AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల వెళ్లే భక్తులకు అండగా టీటీడీ.. చెక్కుల పంపిణీ !!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే తిరుమల యాత్రలో అనుకోని ప్రమాదాలు లేదా ఆరోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయే ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తిరుమలకు వచ్చి సహజ మరణం పొందిన 7మంది భక్తులకు చెందిన కుటుంబ సభ్యులకు టీటీడీ బీమా పరిహారం అందజేసింది.

తిరుమల వెళ్లే భక్తులకు అండగా టీటీడీ.. చెక్కుల పంపిణీ !!
Ttd Free Insurance
Raju M P R
| Edited By: |

Updated on: Nov 24, 2026 | 6:45 PM

Share

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే తిరుమల యాత్రలో అనుకోని ప్రమాదాలు లేదా ఆరోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయే ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత జీవిత బీమా సంస్థ (LIC) సహకారంతో భక్తులకు ఉచిత బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా తిరుమలలో యాత్ర సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల వరకు, సహజ మరణం సంభవిస్తే రూ.2 లక్షల వరకు పరిహారం అందించేలా ప్రత్యేక బీమా పథకాన్ని ప్రకటించింది.

ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు..

కాగా తిరుమల యాత్ర సమయంలో ప్రమాదవశాత్తు మరణించే భక్తుల కుటుంబాలకు గతంలో అందించే రూ.3 లక్షల ప్రమాద బీమా పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు బాధిత భక్తుడి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. దర్శనానికి ముందు రోజు, దర్శనం రోజు, మరుసటి రోజు, తిరుగు ప్రయాణానికి సంబంధించిన కాలంలోనూ బీమా రక్షణ వర్తించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. అలానే భక్తుడు అనారోగ్యం లేదా ఇతర సహజ కారణాలతో మరణిస్తే, వారి కుటుంబానికి రూ.2 లక్షల జీవిత బీమా పరిహారం ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని భక్తుడు ముందుగానే నమోదు చేసుకున్న నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.

చెక్కుల పంపిణీ..

కాగా ఇందులో భాగంగానే గత రెండు నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చి సహజంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎల్ఐసి ఆఫ్ ఇండియా సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామిలతో కలిసి టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ ముద్దాడ రవిచంద్ర రూ.2 లక్షలు బీమా పరిహారాన్ని అందజేశారు. సెప్టెంబర్ 9న ఈ పథకాన్ని ప్రారంభించామని, దేశానికే ఆదర్శవంతంగా ఉండేలా శ్రీవారి యాత్ర సురక్ష పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ ఈవో ముద్దాడ రవిచంద్ర. మిగిలిన వారికి త్వరలో అందిస్తామన్నారు.

ఏడాదిన్నరగా కష్టపడ్డాం…

గత ఏడాది నెరపాటు కష్టపడి దేశానికి ఆదర్శవంతంగా ఈ బీమా పథకాన్ని తీసుకొచ్చా మన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భక్తుల కోసం శ్రీవారి యాత్ర సురక్ష బీమా పథకాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చేందుకు సహకరించిన ఎల్ఐసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో బీమా పరిహారాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరణ ధృవీకరణ పత్రం, నామినీ బ్యాంకు వివరాలు అందిన వెంటనే పరిహారం చెల్లించేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాత్ర సమయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన టీటీడీని అభినందిస్తున్నామన్నారు. అన్ని కుటుంబాలకు సకాలంలో సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశంలో భక్తులకు జీవిత బీమా కవరేజ్ అందించే విషయంలో టీటీడీ మార్గదర్శక సంస్థగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని చూసి తాము కూడా అమలు చేసేందుకు శబరిమలైలోని ట్రావెన్ కోర్ దేవస్థానం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం అధికారులు తమతో సంప్రదింపులు చేసినట్లు తెలియజేశారు.

బాధిత కుటుంబాల భావోద్వేగం..

