంచంలోనే టాప్!
ఈ బ్యాంకుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.5,000 మాత్రమే విత్‌డ్రా
ఈ బ్యాంకుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.5,000 మాత్రమే విత్‌డ్రా
తొలి పోరుకు టీమిండియా రెడీ.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
తొలి పోరుకు టీమిండియా రెడీ.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
100 స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కూటమి పార్టీల స్పందన
100 స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కూటమి పార్టీల స్పందన
పాశాంకుశ ఏకాదశి.. ఈ వ్రతం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం! పూజా విధానం
పాశాంకుశ ఏకాదశి.. ఈ వ్రతం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం! పూజా విధానం
కాళ్లు, చేతులు ఉబ్బుతున్నాయా? శరీరంలో నీరు నిల్వ ఉండటానికి కారణం!
కాళ్లు, చేతులు ఉబ్బుతున్నాయా? శరీరంలో నీరు నిల్వ ఉండటానికి కారణం!
ఓటీటీలోకి వచ్చేసిన నాని సూపర్ హిట్ సినిమా 'ది ప్యారడైజ్'
ఓటీటీలోకి వచ్చేసిన నాని సూపర్ హిట్ సినిమా 'ది ప్యారడైజ్'
ఘోర రోడ్డు ప్రమాదం.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..