AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంట్రా ఇలా ఉన్నారు.. బతికుండగానే 39 మందిని చంపేశారు.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి గుట్టుగా..

భార్యాభర్తలిద్దరూ.. ఎల్ఐసీ ఏజెంట్లు.. అందరినీ.. మంచిగా బోల్తా కొట్టించి.. ఎల్ఐసీ కట్టించేవారు.. ఈ క్రమంలోనే.. ఓ భారీ స్కామ్ కు తెరలేపారు.. సినీ ఫక్కీలో భారీ మోసానికి పాల్పడి కోట్లు కొట్టేశారు. ఈ షాకింగ్ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. భార్యాభర్తలైన ఇద్దరు LIC ఏజెంట్లు.. భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో సినీ ఫక్కీలో భారీ మోసానికి పాల్పడి కోట్లు కొట్టేశారు.

ఏంట్రా ఇలా ఉన్నారు.. బతికుండగానే 39 మందిని చంపేశారు.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి గుట్టుగా..
Wife Husband (representative image)
N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 04, 2026 | 12:59 PM

Share

భార్యాభర్తలిద్దరూ.. ఎల్ఐసీ ఏజెంట్లు.. అందరినీ.. మంచిగా బోల్తా కొట్టించి.. ఎల్ఐసీ కట్టించేవారు.. ఈ క్రమంలోనే.. ఓ భారీ స్కామ్ కు తెరలేపారు.. సినీ ఫక్కీలో భారీ మోసానికి పాల్పడి కోట్లు కొట్టేశారు. ఈ షాకింగ్ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. భార్యాభర్తలైన ఇద్దరు LIC ఏజెంట్లు.. భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో సినీ ఫక్కీలో భారీ మోసానికి పాల్పడి కోట్లు కొట్టేశారు. వివరాల ప్రకారం.. అశ్వాపురం మండలానికి చెందిన అలువాల వెంకటేశ్వర్లు LIC లో జోనల్ క్లబ్ మెంబర్ గా ఉండగా.. అతని భార్య సరస్వతి LIC ఏజెంటుగా పని చేస్తుంది. ఇక వీరిద్దరూ నిరుపేదలు, అమాయకులను ఆసరాగా చేసుకొని అశ్వాపురం సీతారాంపురం, నెల్లిపాక బంజర ప్రాంతాల్లో LIC పాలసీలు కట్టిచ్చారు.. అయితే.. వారు బతికుండగానే 39 మంది నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించి.. ఏకంగా రూ. 1.52 కోట్లను కాజేశారు ఈ కేటుగాళ్లు.

బతికున్న వ్యక్తులను చనిపోయినట్లుగా చిత్రీకరించి, గ్రీన్ ఇంకుతో గెజిటెడ్ సంతకాలు పెట్టి, నకిలీ పత్రాలతో క్లెయిమ్‌లు పొందిన ఈ ఘరానా మోసం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సిన LIC యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో, ఈ కేటుగాళ్లు సులభంగా కోటిన్నర రూపాయలకు పైగా సొమ్మును డ్రా చేసుకున్నారు.

అయితే.. అంతర్గత తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడటంతో భద్రాచలం LIC బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంత భారీ మొత్తంలో నగదు పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు గుర్తించలేకపోయారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

​​భద్రాచలం బ్రాంచ్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో పాలసీదారుల్లో ఆందోళన మొదలైంది.​ బ్రాంచ్ అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరగడం సాధ్యమేనా?​ నకిలీ పత్రాలను వెరిఫై చేయడంలో సిబ్బంది ఎందుకు విఫలమయ్యారు? ​సాధారణ ప్రజలకు క్లెయిమ్ రావాలంటే నెలల తరబడి తిప్పించే అధికారులు, ఈ కేటుగాళ్లకు ఎలా సహకరించారు? ​అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ సంస్థలో ఇలాంటి ఘరానా మోసాలు చోటుచేసుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