AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Records : క్రికెట్ చరిత్రలోనే అసంభవం.. కేవలం 2 బంతుల్లోనే హ్యాట్రిక్ కొట్టిన మ్యాజిక్ స్పిన్నర్

Cricket Records : ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న వేళ ప్రవీణ్ తాంబే అరుదైన రికార్డు వైరల్ అవుతోంది. 2014లో కేవలం 2 బంతుల్లోనే హ్యాట్రిక్ తీసి ఆయన అసాధ్యమైన రికార్డును నెలకొల్పారు.41 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రవీణ్ తాంబే.

Cricket Records : క్రికెట్ చరిత్రలోనే అసంభవం.. కేవలం 2 బంతుల్లోనే హ్యాట్రిక్ కొట్టిన మ్యాజిక్ స్పిన్నర్
Pravin Tambe
Rakesh
|

Updated on: Mar 18, 2026 | 1:01 PM

Share

Cricket Records : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ మార్చి 28 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ అంటేనే రికార్డుల సముద్రం. గత 18 సీజన్లలో ఎందరో బౌలర్లు హ్యాట్రిక్‌లు సాధించినా, ఒకే ఒక్కడి రికార్డు మాత్రం నేటికీ వింతగా, అద్భుతంగా మిగిలిపోయింది. ఆ రికార్డు సృష్టించిన ఆటగాడు మరెవరో కాదు.. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రవీణ్ తాంబే. ఆయన జీవితం ఆధారంగా కౌన్ ప్రవీణ్ తాంబే అనే సినిమా కూడా వచ్చిందంటే ఆయన ప్రయాణం ఎంతమంది ప్లేయర్లకు స్ఫూర్తిదాయకమో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా క్రికెట్‌లో వరుసగా మూడు బంతుల్లో ముగ్గురు బ్యాటర్లను అవుట్ చేస్తే దానిని హ్యాట్రిక్ అంటారు. కానీ, ప్రవీణ్ తాంబే మాత్రం కేవలం రెండు లీగల్ బంతుల్లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించారు. 2014 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మీద ఆయన ఈ అసాధ్యమైన ఫీట్‌ను నమోదు చేశారు. అప్పట్లో ఈ వింత హ్యాట్రిక్ చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టింది. అసలు రెండు బంతుల్లో మూడు వికెట్లు ఎలా సాధ్యమయ్యాయో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఆ మ్యాచ్‌లో 16వ ఓవర్ వేయడానికి వచ్చిన తాంబే.. మొదటి బంతిని గూగ్లీగా వేశారు. ఆ బంతిని ఆడటంలో మనీష్ పాండే తడబడటంతో వికెట్ కీపర్ సంజు శామ్సన్ రెప్పపాటులో స్టంపింగ్ చేశాడు. అయితే, ఆ బంతి వైడ్ కావడంతో అంపైర్ దానిని లీగల్ డెలివరీగా పరిగణించలేదు. కానీ నిబంధనల ప్రకారం బ్యాటర్ అవుట్ అయ్యాడు కాబట్టి వికెట్ తాంబే ఖాతాలోకి చేరింది. ఆ తర్వాత వేసిన మొదటి లీగల్ బంతికి యూసుఫ్ పఠాన్ అవుట్ అవ్వగా, రెండో బంతికి రయాన్ టెన్ డోషేట్ పెవిలియన్ చేరాడు. ఇలా వైడ్ బాల్‌తో కలిపి మూడు వికెట్లు పడటంతో కేవలం రెండు లీగల్ బంతులకే హ్యాట్రిక్ పూర్తయ్యింది.

ఈ రికార్డుతో పాటు ఆ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పేరిట ఒక అవాంఛిత రికార్డు కూడా నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం లభించినప్పటికీ, మ్యాచ్ ఓడిపోయిన మొదటి జట్టుగా కేకేఆర్ నిలిచింది. అంతకుముందు 2010లో ఛాంపియన్స్ లీగ్ టీ20లో ఇసురు ఉదానా కూడా ఇలాగే రెండు బంతుల్లో హ్యాట్రిక్ తీయగా, ఐపీఎల్‌లో మాత్రం ప్రవీణ్ తాంబే మాత్రమే ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈసారి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ గోల్డెన్ రికార్డు గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు మళ్లీ చర్చించుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us