AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రాణం తీసిన స్నేహం.. అర్ధరాత్రి కత్తులతో వేటాడి దారుణ హత్య.. అసలేం జరిగిందంటే.?

కష్టసుఖాల్లో తోడుండాల్సిన ప్రాణస్నేహితుడే కాలయముడిగా మారాడు. చిన్నపాటి మనస్పర్థలు, ఫోన్ వాగ్వాదాలతో మిత్రుడనే కనికరం కూడా లేకుండా నడిరోడ్డుపై కత్తులతో వేటాడి హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఆ స్నేహితుల మధ్య ఏం జరిగింది? సాక్ష్యాలు మాయం చేసి పారిపోతున్న నిందితులను పోలీసులు గంటల్లోనే ఎలా పట్టుకున్నారో తెలుసుకుందాం..

Telangana: ప్రాణం తీసిన స్నేహం.. అర్ధరాత్రి కత్తులతో వేటాడి దారుణ హత్య.. అసలేం జరిగిందంటే.?
Friendship Turns Fatal In Godavarikhani
G Sampath Kumar
| Edited By: |

Updated on: Nov 24, 2026 | 6:44 PM

Share

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షలు, ఫోన్ వాగ్వాదాల నేపథ్యంలో అట్ల రాజశేఖర్ అనే యువకుడిని అతని స్నేహితుడే మరో ముగ్గురితో కలిసి అర్ధరాత్రి నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్య చేశాడు. మృతుడి తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 22న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి రాలేదు. మరుసటి రోజు తెల్లవారుజామున 1:10 గంటల సమయంలో రాజశేఖర్ తన బైక్‌పై మరో వ్యక్తితో కలిసి ఇంటికి వెళ్తుండగా పవర్ హౌస్ కాలనీలోని అప్పటికే మాటువేసిన నిందితులు అడ్డగించారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో రాజశేఖర్ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వన్ టౌన్ ఇన్‌ఛార్జ్ సీఐ లింగమూర్తి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

హత్య వెనుక అసలు కారణం ఇదే..

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు ఎన్నం ప్రసాద్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఇతనికి రాజశేఖర్‌తో గతంలో సన్నిహిత సంబంధం ఉండేది. అయితే గత ఆరు నెలలుగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఫోన్‌లో జరిగిన వాగ్వాదాలు, పరస్పర దూషణలు, కుటుంబ సభ్యులను దుర్భాషలాడటంతో ప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. రాజశేఖర్‌ను అంతమొందించాలని నిర్ణయించుకుని తన మిత్రులైన శ్రవణ్ కుమార్, ఐలి దేవేందర్, బోరే మల్లేష్‌లతో కలిసి పథకం రచించాడు. ముందుగానే కత్తులు కొనుగోలు చేసి, 22న సాయంత్రం మళ్లీ ఫోన్‌లో వాగ్వాదం జరిగిన తర్వాత బృందావన్ గార్డెన్స్‌లో ఓ కార్యక్రమానికి హాజరై, అనంతరం రాజశేఖర్ కోసం రోడ్డుపై కాపు కాసి హత్యకు పాల్పడ్డారు.

సాక్ష్యాలు చెరిపేసి పారిపోతుండగా..

హత్య చేసిన తర్వాత నిందితులు తమ రక్తపు మరకలున్న దుస్తులను కాల్చివేసి, బూడిదను గోదావరి నదిలో కలిపి సాక్ష్యాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. అనంతరం ఆటోలో కాల్వ శ్రీరాంపూర్ వైపు పారిపోతుండగా.. గోదావరిఖని ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా వద్ద నలుగురు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

ఆటో, కత్తులు స్వాధీనం.. డీసీపీ హెచ్చరిక

నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన పసుపు రంగు ఆటో, రెండు కత్తులు, మూడు సెల్‌ఫోన్లు, రక్తపు మరకలున్న టీ-షర్టును పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత కక్షలను హింసాత్మకంగా పరిష్కరించుకోవాలని చూసే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

Follow Us
ప్రాణం తీసిన స్నేహం.. అర్ధరాత్రి కత్తులతో వేటాడి దారుణ హత్య..
ప్రాణం తీసిన స్నేహం.. అర్ధరాత్రి కత్తులతో వేటాడి దారుణ హత్య..
నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’.. ఆకట్టుకుంటోన్న ‘అప్సర’ సాంగ్
నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’.. ఆకట్టుకుంటోన్న ‘అప్సర’ సాంగ్
వామ్మో.. కారుకు పెట్రోల్ బదులు డీజిల్ పోస్తే ఏం జరుగుతుందో తెలుసా
వామ్మో.. కారుకు పెట్రోల్ బదులు డీజిల్ పోస్తే ఏం జరుగుతుందో తెలుసా
 చిరిగిన స్వెటర్‌తో ఇన్ని ప్రయోజనాలా? ఇకపై అస్సలు పడేయకండి!
 చిరిగిన స్వెటర్‌తో ఇన్ని ప్రయోజనాలా? ఇకపై అస్సలు పడేయకండి!
పాకిస్థాన్‌లో బయటపడ్డ జైషే ఉగ్రవాద శిబిరాల గుట్టు..!
పాకిస్థాన్‌లో బయటపడ్డ జైషే ఉగ్రవాద శిబిరాల గుట్టు..!
త్వరలో భాగ్యవంతులు కాబోతున్న రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
త్వరలో భాగ్యవంతులు కాబోతున్న రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
తెలుగులో ఆ హీరో నా ఫెవరేట్ పర్సన్..
తెలుగులో ఆ హీరో నా ఫెవరేట్ పర్సన్..
రోజూ అలసటగా ఉంటున్నారా? శరీరంలో ఈ విటమిన్ తగ్గిందేమో తెలుసుకోండి
రోజూ అలసటగా ఉంటున్నారా? శరీరంలో ఈ విటమిన్ తగ్గిందేమో తెలుసుకోండి
మారుతి కార్ల కొనుగోలుదారులకు బిగ్ షాక్.. పెరిగిన ధరలు..
మారుతి కార్ల కొనుగోలుదారులకు బిగ్ షాక్.. పెరిగిన ధరలు..
గుడ్లు ఉడకబెట్టినప్పుడు నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు పెంకు ఈజీగా..
గుడ్లు ఉడకబెట్టినప్పుడు నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు పెంకు ఈజీగా..