తిరుమలలో మరణించిన ఏడుగురు కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమకు కష్టకాలంలో చేదోడుగా నిలిచి ఆర్థికంగా ఆదుకున్నందుకు టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. సెప్టెంబర్ 20న తిరుమలలో మరణించిన తమిళనాడుకు చెందిన డి. పప్పాతి (75) అనే భక్తురాలి కుమారుడు ఆర్.రాజేంద్రన్, సెప్టంబర్ 25న మరణించిన హైదరాబాద్ కు చెందిన డి.మహాలక్ష్మీ(74) కుమారుడు డి.శ్రీనివాసరెడ్డి, అక్టోబర్ 8న మరణించిన చెన్నైకు చెందిన నీలవేణి (58) కుమారుడు నవీన్ కుమార్, అక్టోబర్ 9న మరణించిన చెన్నైకు చెందిన టి.డి.గోపినాథ్ (41)అనే భక్తుడి భార్య జి.హరిణి, అక్టోబర్ 11న మరణించిన గుంటూరుకు చెందిన ఎం.దామోదరరావు(82) అనే భక్తుడి కుమారుడు ఎం.ప్రకాశ్, అక్టోబర్ 23న మరణించిన హైదరాబాద్ కు చెందిన భాగ్యమ్మ (45) సోదరుడు మోహనాచారి, అక్టోబర్ 26న మరణించిన చెన్నైకు చెందిన విశ్వనాథన్ రామకృష్ణన్ (63)కుమార్తె గాయత్రిలు చెక్కులు పొందారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్న తమ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించినందుకు టీటీడీ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us
తిరుమల వెళ్లే భక్తులకు అండగా టీటీడీ..
తిరుమల వెళ్లే భక్తులకు అండగా టీటీడీ..
ప్రాణం తీసిన స్నేహం.. అర్ధరాత్రి కత్తులతో వేటాడి దారుణ హత్య..
ప్రాణం తీసిన స్నేహం.. అర్ధరాత్రి కత్తులతో వేటాడి దారుణ హత్య..
నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’.. ఆకట్టుకుంటోన్న ‘అప్సర’ సాంగ్
నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’.. ఆకట్టుకుంటోన్న ‘అప్సర’ సాంగ్
వామ్మో.. కారుకు పెట్రోల్ బదులు డీజిల్ పోస్తే ఏం జరుగుతుందో తెలుసా
వామ్మో.. కారుకు పెట్రోల్ బదులు డీజిల్ పోస్తే ఏం జరుగుతుందో తెలుసా
 చిరిగిన స్వెటర్‌తో ఇన్ని ప్రయోజనాలా? ఇకపై అస్సలు పడేయకండి!
 చిరిగిన స్వెటర్‌తో ఇన్ని ప్రయోజనాలా? ఇకపై అస్సలు పడేయకండి!
పాకిస్థాన్‌లో బయటపడ్డ జైషే ఉగ్రవాద శిబిరాల గుట్టు..!
పాకిస్థాన్‌లో బయటపడ్డ జైషే ఉగ్రవాద శిబిరాల గుట్టు..!
త్వరలో భాగ్యవంతులు కాబోతున్న రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
త్వరలో భాగ్యవంతులు కాబోతున్న రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
తెలుగులో ఆ హీరో నా ఫెవరేట్ పర్సన్..
తెలుగులో ఆ హీరో నా ఫెవరేట్ పర్సన్..
రోజూ అలసటగా ఉంటున్నారా? శరీరంలో ఈ విటమిన్ తగ్గిందేమో తెలుసుకోండి
రోజూ అలసటగా ఉంటున్నారా? శరీరంలో ఈ విటమిన్ తగ్గిందేమో తెలుసుకోండి
మారుతి కార్ల కొనుగోలుదారులకు బిగ్ షాక్.. పెరిగిన ధరలు..
మారుతి కార్ల కొనుగోలుదారులకు బిగ్ షాక్.. పెరిగిన ధరలు..