Digbala Yoga 2026: వీరికి దిగ్బల యోగం.. నిరుపేద అయినా సంపన్నుడయ్యే ఛాన్స్..!
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన యోగాల్లో దిగ్బల యోగం ఒకటి. ప్రస్తుతం ఆరు రాశుల వారికి ఈ యోగ ప్రభావం వల్ల అదృష్టం అనూహ్యంగా మారబోతోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు.. ఇలా ఏ రంగంలో ఉన్నా ఊహించని పురోగతి సాధించే అవకాశముంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులేవి? వీరి జీవితంలో ఎలాంటి శుభపరిణామాలు చోటుచేసుకోనున్నాయి?

గురువు ఒకటవ రాశిలో, బుధుడు ఒకటవ రాశిలో, చంద్ర, శుక్రులు చతుర్థంలో, శని సప్తమంలో, రవి, కుజులు దశమంలో సంచారం చేస్తున్నప్పుడు దిగ్బల యోగం ఏర్పడుతుంది. దిగ్బల యోగం కలిగినప్పుడు కొన్ని రాశులవారికి పట్టపగ్గాలుండవు. వారు ఎటువంటి కార్యాన్నయినా సాధిస్తారు. ప్రస్తుతం కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారికి ఈ దిగ్బల యోగం ఏర్పడింది. దీనవల్ల ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ ఊహించని పురోగతి ఉంటుంది. నిరుపేద అయినప్పటికీ, సంపన్నుడయ్యే అవకాశం కలుగుతుంది. జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి జనవరి 2 వరకు దిగ్బల యోగం ఏర్పడింది. శుక్రుడు చతుర్థంలో ఉన్నప్పుడు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అను కూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. వ్యాపారాల్లో మహా భాగ్య యోగం పడుతుంది. ఆదాయం దిన దినాభి వృద్ధి చెందుతుంది. సుఖ సంతోషాలకు లోటుండదు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
సింహ రాశి
ఈ రాశిలో గురువు స్థితి వల్ల ఈ రాశివారికి జనవరి 25 వరకు దిగ్బల యోగం పట్టింది. ఉద్యోగు లకు తప్పకుండా హోదా, ప్రాధాన్యం పెరుగుతాయి. జీవనశైలిలో మార్పులు, చేర్పులు చోటు చేసు కుంటాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగు లకు మంచి కంపెనీల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.
కన్య రాశి
ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఈ ఏడాదంతా దిగ్బల యోగం కలిగింది. ఫలితంగా ఉద్యోగంలో ఒక వెలుగు వెలుగుతారు. ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. రాజకీయ ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
తులా రాశి
ఈ రాశిలో బుధుడి సంచారం వల్ల మరో పది రోజుల వరకు దిగ్బల యోగం ఏర్పడింది. ఈ రాశి వారు చేపట్టే ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. జనాకర్షణ వృద్ధి చెందుతుంది. లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహా రాలు బాగా మెరుగుపడతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడం లేదా సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. అంచనాలకు మించిన రాబడి ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశికి దశమ స్థానంలో కుజ గ్రహ సంచారం వల్ల ఈ రాశివారికి ఈ ఏడాదంతా దిగ్బల రాజ యోగం కలిగింది. సుఖ సంతోషాలకు లోటుండదు. ఉద్యోగ జీవితంలో జీతభత్యాలు, ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు అవకాశాలు, ఆఫర్లు అందుతాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ బాగాపెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
కుంభ రాశి
ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడింది. ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాల్ని బాగా పెంచుకుంటారు. విద్యార్థులకు చదువుల్లో మంచి అవకాశాలు అందుతాయి. ఉన్నత కుటుంబంలో పెళ్లి ఖాయం అవుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. అధికారులకు మీ సలహాలు ఉపయోగపడతాయి. ఆర్థికంగా ఉన్నతస్థాయికి వెడతారు.



