AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మరాఠీ, హిందీ వినోద ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన నటి, తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు . 'మే ఐ కమ్ ఇన్ మేడమ్?', 'భాభీజీ ఘర్ పర్ హై' వంటి సీరియల్స్ ద్వారా నేహాకు ప్రత్యేక ప్రజాదరణ లభించింది. అయితే, ఆమె వృత్తి జీవితంతో పాటు, ఒకానొక సమయంలో ఆమె వివాహం కూడా తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆమె ఎవరంటే.

Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
Neha Pendse
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2026 | 1:32 PM

Share

మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమల్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నేహా పెండ్సే తన వృత్తిపరమైన విషయాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ‘మే ఐ కమ్ ఇన్ మేడమ్?’, ‘భాబీజీ ఘర్ పర్ హై’ వంటి పాపులర్ హిందీ టీవీ సీరియళ్లతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నేహా, తెలుగు, తమిళ, మరాఠీ సినిమాల్లోనూ నటించారు. తెలుగులో సొంతం చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. అయితే, 2020లో ఆమె చేసుకున్న వివాహం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి, చర్చకు దారితీసింది. నేహా పెండ్సే 2020 జనవరి 5న పూణేకు చెందిన వ్యాపారవేత్త శార్దూల్ సింగ్ వ్యాస్‌ను వివాహం చేసుకున్నారు. అయితే శార్దూల్‌కు ఇదివరకే రెండుసార్లు వివాహమై విడాకులు కావడం, అంతేకాకుండా ఆయనకు మొదటి ఇద్దరి భార్యల ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉండటంతో నెటిజన్లు నేహాను తీవ్రంగా ట్రోల్ చేశారు. రెండు విడాకులు అయిన వ్యక్తిని, ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకోవడంపై ఆమెను సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

ఈ ట్రోలింగ్‌పై నేహా పెండ్సే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. “రెండు పెళ్లిళ్లు విఫలమైనప్పటికీ శార్దూల్ వివాహ వ్యవస్థపై నమ్మకం కోల్పోకుండా మరోసారి భాగస్వామిని ఎంచుకోవడమే ఆయనలోని పాజిటివ్ మైండ్‌సెట్‌ను చూపిస్తోంది. గతంలో విడాకులు కావడం నేరం కాదు. నేటి కాలంలో పెళ్లికి ముందే ఎందరో డేటింగ్ చేసి విడిపోతుంటారు, కానీ శార్దూల్ చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని విడిపోయారు” అని నేహా స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

నేహా భర్త శార్దూల్ సింగ్ వ్యాస్ మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త. సమాచారం ప్రకారం ఆయనకు దాదాపు 22 కంపెనీలు ఉన్నాయి. శార్దూల్ ఆస్తి విలువ బిలియన్ డాలర్లలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 10 ఏళ్ల పిన్న వయసులోనే ‘కెప్టెన్ హౌస్’ ధారావాహిక ద్వారా బాలనటిగా కెరీర్ ప్రారంభించిన నేహా, ఇటు సీరియళ్లు, అటు సినిమాలు చేస్తూనే తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ధైర్యమైన నిర్ణయంతో అందరి దృష్టిని ఆకర్షించారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

నేహా..

View this post on Instagram

A post shared by Nehha Pendse (@nehhapendse)

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us
2 సార్లు విడాకులు.. బడా వ్యాపారవేత్తతో పెళ్లి.. కట్ చేస్తే..
2 సార్లు విడాకులు.. బడా వ్యాపారవేత్తతో పెళ్లి.. కట్ చేస్తే..
హార్దిక్ లేదా శ్రేయస్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎవరు..?
హార్దిక్ లేదా శ్రేయస్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎవరు..?
దీపావళి రాశిఫలాలు.. కష్టాలు ఎదుర్కునే రాశులివే!
దీపావళి రాశిఫలాలు.. కష్టాలు ఎదుర్కునే రాశులివే!
దీపావళి పూజ చేస్తున్నారా? ఇంట్లో గంటను ఎప్పుడు మోగించాలంటే
దీపావళి పూజ చేస్తున్నారా? ఇంట్లో గంటను ఎప్పుడు మోగించాలంటే
కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?
కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?
సుధీర్, వర్షిణీ సేఫ్.. బిగ్ బాస్10 ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్
సుధీర్, వర్షిణీ సేఫ్.. బిగ్ బాస్10 ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
దీపావళీ బరిలో సూర్య సెన్సేషన్.. సీన్ సినిమాతో రికార్డులు..
దీపావళీ బరిలో సూర్య సెన్సేషన్.. సీన్ సినిమాతో రికార్డులు..
చేతులెత్తేసిన సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులు.. పోరాడుతోన్న అర్జున్
చేతులెత్తేసిన సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులు.. పోరాడుతోన్న అర్జున్
చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుంచి రూ. 277 కోట్ల వ్యాపారం వరకు!
చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుంచి రూ. 277 కోట్ల వ్యాపారం వరకు!