AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఆ హీరో అసభ్యకరమైన ఫోటో చూపించారు.. అందుకే సీరియల్స్ చేస్తున్నా.. టాలీవుడ్ నటి..

ప్రస్తుతం ఆమెకు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్. చేసేది విలన్ రోల్స్ అయినప్పటికీ హీరోయిన్లకు మించి గ్లామర్, ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే సినిమాలకు స్వస్తి చెప్పి బుల్లితెరపైనే స్థిరపడటానికి గల కారణాలను వివరిస్తూ ఈ సీరియల్ నటి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. . షూటింగ్ స్పాట్‌లో ఒక పెద్ద హీరో తనకు ఫోన్‌లో అసభ్యకరమైన ఫోటో చూపించాడని అందుకే సినిమాలు వదిలేసి సీరియల్స్ వైపు వచ్చేశానని ఆమె వెల్లడించారు.

Actress : ఆ హీరో అసభ్యకరమైన ఫోటో చూపించారు.. అందుకే సీరియల్స్ చేస్తున్నా.. టాలీవుడ్ నటి..
Sandhya Jagarlamudi
Rajitha Chanti
|

Updated on: Nov 10, 2026 | 7:56 PM

Share

రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండితెర తారలతో పాటు బుల్లితెర నటీనటులకు కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా సీరియల్స్‌లో ప్రధాన పాత్రల కంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలు పోషించే నటీమణులకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తమిళంలో ‘వంశం’, ‘చంద్రలేఖ’, ‘సంధ్యారాగం’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో క్రేజ్ సొంతం చేసుకుని, తెలుగులో ‘అమ్మాయి కాపురం’ ప్రస్తుతం ప్రసారమవుతున్న ‘మేఘసందేశం’ సీరియల్‌లో విలన్ పాత్రతో అలరిస్తున్న ప్రముఖ సీరియల్ నటి సంధ్య జాగర్లమూడి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలు, ‘కాస్టింగ్ కౌచ్’ సంస్కృతిపై చేసిన సంచలన కామెంట్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్వ్యూలో సంధ్య మాట్లాడుతూ.. తాను సినిమా రంగానికి స్వస్తి చెప్పి పూర్తిగా బుల్లితెరకే పరిమితం కావడానికి గల కారణాలను బహిరంగంగా వెల్లడించారు. “నేను డబ్బు సంపాదించడం కోసమే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ సినిమాల్లోకి వెళ్తే అక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది. కొంతమంది ఫోన్ చేసి నేరుగా ‘సర్దుబాటు చేయగలరా?’ అని అడిగేవారు. అలా అడిగినప్పుడు నాకు తీవ్రమైన కోపం వచ్చేది. సినిమా తీస్తున్నారా లేదా మరేదైనా చేస్తున్నారా? అని ఎదురు ప్రశ్నించేదాన్ని. ఒకసారి అలా అడిగిన వ్యక్తికి ‘నీకు ఇంట్లో అమ్మ, చెల్లి లేదా?’ అని గట్టిగా నిలదీస్తే.. ‘నీలాంటి అందమైన భార్య లేదు’ అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత నుండి అలాంటి ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టాను” అని ఆమె పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన మరో చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె షాకింగ్ విషయాలు బయటపెట్టారు. “తమిళంలో ఒక పెద్ద సినిమా షూటింగ్ కోసం వెళ్లాను. అక్కడ ఉన్న ఒక అగ్ర హీరో పట్ల నేను ఎంతో మర్యాదగా నడుచుకున్నాను. ఆయన పక్కన కూర్చున్న సమయంలో ఆయన ఫోన్ చూస్తూ పెద్దగా నవ్వి, నా వైపు తిరిగి ‘ఇది చాలా కామెడీగా ఉంది చూడు’ అంటూ ఫోన్ చూపించాడు. తీరా చూస్తే అది ఒక అసభ్యకరమైన ఫోటో. ఒక స్టార్ హీరో అయి ఉండి అలా ప్రవర్తించడంతో నాకు తీవ్రమైన అసహ్యం వేసింది. వెంటనే కోపంతో అక్కడి నుంచి వచ్చేశాను” అని ఆమె తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

సినిమాల్లో ఉండే వాతావరణం తన మనస్తత్వానికి అసలు సరిపోదని సంధ్య స్పష్టం చేశారు. “సినిమా ప్రాజెక్టులు స్వల్పకాలికంగా ఉంటాయి మరియు అక్కడ అనుక్షణం రాజీ పడాల్సి వస్తుంది. కానీ సీరియల్స్ అలా కాదు, ఏళ్ల తరబడి షూటింగ్స్ సాగుతాయి. ఇక్కడ గౌరవప్రదమైన వాతావరణం ఉంటుంది. అందుకే సినిమాలను పక్కన పెట్టి బుల్లితెరపైనే నటిగా స్థిరపడిపోయాను” అని ఆమె వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

సంధ్య..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us
సినిమాలు వద్దనుకుని బుల్లితెరపైనే సెటిల్ అయ్యా..
సినిమాలు వద్దనుకుని బుల్లితెరపైనే సెటిల్ అయ్యా..
ఫ్రెండ్ పెళ్లిలో స్పెషల్‌గా కనిపించాలా? అబ్బాయిలు ఇవి ట్రై చేయండి
ఫ్రెండ్ పెళ్లిలో స్పెషల్‌గా కనిపించాలా? అబ్బాయిలు ఇవి ట్రై చేయండి
వాస్తు ప్రకారం.. ఇంట్లోకి కప్ప రావడం శుభమా? అశుభమా?
వాస్తు ప్రకారం.. ఇంట్లోకి కప్ప రావడం శుభమా? అశుభమా?
కస్టమర్ల వేషంలో వచ్చారు, కట్‌చేస్తే.. బంగారు ఉంగరాల ట్రేతో పరార్
కస్టమర్ల వేషంలో వచ్చారు, కట్‌చేస్తే.. బంగారు ఉంగరాల ట్రేతో పరార్
రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
అప్పుడు హీరో.. ఒక్క సినిమాతో మారిన కెరీర్..
అప్పుడు హీరో.. ఒక్క సినిమాతో మారిన కెరీర్..
నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. స్టార్ ప్లేయర్లు దూరం
నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. స్టార్ ప్లేయర్లు దూరం
బ్యాచిలర్స్ కోసం కేరళ చికెన్ రోస్ట్.. రుది అదిరిపోద్ది
బ్యాచిలర్స్ కోసం కేరళ చికెన్ రోస్ట్.. రుది అదిరిపోద్ది
ఏ గ్లాస్‌లో ఎక్కవ నీరు ఉన్నాయో 10 సెకన్లలో చెబితే మీరే తోపు
ఏ గ్లాస్‌లో ఎక్కవ నీరు ఉన్నాయో 10 సెకన్లలో చెబితే మీరే తోపు
ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరికి పొంచి ఉన్న ముప్పు
ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరికి పొంచి ఉన్న ముప్పు