AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్‌లో టీజీ సేఫ్ అధికారులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీలు హోటల్ యజమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోటల్ నిర్వాహకులకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మద్దతుగా నిలిచారు. ట్విన్ సిటీస్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి తెలంగాణ సేఫ్ కమిషనర్ అవినాష్ మొహంతిని ఆయన కలిశారు. తనిఖీల పేరుతో హోటల్ వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండా, చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని కోరారు.

తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకోవాలి
Asaduddin Owaisi
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Nov 10, 2026 | 9:24 PM

Share

హైదరాబాద్‌లో టీజీ సేఫ్ అధికారులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీలు హోటల్ యజమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోటల్ నిర్వాహకులకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మద్దతుగా నిలిచారు. ట్విన్ సిటీస్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి తెలంగాణ సేఫ్ కమిషనర్ అవినాష్ మొహంతిని ఆయన కలిశారు. తనిఖీల పేరుతో హోటల్ వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండా, చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని కోరారు.

ఆహార భద్రత విషయంలో అధికారులు తీసుకుంటున్న చర్యలకు తాము వ్యతిరేకం కాదని, అయితే తనిఖీలు పారదర్శకంగా, అందరికీ ఒకే విధంగా ఉండాలని అసదుద్దీన్ స్పష్టం చేశారు. కొన్ని హోటళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యాపారుల్లో ఉందని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

ముందు నోటీసులు.. ఆ తర్వాతే చర్యలు!

హోటళ్లలో ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే సీజ్ చేయడం, లైసెన్సులు రద్దు చేయడం సరికాదని ప్రతినిధి బృందం పేర్కొంది. నిబంధనల ప్రకారం ముందుగా ఇంప్రూవ్‌మెంట్ నోటీసు ఇచ్చి, లోపాలను సరిదిద్దుకునేందుకు గడువు కల్పించాలని గుర్తుచేసింది. ఈ ప్రక్రియను పక్కనపెట్టి సోషల్ మీడియాలో తనిఖీల వీడియోలు విడుదల చేయడం వల్ల హోటళ్ల పేరుప్రతిష్టలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

హోటళ్లపై చర్యలతో వేలాది కుటుంబాలకు ఇబ్బందులు!

హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఆహార సంస్కృతిలో హోటళ్లు, రెస్టారెంట్ల పాత్ర ఎంతో కీలకం. ఈ రంగంపై వేలాది మంది కార్మికులు, చిరువ్యాపారులు ఆధారపడి జీవిస్తున్నారు. చిన్న చిన్న లోపాలకే కఠిన చర్యలు తీసుకుంటే యజమానులతో పాటు అక్కడ పనిచేసే కార్మికుల కుటుంబాలు కూడా ఇబ్బందులు పడతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆహార నాణ్యత, ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని, అదే సమయంలో వ్యాపారులపై వేధింపులు ఉండకూడదని వారు కోరారు. హోటల్ యజమానులకు ముందుగా సరైన సూచనలు ఇచ్చి, నిబంధనలపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడం ఎంత ముఖ్యమో, హోటల్ వ్యాపారులు ప్రశాంతంగా తమ వ్యాపారాలు నిర్వహించుకునేలా చూడటం కూడా అంతే ముఖ్యమని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. అధికారులు తనిఖీల సమయంలో సహకార ధోరణితో వ్యవహరించాలని కమిషనర్‌ను కోరారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. ఇకపై భోగాపురం gg
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. ఇకపై భోగాపురం gg
మీరు రోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతారా.. కిడ్నీలకు ఏం జరుగుతుందో..
మీరు రోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతారా.. కిడ్నీలకు ఏం జరుగుతుందో..
ఈ టాలీవుడ్ హీరో ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఈ టాలీవుడ్ హీరో ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 52 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 52 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు
APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు
6 దశాబ్దాల ప్రస్థానం.. ప్రపంచానికి తెలియని కథ.. సోనియా గాంధీ..
6 దశాబ్దాల ప్రస్థానం.. ప్రపంచానికి తెలియని కథ.. సోనియా గాంధీ..
దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో పిచ్చి ట్రెండింగ్..
దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో పిచ్చి ట్రెండింగ్..
ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..
ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..