AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి!.. సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు! అసలు ఏం జరిగింది?

అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ కుటుంబంలో క్షణాల వ్యవధిలో అంతులేని విషాదం అలుముకుంది. చిన్న చిన్న మనస్పర్థలో లేక మరే ఇతర మానసిక ఒత్తిడో తెలియదు కానీ, ఒక కన్నతల్లి తన చేతులారా లేచిపోతున్న పసిప్రాయపు బిడ్డ ప్రాణాలు తీసి, తానూ తనువు చాలించిన దారుణ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సంచలనం సృష్టించింది. అసలు ఏం జరిగింది?

8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి!.. సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు! అసలు ఏం జరిగింది?
Ongole Mother-Baby Death Case
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 10, 2026 | 9:41 PM

Share

నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు… భర్త మరో పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండాలి… 8 నెలల బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి చివరి కోరిక. ఒంగోలు నగరంలోని పీర్లమాన్యంలో దారుణం జరిగింది… అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల ఇంట అంతులేని విషాదం చోటు చేసుకుంది… ఎనిమిది నెలల పసికందును గొంతునులిమి చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది వివాహిత మహిళ… కుటుంబ సమస్యలు లేవు, గొడవలు లేవు… పెళ్ళయి రెండున్నరేళ్ళుగా చక్కగా కాపురం చేసుకుంటున్న ఆ దంపతుల్లో భార్యకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ, నెలల బిడ్డను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది… ఇంటి లోపలి నుంచి తలుపులు వేసుకోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిన భర్త, ఆమె మరిదికి తల్లీబిడ్డలు విగతజీవులై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు… ఎలాంటి గొడవలు లేకుండానే ఇలాంటి ఘోరం ఎలా జరిగిందో అర్ధం కావడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒంగోలు నగరంలోని పీర్లమాన్యంలో కాపురం ఉంటున్న కారు డ్రైవర్‌ సయ్యద్‌ సాధిక్‌ తన భార్య అస్మతున్‌తో కలిసి ఉంటున్నాడు… రెండున్నరేళ్ళ క్రితం సింగరాయకొండకు చెందిన అస్మతున్‌ను వివాహం చేసుకున్న సాధిక్‌ దంపతులకు ఎనిమిది నెలల క్రితం పండంటి మగబిడ్డ పుట్టాడు… కాన్పుకోసం పుట్టింటికి వెళ్ళిన అస్మతున్‌ నెల రోజుల క్రితం తిరిగి కాపురానికి ఒంగోలుకు వచ్చింది… భర్తతో కలిసి బాగానే ఉంటోంది… ఈ నేపధ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చిన సాధిక్‌కు ఇంటి తలుపు లోపలినుంచి గడియపెట్టి ఉండటంతో పలుమార్లు బెల్‌ మొగించాడు… ఎంతకీ భార్య తలుపు తీయకపోవడంతో తన సోదరుడు ఇమ్రాన్‌కు ఫోన్‌ చేసి పిలిపించాడు… ఇద్దరూ కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు… అంతే నిర్ఘాంతపోయారు…

హాల్లో చీరతో ఉరివేసుకుని అస్మతిన్‌ ఆత్మహత్య చేసుకోగా, బెడ్‌రూంలో ఎనిమిది నెలల బాబు చనిపోయి కనిపించాడు… వెంటనే బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు… ఘటనా స్థలానికి చేరుకున్న ఒంగోలు తాలూకా సిఐ విజయ్‌కృష్ణ విచారణ ప్రారంభించారు… అప్పటికే ఆమె సూసైడ్‌ నోట్‌ రాసి ఉండటంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు… తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని, భర్త మరో పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండాలని సూసైడ్‌ నోట్‌లో రాసి ఉంది… దీంతో ఈ పెళ్ళి భర్తకు ఇష్టం లేదా, లేక మరో ఏదైనా కారణంగా అస్మతిన్‌ బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకుందా… అన్న అనుమానాలు కలుగుతున్నాయి… ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు అస్మతున్‌ తన బిడ్డను చంపుకుని ఆ తరువాత ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తమకు కూడా అర్ధం కావడం లేదని ఆమె బంధువులు చెబుతున్నారు… ఒక రోజు ముందే తాను కూడా వచ్చి అక్కను పరామర్శించి వెళ్ళానని ఆమె సోదరుడు అస్మత్‌ చెబుతున్నాడు… ఆమె సూసైడ్‌ నోట్‌లో తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని, తన భర్త మరో పెళ్ళి చేసుకోవాలని రాసిందని, అలా ఎందుకు రాసిందో అర్ధం కావడం లేదని చెబుతున్నారు… మృతురాలు రాసిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. ఇకపై భోగాపురం
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. ఇకపై భోగాపురం
మీరు రోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతారా.. కిడ్నీలకు ఏం జరుగుతుందో..
మీరు రోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతారా.. కిడ్నీలకు ఏం జరుగుతుందో..