AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బకాయి ఫీజుల పేరుతో MBBS సర్టిఫికెట్లు ఆపితే కుదరదు..హైకోర్టు సంచలన తీర్పు!

ఫీజు బకాయిలు ఉన్నాయనే నెపంతో వైద్య కళాశాలలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తమ వద్దే ఉంచుకోవడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ ఒరిజినల్ ధ్రువపత్రాలను వారం రోజుల్లోగా తిరిగి ఇచ్చేయాలని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీని న్యాయస్థానం ఆదేశించింది. సర్టిఫికెట్లు విద్యార్థి వ్యక్తిగత ఆస్తి అని, బకాయిలు ఉంటే వాటి రికవరీకి చట్టపరమైన ఇతర మార్గాలను ఆశ్రయించాలి తప్ప, ధ్రువపత్రాలను పూచీకత్తుగా పెట్టుకోవడానికి కళాశాలలకు ఎలాంటి హక్కు లేదని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి తీర్పునిచ్చారు.

బకాయి ఫీజుల పేరుతో MBBS సర్టిఫికెట్లు ఆపితే కుదరదు..హైకోర్టు సంచలన తీర్పు!
Mbbs Students Get Major ReliefImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2026 | 7:09 PM

Share

ఫీజు బకాయిల పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపివేయడంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బకాయిలు ఉన్నప్పటికీ విద్యార్థుల వ్యక్తిగత, విద్యా సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలను నిలిపివేసే హక్కు కళాశాలలకు లేదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థి సర్టిఫికెట్లను వారం రోజుల్లోగా అతనికి అందజేయాలని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

కేసు నేపథ్యం: ఫీజు కట్టలేదని ఏడాదిగా సర్టిఫికెట్లు బంద్‌

హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ కోర్సు చేరే సమయంలో తన టెన్త్ మార్కుల మెమో, నీట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ట్రాన్స్‌ఫర్ (TC), మైగ్రేషన్ సర్టిఫికెట్లను కాలేజీలో సమర్పించాడు. నాలుగేళ్ల కోర్సుకు సంబంధించి రూ. 47.5 లక్షల ఫీజును చెల్లించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల చివరి ఏడాదికి సంబంధించిన రూ. 11.75 లక్షల బకాయిని చెల్లించలేకపోయాడు. దీంతో కాలేజీ యాజమాన్యం అతనికి రావాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు నిరాకరించింది.

ఒరిజినల్ పత్రాలు లేకపోవడం వల్ల తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేక, ఉద్యోగంలో చేరలేక ఏడాదిగా తీవ్రంగా నష్టపోయానని బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. పైగా నీట్-పీజీ (NEET-PG) కౌన్సెలింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు కూడా ఈ ధ్రువపత్రాలు అత్యంత కీలకమని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

హైకోర్టు కీలక వ్యాఖ్యలు: ఫీజు రికవరీకి వేరే మార్గాలు చూసుకోండి!

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థి సమర్పించిన అకడమిక్ సర్టిఫికెట్లు అతని వ్యక్తిగత ఆస్తి అని, చట్టబద్ధమైన అధికారం లేకుండా వాటిని ఆపుకునే హక్కు ఏ కళాశాలకూ లేదని స్పష్టం చేసింది. కాలేజీకి ఫీజు బకాయిలు రావాల్సి ఉంటే, వాటి రికవరీ కోసం చట్టపరమైన ఇతర చర్యలు తీసుకోవచ్చు. కానీ సర్టిఫికెట్లను సెక్యూరిటీగా ఉంచుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.

ఫలితంగా, పిటిషనర్ తన ఒరిజినల్ సర్టిఫికెట్లను తక్షణమే పొందే హక్కు కలిగి ఉన్నాడని చెబుతూ, తీర్పు ప్రతి అందిన వారం రోజుల్లోగా విద్యార్థి సర్టిఫికెట్లన్నీ తిరిగి ఇచ్చేయాలని కాలేజీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us