God Of War: గాడ్ ఆఫ్ వార్‌పై డైలమా.. అదొక్కటే కారణమా..?
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే బడ్జెట్ పెరగడం, త్రివిక్రమ్ గత సినిమా ఫలితం, కుమారస్వామి కాన్సెప్ట్‌తో ఇతర చిత్రాలు రావడం వంటి కారణాలతో షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సినిమా రద్దయిందన్న వార్తలను మాత్రం కథనం ఖండిస్తోంది.
గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సస్పెన్స్ ఎందుకు కంటిన్యూ అవుతోంది..? ఊహించిన దానికంటే బడ్జెట్ పెరిగిపోవడం, త్రివిక్రమ్ ట్రాక్ రికార్డ్ ఈ డైలమాకి కారణమా..? కుమార స్వామి కాన్సెప్ట్‌తో వేరే సినిమాలు లైన్‌లో ఉండటం కూడా ఈ ప్రచారానికి రీజన్‌గా మారుతుందా..? తారక్, త్రివిక్రమ్ సినిమాపై వస్తున్న అప్‌డేట్స్ ఏంటి..? ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేదెప్పుడు..? ఆదర్శ కుటుంబం తర్వాత తారక్‌తో 500 కోట్లతో గాడ్ ఆఫ్ వార్ ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. పాన్ ఇండియా రేంజ్‌లో త్రివిక్రమ్‌కు ఇది ఫస్ట్ మూవీ కాబట్టి కేవలం సౌత్ మార్కెట్‌ను నమ్మి అంత బడ్జెట్ పెట్టడం రిస్కేమో అనే టాక్ నడుస్తున్నా.. అక్కడున్నది మాటల మాంత్రికుడు కాబట్టి కథను నమ్మి ముందుకెళ్లాలనే చూస్తున్నారు దర్శక నిర్మాతలు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ గ్యాప్ తీసుకుని చేసిన ఆదర్శ కుటుంబం ఓపెనింగ్స్ కుమ్మేసినా.. తర్వాత స్లో అయింది. ఈ సినిమా బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే పెరగడం, రిలీజ్ డేట్స్ వాయిదా లాంటివన్నీ త్రివిక్రమ్‌పై కాస్త ఇంపాక్ట్ చూపించాయి. వెంకీ సినిమా మ్యాజిక్ చేసుంటే.. గాడ్ ఆఫ్ వార్ వెంటనే మొదలయ్యేది.. కానీ ఇప్పుడు ఇంకాస్త సమయం తీసుకునేలా ఉన్నారు త్రివిక్రమ్. హారిక అండ్ హాసినితో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇప్పటికే ధనుష్, శివకార్తికేయన్ లాంటి హీరోలు కుమార స్వామి కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తున్నారు. కాబట్టి గాడ్ ఆఫ్ వార్ ఉన్నా.. కాస్త ఆలస్యంగా మొదలయ్యేలా కనిపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని వస్తున్న వార్తలు మాత్రం పూర్తిగా అబద్ధమే..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐపీఎల్ 2027లో ఊహించని మలుపు.. పంజాబ్‌కు హార్దిక్, ముంబయికి అర్ష్‌దీప్
కిలాడీ లేడీలు.. మాటల్లో పెట్టి మాయం చేసారు
హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్..
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

