తూర్పు గోదావరి జిల్లా, ప్రకాశ రావు పాలెంలో దీపావళి అమావాస్య నాడు క్షుద్రపూజల ఉదంతం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి ఓ వ్యక్తి గొయ్యిలో నగ్నంగా కూర్చొని పూజలు చేస్తుండగా గ్రామస్థులు గుర్తించారు. పూజా సామగ్రిని చూసి భయాందోళన చెందిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.