నభా నటేష్ అప్ కమింగ్ సినిమాలు.. అబ్బో చాలానే ఉన్నాయే   

10 November 2026

Rajeev 

కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న నభా నటేష్ ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభూలో నభా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి

 ఈ సినిమాలో నభా సుందరవల్లి అనే పాత్రలో కనిపించనుంది. ఇంతకుముందు చేయని విభిన్నమైన పాత్రలో ఆమె కనిపించబోతోంది.

 భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది.

అలాగే నభా నటేష్ తన సొంత ఇండస్ట్రీ కన్నడలోకి కూడా తిరిగి అడుగుపెడుతోంది. ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.

విశాల్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న కెమిస్ట్రీ సినిమాలో నభా నటిస్తోంది. ధ్రువ సర్జాతో తొలిసారి జతకట్టనుంది.

పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్: స్వయంభూ వంటి భారీ చిత్రాలతో ఇతర భాషల ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలని నభా ప్రయత్నిస్తోంది.