AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే ఘాటైన పచ్చిమిర్చి నిల్వ పచ్చడి.. తింటే రుచి న-భూతో-న-భవిష్యతి!

సాధారణంగా చేసే భోజనంలోకి లేదా పరాటాల్లోకి అదనపు రుచిని జోడించడానికి పచ్చిమిర్చి పచ్చడి ఎంతో బాగుంటుంది. సాధారణంగా పచ్చళ్లు పెట్టాలంటే రోజంతా ఎండలో పెట్టాల్సి వస్తుంది. కానీ ఎలాంటి ఎండ అవసరం లేకుండా క్షణాల్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి అద్భుతంగా ఉండటమే కాకుండా, సరిగ్గా నిల్వ చేస్తే కొన్ని నెలల పాటు తాజాగా ఉంటుంది. ఎండతో పనిలేకుండా నిమిషాల్లో తయారయ్యే ఘాటైన పచ్చిమిర్చి ఊరగాయ రెసిపీ ఏంటో వివరంగా తెలుసుకుందాం..

ఎండతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే ఘాటైన పచ్చిమిర్చి నిల్వ పచ్చడి.. తింటే రుచి న-భూతో-న-భవిష్యతి!
Green Chilli Pickle
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2026 | 6:12 PM

Share

సాధారణంగా ఇళ్లలో భోజనం రుచిగా మారాలంటే ఏదైనా పచ్చడి పక్కన ఉండాల్సిందే. అందులోనూ పచ్చిమిర్చి తో చేసే స్పైసీ అవకాయ ఉంటే ఆ మజాయే వేరు. దాల్-చావల్, రొట్టెలు లేదా పరాటాలతో నంజుకోవడానికి ఈ పచ్చడి అద్భుతమైన ఎంపిక. పచ్చడి పెట్టాలంటే చాలామందికి రోజుల తరబడి ఎండలో పెట్టాలనే టెన్షన్ ఉంటుంది. కానీ ఎలాంటి ఎండ అవసరం లేకుండా, నిమిషాల వ్యవధిలో ఇంట్లోనే రుచికరమైన పచ్చిమిర్చి ఊరగాయను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

పచ్చిమిర్చి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు

తాజా పచ్చిమిర్చి: 200 గ్రాములు

మసాలా దినుసులు: 6 టేబుల్ స్పూన్ల సోంపు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 చిన్న స్పూన్ జీలకర్ర, అర స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు.

ఇవి కూడా చదవండి

ఇతర పదార్థాలు: తగినంత నూనె, పసుపు, ఇంగువ, కశ్మీరీ కారం, ఆమ్చూర్ పొడి, కొద్దిగా తెల్ల వెనిగర్, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి.

తయారీ విధానం

ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. ఆ తర్వాత తొడిమలు తొలగించి, పొడవుగా చీల్చి లోపల ఉన్న గింజలను కొద్దిగా తీసివేయాలి. ఇలా చేయడం వల్ల కారం కొద్దిగా తగ్గి, మసాలాలు బాగా పడతాయి. బాణలిలో సోంపు, మెంతులు, జీలకర్రను దోరగా వేయించి, సువాసన వచ్చాక వాము, ఆవాలు కూడా కలిపి వేయించాలి. అవి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి, కొద్దిగా కలోంజి, ఇంగువ వేసి తాలింపు పెట్టాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. మిర్చి మెత్తబడిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి, ఆమ్చూర్ పొడి, కశ్మీరీ కారం, 4 చెంచాల తెల్ల వెనిగర్ వేసి బాగా కలపాలి. ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఈ పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత గాలిచొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. పైన కొద్దిగా వేడి చేసి చల్లార్చిన నూనె పోస్తే, ఫ్రిజ్‌లో ఉంచితే 3 నుండి 4 నెలల పాటు చెడిపోకుండా తాజాగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎండతో పనిలేదు..నిమిషాల్లో తయారయ్యే ఘాటైన పచ్చిమిర్చి నిల్వ పచ్చడి
ఎండతో పనిలేదు..నిమిషాల్లో తయారయ్యే ఘాటైన పచ్చిమిర్చి నిల్వ పచ్చడి
ఆర్యవీర్ అద్భుతమైన సెంచరీ.. యుఏఈపై భారత్ ఘన విజయం
ఆర్యవీర్ అద్భుతమైన సెంచరీ.. యుఏఈపై భారత్ ఘన విజయం
మనిషికి గుండె కుడివైపు ఉంటే! ఓటీటీలో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
మనిషికి గుండె కుడివైపు ఉంటే! ఓటీటీలో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
దుస్థానాల్లో గ్రహ రాజు రవి..ఈ రాశుల వారు జాగ్రత్త!
దుస్థానాల్లో గ్రహ రాజు రవి..ఈ రాశుల వారు జాగ్రత్త!
అప్పుడు రజినీకాంత్ పక్కన హీరోయిన్.. ఇప్పుడు ఆసుపత్రిలో డాక్టర్..
అప్పుడు రజినీకాంత్ పక్కన హీరోయిన్.. ఇప్పుడు ఆసుపత్రిలో డాక్టర్..
బంగారం ధరలు తగ్గినా కొనేవారికి లాభం లేదే.. భారత్‌లోనే ఎక్కువ..
బంగారం ధరలు తగ్గినా కొనేవారికి లాభం లేదే.. భారత్‌లోనే ఎక్కువ..
15 ఏళ్ల ప్రేమ బంధం రక్తసిక్తం.. నల్లగొండ పోలీస్ క్వార్టర్స్‌లో..
15 ఏళ్ల ప్రేమ బంధం రక్తసిక్తం.. నల్లగొండ పోలీస్ క్వార్టర్స్‌లో..
ఇతరుల ఇళ్లపై రాళ్లు వేయకండి.. రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్..
ఇతరుల ఇళ్లపై రాళ్లు వేయకండి.. రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్..
చదువుల గుడిలో వేధింపుల కలకలం.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన..
చదువుల గుడిలో వేధింపుల కలకలం.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన..
ఆ ఇద్దరు ఆటగాళ్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఢిల్లీ టీం
ఆ ఇద్దరు ఆటగాళ్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఢిల్లీ టీం