AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్యూమినియం ఫాయిల్ సరిగ్గా ఎలా వాడాలి? మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?

రోజువారీ వంటకాల్లో, పిల్లల లంచ్ బాక్సుల్లో లేదా ఆహారాన్ని వేడిగా ఉంచడానికి మనమందరం అల్యూమినియం ఫాయిల్ ఉపయోగిస్తుంటాం. ఫాయిల్ రోల్ విప్పగానే ఒకవైపు మెరుస్తూ, మరొకవైపు మ్యాట్ లేదా డల్‌గా కనిపిస్తుంది. దీంతో ఆహారాన్ని ఏ వైపు ప్యాక్ చేయాలి? బేకింగ్ చేసేటప్పుడు ఏ వైపు పైన ఉండాలి? అనే అయోమయం చాలామందిలో ఉంటుంది. ఈ సందేహానికి సంబంధించిన అసలు నిజాలేంటో, ఫాయిల్ వాడేటప్పుడు పాటించాల్సిన చిట్కాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అల్యూమినియం ఫాయిల్ సరిగ్గా ఎలా వాడాలి? మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
Aluminium Foil
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2026 | 9:53 PM

Share

ఇళ్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడానికి లేదా బేకింగ్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ రోల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే, ఫాయిల్ చుట్టేటప్పుడు ఒకవైపు మెరుస్తూ, మరొకవైపు మ్యాట్ లేదా డల్ గా ఉండటంతో ఏ వైపు వాడాలో చాలామందికి సందేహం వస్తుంది. నిజానికి, ఈ రెండు వైపులా తయారీ ప్రక్రియ వల్ల మాత్రమే అలా కనిపిస్తాయి తప్ప ఆహారం ఉడకడంలో లేదా వేడిగా ఉంచడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మీరు ఏ వైపు ఉపయోగించినా ఆహారం సురక్షితంగానే ఉంటుంది. అయితే ప్రత్యేకంగా నాన్-స్టిక్ ఫాయిల్ వాడేటప్పుడు మాత్రం ప్యాకెట్ పై ఉన్న సూచనల ప్రకారం నాన్-స్టిక్ వైపునే ఆహారాన్ని ఉంచాలి.

రెండు వైపులా ఎందుకు తేడా ఉంటుంది?

అల్యూమినియం ఫాయిల్ తయారీ విధానం వల్ల ఈ వ్యత్యాసం ఏర్పడుతుంది. ఫాయిల్‌ను తయారుచేసే సమయంలో యంత్రాల్లో రెండు పొరలను ఒకేసారి రోలర్ల మధ్య గుండా పంపుతారు. రోలర్‌తో నేరుగా స్పర్శ కలిగే వైపు బాగా మెరుస్తూ తయారవుతుంది. మరొక పొరతో కలిసే భాగం మ్యాట్ లేదా డల్‌గా మారుతుంది. అంతేకానీ, ఇది ఆహారాన్ని వేడి చేసే సామర్థ్యంలో ఎలాంటి వ్యత్యాసాన్ని చూపదు.

ఏ వైపు వాడినా తేడా ఉంటుందా?

ఫాయిల్ తయారీ కంపెనీలు, నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. మెరిసే వైపు అయినా, డల్ వైపు అయినా ఆహారాన్ని ప్యాక్ చేయడానికి లేదా బేకింగ్ చేయడానికి సమానంగా పనిచేస్తాయి. మెరిసే భాగం వేడిని ఎక్కువ ప్రతిబింబిస్తుందని కొందరు అనుకుంటారు, కానీ ఆ వ్యత్యాసం చాలా స్వల్పం. కాబట్టి మీరు ఏ వైపు నుంచి ఆహారాన్ని చుట్టినా ఏమీ కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు

నాన్-స్టిక్ ఫాయిల్: సాధారణ ఫాయిల్ అయితే ఏ వైపు వాడినా పర్వాలేదు, కానీ ఒకవేళ మీరు నాన్-స్టిక్ ఫాయిల్ ఉపయోగిస్తుంటే మాత్రం ఆహారాన్ని నాన్-స్టిక్ కోటింగ్ ఉన్న వైపునే ఉంచాలి.

ఆవిరి బయటకు పోకుండా చూడడం: ఫాయిల్ ఎక్కడైనా చిరిగిపోయినా లేదా సరిగ్గా మూసివేయకపోయినా వేడి మరియు ఆవిరి బయటకు పోతాయి. కాబట్టి బేకింగ్ లేదా రోస్టింగ్ చేసేటప్పుడు అంచులను బాగా మడిచి మూసివేయాలి.

కాల్చే ప్రమాదం: వేడివేడి ఆహారాన్ని ఫాయిల్‌లో చుట్టిన తర్వాత వెంటనే తెరవకూడదు. లోపల ఉండే వేడి ఆవిరి చేతికి లేదా ముఖానికి తగిలి కాలే ప్రమాదం ఉంది. కొద్దిసేపు చల్లారిన తర్వాతే తీయాలి. అల్యూమినియం ఫాయిల్ ఏ వైపు వాడినా భయపడాల్సిన అవసరం లేదు. వంటల్లో లేదా ఫుడ్ ప్యాకింగ్‌లో రెండు వైపులా సమానమైన ఫలితాన్నే ఇస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు