ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం. పాల్వంచ వద్ద కారు డోర్ అకస్మాత్తుగా తెరచుకోవడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. సగ్గు రాఘవేందర్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా, ఆవుల మహేశ్వర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
- N Narayana Rao
- Updated on: Dec 4, 2025
- 8:56 pm
Telangana: రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి.. తప్పిన భారీ ప్రమాదం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు. దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటన కుక్క స్పాట్‌లో మృతి చెందింది.
- N Narayana Rao
- Updated on: Dec 3, 2025
- 7:11 pm
ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి, ఇద్దరికి సీరియస్
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. సత్తుపల్లిలో బుధవారం (డిసెంబర్ 03)తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందారు.
- N Narayana Rao
- Updated on: Dec 3, 2025
- 10:36 am
అయ్యో దేవుడా.. అప్పటివరకు సంతోషంగా ఆడుకున్న చిన్నారి.. కట్‌చేస్తే.. విగతజీవిగా..
ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఓ చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పటి వరకు ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారి సడెన్‌గా కనిపించకుండా పోయింది. బిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలు మొత్తం వెతికినా ఎలాంటి జాడ దొరకలేదు. తీరా మరుసటి రోజూ ఉదయం సమీపంలో ఉన్న నీటి సంపులో సెవమై కనిపించింది. అది చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- N Narayana Rao
- Updated on: Dec 2, 2025
- 11:03 am
Telangana: ఊర్లో అందరి నీటి, ఇంటి పన్నులు కట్టేస్తా.. సర్పంచ్ అభ్యర్థి వినూత్న ఆఫర్.. ఎక్కడంటే?
ఎన్నికలు మొదలయ్యాయంటే చాలూ.. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్ల వద్దకు క్యూ కడుతారు. వాళ్ల నుంచి ఓట్లు పొందేందుకు ఓటర్లకు రకరకాల హామీలను ఇస్తుంటారు. మరికొందరు ఓటర్లకు స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకొని.. తనను గెలిపిస్తే.. ఈ సమస్యలను పరిష్కరిస్తానని చెబుతుంటారు. తాజాగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.
- N Narayana Rao
- Updated on: Nov 28, 2025
- 6:44 pm
Bhadrachalam: భద్రాచలం రామాలయంలో నకిలీ శేష వస్త్రాల విక్రయం!
ధర్మమూర్తిగా కొలిచే భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో శేష వస్త్రాలపై రగడ నెలకొంది. ఆలయంలోని శేష వస్త్రాల కౌంటర్‌లో భక్తులకు విక్రయించేందుకు నకిలీ వస్త్రాలను పెడుతుండగా SPF సిబ్బంది గుర్తించారు. శేష వస్త్రాల కౌంటర్ నందు బార్ కోడ్ లేని నకిలీ వస్త్రాలైన చీరలు, పంచలు కండువాలను స్వాధీనం చేసుకుని ఈవో కార్యాలయానికి తరలించారు.
- N Narayana Rao
- Updated on: Nov 27, 2025
- 4:04 pm
Telangana: గెలిచిన నిశ్శబ్ద ప్రేమ.. పోలీస్ స్టేషన్‌లో ఒక్కటైన ‘మూగ’ జంట!
ప్రేమకు ఏది అడ్డుకాదు.. ప్రాంతం, కులం, మతం అనే భేదాలు ఉండవు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలు.. రెండు మనస్సులు వారిని దగ్గర చేస్తాయి. ప్రేమకు మాటలు అవసరం ఉండదని, భావం ఉంటే చాలు అనేది అక్షరాలా నిజం చేసిన అరుదైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. బూర్గంపాడులో పోలీసుల సాక్షిగా ఓ మూగ జంట ప్రేమ వివాహం చేసుకుంది.
- N Narayana Rao
- Updated on: Nov 27, 2025
- 3:48 pm
మా గోడు పరిష్కరించండి మహాప్రభో.. తహసీల్దార్ కార్యాలయంలో రైతు దంపతులు ఏం చేశారంటే..
ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.. అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఎక్కడి సమస్య అక్కడే అన్నట్లు తయారైంది. తన సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు చెందిన రైతు ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే అడ్డంగా పడుకొని వినూత్న నిరసన తెలిపాడు.
- N Narayana Rao
- Updated on: Nov 25, 2025
- 2:02 pm
Telangana: ఆదివారం స్నేహితులతో కలిసి పిక్‌నిక్‌కి వెళ్లాడు.. కాసేపటికే విగతజీవిగా
ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి ఈ యువకుడు పిక్ నిక్‌కు వెళ్లాడు. దగ్గరలోని వాగుకు వెళ్లారు. ఇక అందరూ కలిసి అందులో ఈతకు దిగారు. అయితే ఈ యువకుడు కాసేపటికే విగతజీవిగా తిరిగొచ్చాడు. ఆపై ఏం జరిగింది.? ఈ వార్తలో చూసేద్దాం మరి.
- N Narayana Rao
- Updated on: Nov 24, 2025
- 9:46 am
Vanajeevi Ramaiah: తెరపైకి వనజీవి రామయ్య బయోపిక్.. లీడ్ రోల్‌లో టాలీవుడ్ ప్రముఖ నటుడు
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా పేరుగాంచిన వనజీవి దరిపల్లి రామయ్య జీవితం ఇప్పుడు వెండితెరపైకి రానుంది. వేముగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బయోపిక్ షూటింగ్ ఖమ్మం బల్లేపల్లిలో ప్రారంభమైంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ రామయ్య పాత్రలో నటిస్తున్నారు. ..
- N Narayana Rao
- Updated on: Nov 22, 2025
- 9:03 am
Telangana: సంక్రాంతి లక్కీ డ్రా.. రూ.500కే.. రూ.30లక్షల ప్లాట్.. సీన్ కట్‌చేస్తే..
సంక్రాంతి మెగా బంపర్ ఆఫర్.. మీ దగ్గర 500 రూపాయలు ఉన్నాయా.. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ లక్కీ డ్రాలో పాల్గొని 30 లక్షల విలువైన ప్లాట్ పొందండి అంటూ జనాలు నుంచి లక్షల రుపాయలు కాజేసింది ఓ ముఠా. తీరా ప్లాన్ బెడిసి కొట్టి అడ్డంగా పోలీసులకు దొరికిపోయి జైల్లో ఊసలు లెక్కెడుతోంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.
- N Narayana Rao
- Updated on: Nov 21, 2025
- 6:14 pm
Watch: హైవేపై బైక్ స్టంట్స్‌తో.. గాల్లో తేలుతూ విన్యాసాలు.. కట్‌చేస్తే.. షాకింగ్ వీడియో
పట్టపగలే యువకులు రెచ్చిపోయారు. మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్లు స్థానికులు వారిస్తున్నా.. వినకుండా హైవేపై గాల్లో తేలుతూ వాహనదారులను భయ బ్రాంతులకు గురి చేశారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు పోకిరీల స్టంట్స్ వీడియోలను రికార్డ్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.
- N Narayana Rao
- Updated on: Nov 21, 2025
- 2:53 pm