AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: చిరంజీవి తర్వాత నన్ను ఇన్‌స్పైర్ చేసింది అతనే.. ఆ టాలీవుడ్ హీరో గురించి గొప్పగా చెప్పిన శర్వానంద్

బైకర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో చిరంజీవితో పాటు ఓ టాలీవుడ్ హీరోపై ప్రశంసలు కురిపించాడు.

Sharwanand: చిరంజీవి తర్వాత నన్ను ఇన్‌స్పైర్ చేసింది అతనే.. ఆ టాలీవుడ్ హీరో గురించి గొప్పగా చెప్పిన శర్వానంద్
Sharwanand
Basha Shek
|

Updated on: Apr 13, 2026 | 8:40 PM

Share

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో నారీ నారీ నడుము మురారి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు శర్వా. ఇక లేటెస్ట్ గా బైకర్ సినిమాతో వరుసగా రెండో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఏప్రిల్ 03న రిలీజైన ఈ స్పోర్ట్స్ డ్రామాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. డీసెంట్ గా కలెక్షన్లూ సాధిస్తూ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. కేవలం సామాన్య ప్రేక్షకులే కాదు అక్కినేని నాగార్జున, పీవీ సింధు వంటి ప్రముఖులు కూడా బైకర్ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటించారు. అలాగే మాళవికా నాయర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు శర్వా. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లపై ప్రశంసల వర్షం కురిపించాడు.

‘నేను మెగాస్టార్ చిరంజీవిని చూసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయన లాగా మెగాస్టార్ అవ్వాలనుకున్నాను. నేను సినిమాల్లోకి రావడానికి బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ చిరంజీవినే. ఆయన తర్వాత నన్ను అంతలా ఇన్ స్పైర్ చేసింది అల్లు అర్జున్. చిన్నప్పటి నుంచి నేను, బన్నీ స్నేహితులం ఆయన కష్టపడే తత్వం, క్రమశిక్షణ చూస్తే ముచ్చటేస్తుంది. బన్నీ ఫిట్‌నెస్, పాత్ర కోసం చేసే ప్రిపరేషన్ నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది.. నేను బన్నీలా కష్టపడడం లేదా? అందుకే ఇలా ఉన్నానా అనిపించేది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో బైకర్ వరకు కూడా బన్నీలా అంతగా కష్టపడలేదు. ఇది హోనెస్ట్‌ గా, జెన్యూన్‌ గా చెబుతున్నా. ఇండస్ట్రీలో అలాంటి క్రమశిక్షణ, హార్డ్ వర్క్ చాలా అరుదుగా కనిపిస్తుంది’ అని బన్నీపై ప్రశంసల వర్షం కురిపించారు శర్వానంద్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. దీనిని చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చంద్రవంక పక్కనే శుక్రుడు.. నేటి సాయంత్రం ఆకాశంలో కనిపించనున్న..
చంద్రవంక పక్కనే శుక్రుడు.. నేటి సాయంత్రం ఆకాశంలో కనిపించనున్న..
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే