AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హ్యాపీడేస్’ హీరో టైసన్ ఇప్పుడెలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసా? లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవుతారంతే

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాలో నటించిన వారిలో ప్రస్తుతం తమన్నా, వరుణ్ సందేశ్, నిఖిల్ సిద్ధార్థ మాత్రమే ఇప్పుడు రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు అడపా దడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నారు. మరికొందరైతే పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయారు.

'హ్యాపీడేస్' హీరో టైసన్ ఇప్పుడెలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసా? లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవుతారంతే
Happy Days Movie Tyson
Basha Shek
|

Updated on: Apr 14, 2026 | 4:06 PM

Share

టాలీవుడ్ ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా హ్యాపీ డేస్. 2007లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ జీవితాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా రిలీజై 19 ఏళ్లు గడిచిపోయాయి. అయినా టీవీలో వస్తే ఇప్పటికీ ఛానెల్ మార్చకుండా చూసే వారు చాలా మంది ఉన్నారు. కాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమాలో దాదాపు అందరూ కొత్త వారే నటించారు. వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ, గాయత్రీ రావు, టైసన్ (రాహుల్), సోనియా దీప్తి, కృష్ణుడు తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రల్లో మెరిశారు. అయితే వీరిలో ఇప్పుడు కొందరు మాత్రమే రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు. తమన్నా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంటే నిఖిల్ సిద్ధార్థ కూడా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇక వరుణ్ సందేశ్ కూడా జయపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక మిగతా వారు మాత్రం పెద్దగా సినిమాలు చేయడం లేదు.

కాగా హ్యాపీడేస్ సినిమాలో టైసన్ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది. ఫన్ తో పాటు ఎమోషనల్ మిక్స్ చేసి రూపొందించిన ఈ పాత్రలో రాహుల్ అద్భతంగా నటించాడు. ముఖ్యంగా సోనియా దీప్తి (శ్రావ్స్), రాహుల్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. దీంతో నిజ జీవితంలో కూడా టైసన్ పేరుతో నే ఫేమస్ అయిపోయాడు రాహుల్. అయితే హ్యాపీడేస్ మూవీ తర్వాత రాహుల్ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. రెయిన్ బో, ముగ్గురు, ప్రేమ ఒక మైకం, లవ్ యు బంగారం, వెంకటాపురం తదితర సినిమాల్లో హీరోగా నటించాడు రాహుల్ టైసన్. అయితే ఏ సినిమా కూడా పెద్దగా అడలేదు. దీంతో క్రమంగా ఫేడవుట్ అయిపోయాడు టైసన్.

ఇవి కూడా చదవండి

రాహుల్ టైసన్ లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో..

2017 లో వెంకటాపురం అనే సినిమాలో నటించిన రాహుల్ 2024లో యంగ్ హీరో కార్తికేయ నటించిన భజే వాయు వేగం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు రాహుల్. ఇందులో అజీజ్ రెడ్డి అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా కూడా హిట్ అవ్వడంతో రాహుల్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతాడనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. అయితే సినిమాలకు దూరంగా ఉంటోన్న రాహుల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటున్నాడు. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాహుల్ చాలా మారిపోయాడు. అప్పట్లో బక్క పలుచగా కనిపించిన టైసన్ ఇప్పుడు పేరకు తగ్గట్టుగానే సిక్స్ ప్యాక్ బాడీ, లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అతని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్
అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!
అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!
W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..
W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..
వయాగ్రాతో పోల్చే ఈ వంటకం గురించి మీకు తెలుసా..?
వయాగ్రాతో పోల్చే ఈ వంటకం గురించి మీకు తెలుసా..?
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం..
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం..
క్యాష్ రూపంలో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా..? ఈ పని చేయకపోతే..
క్యాష్ రూపంలో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా..? ఈ పని చేయకపోతే..