AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇడ్లీలు, పూరీలు వదిలేయండి.. కేవలం 15 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తినండి..కొద్ది రోజుల్లో బరువు తగ్గుతారు!

బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంపిక చేయడం చాలా ముఖ్యం. అలాంటి వారి కోసం కేవలం 15 నిమిషాల్లో తయారు చేసుకోదగిన అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ స్టీమ్డ్ స్ప్రౌట్స్. మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉడికించి, కొద్దిగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, నిమ్మరసం కలిపి తయారు చేయడం వల్ల రుచితో పాటు పూర్తి పోషకాలు లభిస్తాయి. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి, అనవసరమైన ఆహారపు అలవాట్లను నియంత్రిస్తుంది. బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారికి ఇదొక చక్కటి ఆరోగ్యకరమైన ఆహార మార్గం.

ఇడ్లీలు, పూరీలు వదిలేయండి.. కేవలం 15 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తినండి..కొద్ది రోజుల్లో బరువు తగ్గుతారు!
Steamed Sprouts Recipe
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2026 | 8:19 PM

Share

నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలామంది బరువు తగ్గడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ పౌష్టికాహారంతో కూడుకుని ఉండటం చాలా అవసరం. తక్కువ సమయంలో, ఎక్కువ పోషకాలను అందించే అల్పాహారాలలో మొలకెత్తిన గింజలు ముందు వరుసలో ఉంటాయి. కేవలం 15 నిమిషాల్లో ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా స్టీమ్డ్ స్ప్రౌట్స్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

స్ప్రౌట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రొటీన్లు, ఫైబర్: మొలకెత్తిన పెసలు లేదా శెనగల్లో ప్రొటీన్లు, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి కండరాల బలానికి,  జీర్ణక్రియ మెరుగుపడటానికి ఎంతగానో సహాయపడతాయి.

బరువు నియంత్రణ: ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం పూట దీన్ని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు, ఇది బరువు తగ్గడానికి అద్భుతంగా సహకరిస్తుంది.

ఇవి కూడా చదవండి

శక్తిని ఇస్తుంది: శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని అందించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

తయారీకి కావలసిన పదార్థాలు

మొలకెత్తిన గింజలు పెసలు లేదా శెనగలు: 1 కప్పు

సన్నగా తరిగిన ఉల్లిపాయ: 1

టమాటా ముక్కలు: అర కప్పు

పచ్చిమిర్చి తరుగు: 1 లేదా 2

నిమ్మరసం: 1 స్పూన్

తాలింపు గింజలు, కరివేపాకు, కొద్దిగా నూనె, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు కారం.

తయారీ విధానం

ముందుగా మొలకెత్తిన గింజలను శుభ్రం చేసి, ఇడ్లీ పాత్రలో లేదా స్టీమర్‌లో పెట్టి 5 నుండి 7 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని పోషకాలు పోకుండా సులభంగా అరుగుతాయి.  ఇప్పుడు బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి.

అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆవిరిపై ఉడికించిన స్ప్రౌట్స్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు కారం వేసి బాగా కలపాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి పైన నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరిస్తే రుచికరమైన స్టీమ్డ్ స్ప్రౌట్స్ సిద్ధం.

ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు హడావుడిగా జంక్ ఫుడ్ తినడానికి బదులు, కేవలం 15 నిమిషాల్లో ఈ హెల్దీ స్ప్రౌట్స్ తయారు చేసుకుని తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఒక చక్కటి, సులువైన అల్పాహార ఎంపిక.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్
తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్
చలికాలంలో కళ్లలో మంట, దురదకు అసలు కారణం ఇదే.. ఈ తప్పులు చేయకండి!
చలికాలంలో కళ్లలో మంట, దురదకు అసలు కారణం ఇదే.. ఈ తప్పులు చేయకండి!
కుటుంబ కలహాలు .. భర్త ఊరెళ్లి తిరిగొచ్చేలోపే భార్య..
కుటుంబ కలహాలు .. భర్త ఊరెళ్లి తిరిగొచ్చేలోపే భార్య..
అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
చలికి పెదాలు పగిలిపోతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో సాఫ్ట్‌ అవుతాయి
చలికి పెదాలు పగిలిపోతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో సాఫ్ట్‌ అవుతాయి
మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా..? డిసెంబర్ 31 వరకు ఛాన్స్..
మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా..? డిసెంబర్ 31 వరకు ఛాన్స్..
ఇడ్లీలు, పూరీలు వదిలేయండి..15 నిమిషాల్లో చేసుకునే హెల్తీ ఫుడ్ ఇది
ఇడ్లీలు, పూరీలు వదిలేయండి..15 నిమిషాల్లో చేసుకునే హెల్తీ ఫుడ్ ఇది
మంగళవారం కొత్త పనులు ప్రారంభించకూడదా? జ్యోతిష్యం ఏం చెబుతోంది?
మంగళవారం కొత్త పనులు ప్రారంభించకూడదా? జ్యోతిష్యం ఏం చెబుతోంది?
బొద్దింకలు, ఎలుకల వ్యర్థాల నడుమ వంటలు.. 700 కిలోల కుళ్లిన ఫుడ్..
బొద్దింకలు, ఎలుకల వ్యర్థాల నడుమ వంటలు.. 700 కిలోల కుళ్లిన ఫుడ్..
ఆ హీరో చూపించే ప్రేమ వేరు.. ఆయనలోనే నాన్నను చూసుకుంటున్నా..
ఆ హీరో చూపించే ప్రేమ వేరు.. ఆయనలోనే నాన్నను చూసుకుంటున్నా..