అమ్మడు అరాచకమే.. నెట్టింట గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

Rajitha Chanti

Pic credit - Instagram

10 November 2026

బుల్లితెర నటీనటులు ప్రస్తుతం వెండితెర స్టార్ హీరోయిన్లకు దీటుగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అందులోనూ టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నవ్య స్వామి

కర్ణాటకకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో 'నా పేరు మీనాక్షి', 'అగ్నిసాక్షి' వంటి సీరియల్స్‌తో తన సహజ నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు.

 ప్రస్తుతం సీరియల్స్‌కు కాస్త దూరంగా ఉంటున్న నవ్య స్వామి, సినిమాలపై దృష్టి సారించారు. 'ఇంటింటి రామాయణం', 'బుట్టబొమ్మ', 'రావణాసుర' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. 

ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ నటిగా తన ప్రతిభను చాటుకుంటున్నారు. తెరపై ఎంతో పద్దతిగా, సంప్రదాయబద్ధంగా కనిపించే ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో మాత్రం పూర్తి భిన్నం. 

తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు, వీడియోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ట్రెండ్‌కు తగ్గట్టుగా మేకోవర్ అవుతూ ఆమె పంచుకుంటున్న ఈ పోస్టులు వైరల్ గా మారాయి.

అటు వెండితెరపై విభిన్న పాత్రలతో మెప్పిస్తూనే, ఇటు సోషల్ మీడియాలో తన గ్లామర్ లుక్స్‌తో అభిమానులను అలరిస్తున్న నవ్య స్వామి ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. తాజాగా క్రేజీ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కీలక పాత్ర పోషించారు. బుట్టబొమ్మ ఈ చిత్రంలో సహాయ నటిగా నటించి తన నటనతో అలరించి ప్రశంసలు అందుకుంది.

సీరియల్స్‌లో ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించే నవ్య, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం వెస్ట్రన్ అండ్ గ్లామరస్ ఫోటోషూట్‌లతో అభిమానులకు నిత్యం ట్రీట్ ఇస్తుంటారు.