న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో ఓ అభిమాని చర్య కింగ్ కోహ్లీకి ఆగ్రహం తెప్పించింది. కొందరు చిన్నారులు ఆటోగ్రాఫ్ కోసం ప్లాస్టిక్ బ్యాట్లను గ్రౌండ్లోకి విసరగా, కోహ్లీ వాటిని ఆట జరిగే ప్రాంతం బయటకు విసిరివేసి, అభిమానులకు మైదానంలోకి వస్తువులు విసరవద్దని సైగలతో సూచించారు. ఈ సంఘటన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.