AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పటికీ ఇండస్ట్రీలో తోపు.. 52 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..

1990ల కాలంలో తన సహజమైన అందం, నటనతో దక్షిణాదిని ఏలిన హీరోయిన్. ప్రస్తుతం 52 ఏళ్ల వయసులోనూ ఒంటరిగానే ఉంటున్నారు. అప్పట్లో స్టార్ హీరోలతో వెండితెరపై స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె ప్రస్తుతం యంగ్ హీరోలకు తల్లిగా, అక్కగా, వదినగా నటిస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలోనే బిజీ ఆర్టిస్టుగా ఉన్న ఆమె జీవిత, సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.

Tollywood : అప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పటికీ ఇండస్ట్రీలో తోపు.. 52 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
Sitara
Rajitha Chanti
|

Updated on: Nov 10, 2026 | 8:55 PM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో 1990వ దశకంలో తన సహజమైన అందం, అద్భుతమైన అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి సితార. అప్పట్లో కుర్రకారు డ్రీమ్ గర్ల్‌గా వెలుగొందిన ఆమె, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్ పాత్రల కంటే అభినయానికి ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తూ సినిమాలకు కొద్దిగా దూరం కావడం, ఇప్పటికీ 52 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తుండటం వెనుక ఉన్న అసలు కారణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కేరళకు చెందిన సితార 1986లో విడుదలైన మలయాళ చిత్రం ‘కావేరి’ ద్వారా బాలనటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి దిగ్గజ నటుల సరసన నటించి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘పుదుపుతు అర్థంగల్’ ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ చిత్రంలో ఆమెపై వచ్చిన ‘కేలడి కన్మణి’ పాట ఆమెకు ఓవర్ నైట్ స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులోనూ అగ్ర హీరోల సరసన నటిస్తూ వరుస హిట్లు అందుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

అయితే కెరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలో ఆమె జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. తండ్రి ఆకస్మిక మరణం సితార కుటుంబాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. పెద్ద కుమార్తెగా కుటుంబ బాధ్యతలు మొత్తం ఆమె భుజాన వేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా తన తమ్ముడిని బాగా చదివించి డాక్టర్‌ను చేయాలన్న తండ్రి కల నెరవేర్చడమే తన ప్రథమ కర్తవ్యంగా భావించారు. ఈ కుటుంబ బాధ్యతలు, తమ్ముడి భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయాణంలో ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని, వివాహాన్ని పూర్తిగా పక్కన పెట్టవలసి వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

కాలక్రమేణా కథానాయికగా అవకాశాలు తగ్గినప్పటికీ, సితార వెనుకంజ వేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఇప్పటి యంగ్ హీరోలకు తల్లిగా, వదినగా, పిన్నిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తెలుగు, తమిళ తెరపై ఇప్పటికీ బిజీ నటిగా కొనసాగుతున్నారు. సినిమాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్‌లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, ఒంటరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సితార ప్రస్తుతం బిజీ ఆర్టి్స్టుగా కొనసాగుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

సితార..

Sitara Life

Sitara Life

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 52 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 52 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు
APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు
6 దశాబ్దాల ప్రస్థానం.. ప్రపంచానికి తెలియని కథ.. సోనియా గాంధీ..
6 దశాబ్దాల ప్రస్థానం.. ప్రపంచానికి తెలియని కథ.. సోనియా గాంధీ..
దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో పిచ్చి ట్రెండింగ్..
దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో పిచ్చి ట్రెండింగ్..
ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..
ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..
ముచ్చింతల్‌ విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ రికార్డ్
ముచ్చింతల్‌ విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ రికార్డ్
ఫంక్షన్లలో విందుకు ముందు కీరా, క్యారెట్ ఎందుకు పెడతారో తెలుసా?
ఫంక్షన్లలో విందుకు ముందు కీరా, క్యారెట్ ఎందుకు పెడతారో తెలుసా?
కార్తీక‌మాసంలో 30 రోజులు నాన్‌వెజ్ మానేస్తే శరీరంలో జరిగే మార్పు
కార్తీక‌మాసంలో 30 రోజులు నాన్‌వెజ్ మానేస్తే శరీరంలో జరిగే మార్పు
తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్
తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్
చలికాలంలో కళ్లలో మంట, దురదకు అసలు కారణం ఇదే.. ఈ తప్పులు చేయకండి!
చలికాలంలో కళ్లలో మంట, దురదకు అసలు కారణం ఇదే.. ఈ తప్పులు చేయకండి!