సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
Telangana: సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన చనిపోయిన అభ్యర్థి.. చివరకు అధికారులు ఏం చేశారంటే..?
ఆ గ్రామ సర్పంచ్ ఎన్నికలో విషాదం..విజయం కలగలిశాయి. నామినేషన్ వేశాక మరణించిన చెర్ల మురళికి అనూహ్య విజయం దక్కింది. సాధారణంగా ఎన్నిక నిలిపివేయాల్సి ఉన్నా, అధికారులు కొనసాగించారు. ఈ క్రమంలో ఉపసర్పంచ్ను ఎన్నుకున్నారు కానీ.. సర్పంచ్ ఎన్నికపై అధికారులు కీలక ప్రకటన చేశారు.
- G Sampath Kumar
- Updated on: Dec 12, 2025
- 8:27 am
ఓటు వేసేందుకు వెళ్లి.. బ్యాలెట్ పేపర్లను కసపస నమిలి మింగేసిన మందుబాబు!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో శాంతియుతంగా ఓటింగ్ జరుగుతుండగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో మాత్రం ఓ విచిత్ర ఘటన నమోదైంది. మద్యం మత్తులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన వెంకట్ అనే ఓటరు
- G Sampath Kumar
- Updated on: Dec 11, 2025
- 5:35 pm
Telangana: పుట్టిన రోజు నాడే తీవ్ర విషాదం.. సాంబారులో పడి 4 ఏళ్ల బాలుడు మృతి!
పెద్దపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన పుట్టినరోజున ప్రమాదవశాత్తు వేడి సాంబారు పాత్రలో పడి నాలుగేళ్ల బాలుడు మరణించిన విషాదకరమైన సంఘటన ఇది. మల్లాపూర్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హై స్కూల్లో మొగిలి మధుకర్ తాత్కాలిక వంటవాడిగా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు మోక్షిత్ అనే బాలుడు వంటగది ప్రాంతంలో ఆడుకుంటున్నాడు.
- G Sampath Kumar
- Updated on: Dec 10, 2025
- 8:31 am
చిన్న ప్రయత్నం.. ప్రయాణికుల మనసులు గెలుచుకుంటున్న ఆర్టీసీ.. ఏం చేశారో తెలుసా?
ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు బస్సుల్లో ప్రయాణికులను కండక్టర్లు పలకరించే ప్రత్యేక విధానం ప్రవేశపెట్టారు.
- G Sampath Kumar
- Updated on: Dec 10, 2025
- 8:32 am
Watch Video: ఎన్నికల వేళ వినూత్న హామీ.. ఆడపిల్ల పుడితే రూ. 10వేలు ఫిక్స్ డిపాజిట్!
Congress candidate promise in Karimnagar Gram Panchayat elections 2025: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓ గ్రామపంచాయతీలో ఆడపిల్ల పుడితే రూ. పదివేలు ఫిక్స్ డిపాజిట్ చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఓటర్ల మన్ననలు దక్కించుకోవడానికి ఎలాగైనా భిన్నంగా కనిపించాలన్నదే నేతల..
- G Sampath Kumar
- Updated on: Dec 8, 2025
- 6:14 pm
Telangana: సాధారణంగా కనిపించే సత్తయ్య.. ఓ అసాధారణ మనిషి..
జగిత్యాల జిల్లా, ఇటిక్యాల గ్రామంలో ఇంటర్మీడియెట్ వరకే చదువుకున్న సుంకిసాల సత్తయ్య ప్రకృతిపై ప్రేమతో గ్రామానికే పచ్చదనం ఉట్టిపడేలా గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తి. చెట్లు కూడా మనలాంటి జీవులే.. అని చెప్పే సత్తయ్య జీవితం, పర్యావరణం పట్ల మనలో మళ్లీ ఆలోచన రేకెత్తించేలా ఉంటుంది.
- G Sampath Kumar
- Updated on: Dec 8, 2025
- 11:15 am
Telangana: అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది..
