AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్క – కొండముచ్చు.. అదిరిపోయే దోస్తీ.. జాతి వైరం మరచి వీటి స్నేహం చూస్తే ముచ్చట పడాల్సిందే!

Dog and Monkey Friendship: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ కుక్క, కొండముచ్చు మధ్య అరుదైన స్నేహం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోజూ కుక్క దగ్గరకు వచ్చే కొండముచ్చు దానితో కలిసి ఆటలు ఆడుతూ, ముద్దులు పెడుతూ గారాబం చేస్తోంది. సాధారణంగా ఒకదానిని చూసి మరొకటి భయపడే ఈ జంతువులు ఇక్కడ మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాయి. వీటి స్నేహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కుక్క - కొండముచ్చు.. అదిరిపోయే దోస్తీ.. జాతి వైరం మరచి వీటి స్నేహం చూస్తే ముచ్చట పడాల్సిందే!
Dog And Monkey Friendship
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 26, 2026 | 6:23 PM

Share

ఖమ్మం: కుక్కకి, కోతికి పడదంటారు.. కానీ ఖమ్మంలో మాత్రం రివర్స్! ఈ రెండింటి స్నేహం చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే!. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ వ్యక్తి పెంచుకుంటున్న కుక్క దగ్గరికి రోజూ గ్రామంలోని ఓ కొండముచ్చు వస్తుంది. వచ్చీరాగానే రెండూ కలిసి ఆడుకోవడం, ఒకదానికొకటి ముద్దులు పెట్టుకోవడం, ఒకదానిని ఒకటి గారాబం చేయడం చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది. సాధారణంగా కుక్కను చూస్తే కొండముచ్చు పారిపోతుంది. కొండముచ్చును చూస్తే కుక్క మొరుగుతుంది. కానీ, ఇక్కడ మాత్రం కథే వేరు. జాతి వేరైనా.. మనసు ఒక్కటైన ఈ రెండింటి అన్యోన్యతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు.

మనుషుల్లో లేని స్నేహం.. మూగజీవాల్లో ఉందని అంటున్నారు. ప్రతి రోజూ సరదాగా గెంతుతూ ఉండే వీటిని చూసి స్థానికులు అబ్బురపడుతున్నారు. సహజంగా కుక్క లను చూస్తే కోతులు పరుగెత్తుతాయి. ప్రస్తుతం ఈ కుక్క – కొండముచ్చు దోస్తీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది!.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us