AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో తేళ్లు కనిపిస్తున్నాయా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వర్షాకాలంలో తేళ్లు, సరీసృపాలు ఎక్కువగా బయటికి వస్తుంటాయి. ఒకవేళ తేలు కుడితే తీవ్రమైన మంట, నొప్పి కలుగుతాయి. ఈ విష ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని సులభమైన సహజ చిట్కాలు పాటించవచ్చు. తేలు కుట్టిన ప్రదేశాన్ని ముందుగా సబ్బు, శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి. ఆపై ఐస్ క్యూబ్స్ లేదా చల్లటి వస్త్రాన్ని ఉంచితే నొప్పి, వాపు తగ్గుతాయి. పసుపు పేస్ట్ లేదా బేకింగ్ సోడాను అప్లై చేయడం వల్ల కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే తీవ్రమైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

ఇంట్లో తేళ్లు కనిపిస్తున్నాయా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Scorpion Sting Remedies
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2026 | 4:13 PM

Share

వర్షాకాలం వచ్చిందంటే చాలు, తేళ్లు, పాములు వంటి జీవులు తడి నేలల నుంచి బయటికి వచ్చి ఇళ్లలోకి, పొదల్లోకి చేరుతుంటాయి. ఈ సమయంలో చిన్నపాటి అజాగ్రత్త వల్ల తేలు కాటుకు గురికావాల్సి వస్తుంది. తేలు కుట్టిన వెంటనే తీవ్రమైన మంట, నొప్పి, ఆ ప్రాంతంలో తిమ్మిర్లు కలుగుతాయి. అయితే భయపడకుండా కొన్ని తక్షణ ప్రథమ చికిత్స చర్యలు, సహజ పద్ధతులను పాటించడం ద్వారా విషం ప్రభావం, నొప్పి, మంటను తగ్గించవచ్చు.

తేలు కుట్టిన వెంటనే చేయాల్సిన మొదటి పనులు

శుభ్రపరచడం: తేలు కుట్టిన భాగాన్ని వెంటనే గోరువెచ్చని నీరు, యాంటీసెప్టిక్ సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఇది ఇన్‌ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.

చల్లటి ఒత్తిడి: ఐస్ క్యూబ్స్‌ను ఒక శుభ్రమైన గుడ్డలో చుట్టి తేలు కుట్టిన ప్రదేశంపై 10-15 నిమిషాల పాటు ఉంచాలి. ఇది రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేసి, విషం వేగంగా శరీరంలోకి పాకకుండా అడ్డుకుంటుంది. నొప్పిని తగ్గిస్తుంది. తేలు చేతికి లేదా కాలికి కుట్టినట్లయితే, ఆ భాగాన్ని కదలకుండా కొద్దిగా ఎత్తులో ఉంచడం మంచిది.

ఇవి కూడా చదవండి

విషాన్ని, నొప్పిని తగ్గించే కొన్ని సహజ చిట్కాలు

పసుపు, నూనె: పసుపులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కొద్దిగా పసుపును ఆవ నూనెతో కలిపి పేస్ట్‌లా చేసి తేలు కుట్టిన చోట రాస్తే మంట త్వరగా తగ్గుతుంది.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేసి రాస్తే చర్మానికి ఉపశమనం లభిస్తుంది.

వెల్లుల్లి, ఉల్లిపాయ రసం: యాంటీ మైక్రోబయాల్‌ గుణాలున్న ఉల్లిపాయ లేదా వెల్లుల్లి రసాన్ని రాస్తే నొప్పి నుంచి తక్షణ ఉపశమనం దొరుకుతుంది.

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?

తేలు కుట్టిన తర్వాత కొందరిలో మైకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమటలు పట్టడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఎలాంటి ఇంటి వైద్యాలు చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇళ్ల చుట్టూ రక్షణ చర్యలు

తేలు లేదా ఇతర విష సర్పాలు వంటివి ఇంటి వైపు రాకుండా ఉండాలంటే పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పనికిరాని వస్తువులు, చెత్తాచెదారం, చెట్ల పొదలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇంట్లోని ఎలుకలు, ఆహార పదార్థాల వ్యర్థాలను సరిగ్గా నిల్వ చేయాలి. గోడల్లోని పగుళ్లను మూసివేయడం ద్వారా ఇవి ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు.

ఒకవేళ కరిస్తే ఏం చేయాలి?

సాధారణంగా ఇవి విషపూరితమైనవి కానప్పటికీ, వీటి కాటు వల్ల తీవ్రమైన గాయాలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇవి కరిస్తే, ఆ గాయాన్ని సబ్బు, పరిశుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి. రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన గుడ్డతో నొక్కిపెట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత వైద్యం లేదా నాటు మందులు వాడకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీ లో మరో 2 కొత్త ఎయిర్‌పోర్టులకు గ్రీన్ సిగ్నల్
ఏపీ లో మరో 2 కొత్త ఎయిర్‌పోర్టులకు గ్రీన్ సిగ్నల్
ఇంట్లో తేళ్లు కనిపిస్తున్నాయా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఇంట్లో తేళ్లు కనిపిస్తున్నాయా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్! తెలంగాణ గ్రామాల్లో డిజిటల్ విప్లవం!
ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్! తెలంగాణ గ్రామాల్లో డిజిటల్ విప్లవం!
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ. 7 వేల స్టైపెండ్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ. 7 వేల స్టైపెండ్
జియో బంపర్ ఆఫర్.. ఒక నెల రీఛార్జ్ చేస్కుంటే మరో నెల ఫ్రీ..
జియో బంపర్ ఆఫర్.. ఒక నెల రీఛార్జ్ చేస్కుంటే మరో నెల ఫ్రీ..
గోవా కాదు.. మహారాష్ట్రలోని ఈ ప్రదేశం అంతకు మించి ఉంటుంది! 2 గంటల
గోవా కాదు.. మహారాష్ట్రలోని ఈ ప్రదేశం అంతకు మించి ఉంటుంది! 2 గంటల
ఇకపై సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌గా చర్లపల్లి-తిరుచానూర్ ఎక్స్‌ప్రెస్‌
ఇకపై సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌గా చర్లపల్లి-తిరుచానూర్ ఎక్స్‌ప్రెస్‌
168 బంతుల్లో 160.. తండ్రి పేరు నిలబెట్టిన తనయుడు
168 బంతుల్లో 160.. తండ్రి పేరు నిలబెట్టిన తనయుడు
సుకుమార్, చరణ్ మూవీ ఈవెంట్‏లో అందుకే కనిపించాను..
సుకుమార్, చరణ్ మూవీ ఈవెంట్‏లో అందుకే కనిపించాను..
ఎలాన్ మస్క్‌కు విచిత్ర అలవాట్లు.. వీటి గురించి తెలిస్తే..
ఎలాన్ మస్క్‌కు విచిత్ర అలవాట్లు.. వీటి గురించి తెలిస్తే..