కొడుకులే లోకం అనుకుంది.. కళ్ల ముందే వాళ్లు పెరిగి పెద్దై, తమకు అండగా ఉంటారని కలలు కంది. కన్నబిడ్డలపై ఆమె పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. అస్తి పంపకాలతో పాటు అమ్మను కూడా పంచుకున్న కొడుకులు... చివరికి ఆమెను అనాథలా వదిలేశారు. ఈ అమానుష ఘటన జగిత్యాలలో జరిగింది.
- G Sampath Kumar
- Updated on: Dec 7, 2025
- 9:55 am
Watch: ఇది కదా కావాల్సింది.. ఎన్నికల ముందే ప్రజల సమస్యలు తీరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి.. ఎక్కడంటే
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఇంకా కేవలం వారం రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీనంగర్ జిల్లాలోని సర్పంచ్ అభ్యర్థులు ప్రజల డిమాండ్లు పోలింగ్ కంటే ముందే తీర్చేస్తున్నారు. ఎందుకంటే.. అక్కడి గ్రామస్తులు తమకున్న ప్రధాన సమస్యను ఎవరు తీరుస్తే వారికే ఓటేస్తామని తేల్చి చెప్పడంతో.. అభ్యర్థులు ఆ పనుల్లో మునిగిపోయారు. ఇంతకు జనాలకొచ్చిన అంత పెద్ద సమస్య ఏంటో తెలుసుకుందాం పదండి.
- G Sampath Kumar
- Updated on: Dec 4, 2025
- 4:07 pm
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. సినీ ఫక్కీలో సొంత అన్నను చంపిన తమ్ముడు!
ఆర్థిక ఇబ్బందుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి, ఏకంగా తన అన్ననే అత్యంత కిరాతకంగా హత్య చేసి, దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని పన్నిన కుట్రను కరీంనగర్ జిల్లా పోలీసులు ఛేదించారు. రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో, ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు..
- G Sampath Kumar
- Updated on: Dec 3, 2025
- 12:26 pm
Telangana: చూశారా ఈ చిత్రం.. తల్లిపై పోటీకి దిగిన కూతురు.. ఇద్దరికీ ప్రధాన పార్టీల మద్దతు
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా తిమ్మయ్య పల్లెలో సర్పంచ్ పదవికి తల్లీ–కూతురు ఎదురెదురుగా బరిలో దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో తల్లి గంగవ్వ, ఆమె కూతురు సుమలత ఇద్దరూ పోటీకి సై అన్నారు .
- G Sampath Kumar
- Updated on: Dec 2, 2025
- 5:23 pm
Viral News: సర్పంచ్ పోస్ట్ కావాలా?.. నోట్లు వద్దు.. కోతులను తరిమితే చాలు.. అభ్యర్థులకు సరికొత్త డిమాండ్!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిల మేనియా కొనసాగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఇలా ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు చాలా గ్రామాల్లో ఒకే డిమాండ్ వినిపిస్తుంది.. మాకు ఓటుకు నోటు అక్కర్లే.. ఒక సమస్యను తీర్చుతే చాలంటున్నారు. గ్రామస్తులు.. మా సమస్యను ఎవరు తీరుస్తే వాళ్లకే ఓటేస్తామని చెబుతున్నారు. ఇంతకూ వాళ్ల సమస్య ఏంటో తెలుసుకుందాం పదండి.
- G Sampath Kumar
- Updated on: Dec 2, 2025
- 1:43 pm
Telangana: రోజూ సమాధి దగ్గర తిరుగుతున్న ఓ మహిళ.. అనుమానమొచ్చి ఆరా తీయగా
తల్లి సమాధి వద్దే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. కనీసం 24 గంటల పాటు అక్కడే ఉంది. రాత్రి అక్కడే ఉంటోంది. కుటుంబ సభ్యులు ఎంత వెనక్కి తీసుకొచ్చినా మళ్ళీ అక్కడికే వెళ్తుంది. రాత్రి పూట ఉండటంతో స్థానికులు భయపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆఫ్రిన్ తండ్రి.
- G Sampath Kumar
- Updated on: Dec 2, 2025
- 12:07 pm