కాకా Vs విశ్వంభర.. క్లైమాక్స్‌కు చేరుకున్న పోరు
సంక్రాంతి విడుదలల నేపథ్యంలో చిరంజీవి నటిస్తున్న ‘కాకా’, ‘విశ్వంభర’ సినిమాల రిలీజ్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ‘కాకా’ నుంచి ఇప్పటివరకు టీజర్ మాత్రమే రాగా, ఫస్ట్ సింగిల్ డిసెంబర్లో విడుదల కానుందని తమన్ తెలిపారు. మరోవైపు ఓటీటీ ఒప్పందం ప్రకారం ‘విశ్వంభర’ను జనవరి 13లోపు విడుదల చేయాల్సి ఉందనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ కోసం ‘మెగావర్స్’ టాక్ షోలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
కాకా, విశ్వంభర సినిమాల రిలీజ్ విషయంలో మేకర్స్ తగ్గేదే లే అన్నట్లు మొండి పట్టుదలకు పోతున్నారా..? మిగతా సంక్రాంతి మూవీస్ ప్రమోషన్స్ జోరుగా సాగుతుంటే కాకా టీమ్ మాత్రం కేవలం ఒక్క టీజర్‌తోనే సరిపెట్టి సైలెంట్ అయిపోవడం వెనుక ఉన్న ప్లాన్ ఏంటి..? మరోవైపు ఓటిటి డీల్ ప్రెజర్‌తో విశ్వంభర మేకర్స్ డైలమాలో ఉన్నారా..? వీటి మధ్య చిరు లేటెస్ట్ నెట్‌ఫ్లిక్స్ టాక్ షో మెగావర్స్ సంగతులేంటి..? సంక్రాంతి బరిలో ఉన్న మిగిలిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్‌తో అదరగొడుతుంటే, కాకా మూవీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఒక్క టీజర్ మాత్రమే బయటకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ డిసెంబర్లో రాబోతుందని తమన్ చెప్పడంతో.. బాబీ అండ్ టీమ్ రిలీజ్‌కు సరిగ్గా నెల రోజుల ముందు మాత్రమే తమ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. విశ్వంభర సినిమా రిలీజ్ వ్యవహారం అయితే మేకర్స్‌కు పెద్ద సవాల్‌లాగా మారిపోయింది. ముందే కుదుర్చుకున్న ఓటీటీ డీల్ ప్రకారం ఈ సినిమాను కచ్చితంగా జనవరి 13 లోపే థియేటర్లలో రిలీజ్ చేయాల్సి ఉండటంతో డెడ్ లైన్ ప్రెజర్లో పడిపోయారు దర్శక నిర్మాతలు. ఈ రెండు భారీ సినిమాల క్లాష్ నివారించడానికి మేకర్స్ మధ్య ఇంకా ఏవైనా చర్చలు జరుగుతున్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రిలీజ్ టెన్షన్స్ అన్నీ పక్కనపెడితే.. చిరంజీవి మాత్రం నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తున్న మెగావర్స్ టాక్ షో పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ షో కోసం ఇప్పటికే నాగార్జునతో కలిసి అదిరిపోయే ఫస్ట్ ఎపిసోడ్‌ను కూడా చిరు షూట్ పూర్తి చేసారని తెలుస్తుంది. ఒకవైపు కొత్త టాక్ షోతో మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీ ఇస్తుంటే.. మరోవైపు కాకా, విశ్వంభర సినిమాల ఫ్యూచర్ ఏంటో త్వరలోనే తేలనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐపీఎల్ 2027లో ఊహించని మలుపు.. పంజాబ్‌కు హార్దిక్, ముంబయికి అర్ష్‌దీప్
కిలాడీ లేడీలు.. మాటల్లో పెట్టి మాయం చేసారు
హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్..
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

