Vizag Airport: విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. భోగాపురానికి అంతర్జాతీయ హోదా
కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ విమానాశ్రయాన్ని అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌ల జాబితా నుంచి తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగరేషన్ సేవలు పూర్తిగా రద్దయ్యాయి. ఇందుకు బదులుగా బోగాపురం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించారు.

విశాఖపట్నం విమానాశ్రయాన్ని అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌ల జాబితా నుంచి మినహాయిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాత విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ సేవలు పూర్తిగా రద్దయ్యాయి. కొత్తగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికే పూర్తి అంతర్జాతీయ హోదా కల్పించారు. కేంద్ర హోం శాఖ నవంబర్ 9న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం విశాఖపట్నం విమానాశ్రయాన్ని అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌ల జాబితా నుంచి డీనోటిఫై చేశారు.
భోగాపురం విమానాశ్రయాన్ని ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా గుర్తించడంతో పాత విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ఉన్న ఇమ్మిగ్రేషన్ హోదా రద్దయింది. ఇకపై విదేశీ విమానాల రాకపోకలు, అంతర్జాతీయ ప్రయాణికుల పాస్‌పోర్ట్, వీసా తనిఖీలు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు భోగాపురం విమానాశ్రయంలోనే జరుగుతాయి…ఈ నిర్ణయంతో విశాఖ నగరం నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికులకు అదనపు ప్రయాణ దూరం, సమయం పెరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త విమానాశ్రయం అందించే మెరుగైన సౌకర్యాలు, అంతర్జాతీయ కనెక్టివిటీతో ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఆగస్టు నుంచే నిలిచిపోయిన వాణిజ్య సేవలు
భోగాపురం ఎయిర్ పోర్టు విమానసేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత గత ఆగస్టు 17 నుంచి పాత విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అన్ని వాణిజ్య విమానాలు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మారాయి. VTZ ఎయిర్‌పోర్ట్ కోడ్ కూడా కొత్త విమానాశ్రయానికి బదిలీ అయింది. పాత ఎయిర్‌పోర్ట్‌లో వాణిజ్య సేవలు లేకపోవడంతో ఇమ్మిగ్రేషన్ హోదా కొనసాగించాల్సిన అవసరం లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.
2026 జూలైలోనే కేంద్రం భోగాపురం విమానాశ్రయాన్ని ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌ల జాబితాలో కేటగిరీ-I కింద 39వ స్థానంలో చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి తర్వాత భోగాపురం మూడవ ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా గుర్తింపు పొందింది.
భోగాపురం నుంచే అంతర్జాతీయ విమానసేవలు
ఇకపై విదేశీ విమానాలు కేవలం భోగాపురం నుంచే నడుస్తాయి.అంతర్జాతీయ ప్రయాణికుల ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, కస్టమ్స్ సేవలు భోగాపురం విమానాశ్రయంలోనే అందుబాటులో ఉంటాయి.పాత విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇకపై ఇమ్మిగ్రేషన్ సేవలు ఉండవు. అయితే సైనిక, అత్యవసర, వీఐపీ విమానాలకు మినహాయింపు ఉండవచ్చు.భోగాపురం విమానాశ్రయం సంవత్సరానికి దాదాపు 4 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో నిర్మించబడింది.ఆధునిక ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, ఈ-గేట్లు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రధాన అంతర్జాతీయ గేట్‌వేగా భోగాపురం విమానాశ్రయం సేవలందిస్తోంది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
