AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎస్.వి. కృష్ణారెడ్డి సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అలాగే ఆయన సినిమాల్లోని పాటలు సైతం అదే స్థాయిలో సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియాలో కొన్ని పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా మనం మాట్లాడుకుంటున్న ఓ పాట మాత్రం మిలియన్ వ్యూస్ అందుకుంటూ దుమ్మురేపుతుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న పాటేంటో తెలుసుకుందామా.

Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..
Abhivandanam Full Song
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2026 | 8:28 PM

Share

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక సినిమా హిట్ కావాలంటే పెద్ద స్టార్ హీరోలు, కోట్ల రూపాయల బడ్జెట్ ఉండాలనే రూల్ ఏమీ లేదని ఎప్పుడో నిరూపించారు దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి. కేవలం చక్కటి కథ, బలమైన హాస్యం, ఎమోషన్స్‌తో పాటు అద్భుతమైన సంగీతం ఉంటే చాలు సినిమా ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో ఆయన అందించిన చిత్రాలే ఉదాహరణ. ఆ కోవకే చెందుతుంది ఆల్ టైమ్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్ ‘యమలీల’. ఈ చిత్రంలో అప్పట్లో ఎలాంటి భారీ స్టార్ కాస్ట్ లేకపోయినా.. కమెడియన్ అలీ హీరోగా, కథానాయిక ఇంద్రజ అభినయంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి చరిత్ర సృష్టించింది. 1994లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ సినిమాలో మంజు భార్గవి, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, ఏవీఎస్ వంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి.

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

ఇక ఈ సినిమా విజయంతో పాటు ఇందులో వచ్చే ప్రతీ ఒక్క పాట శ్రోతల మనసును దోచుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు అప్పట్లో ఆడియో క్యాసెట్లు, రేడియోల ద్వారా ఊరూవాడ మారుమోగాయి. స్టార్ హీరో హీరోయిన్ల అవసరం లేకుండా కేవలం సిట్యుయేషనల్ కామెడీ , అద్భుతమైన సాహిత్యంతో సాగే ఈ పాటలు నేటికీ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఈ సినిమాలోని క్యాచీ ట్యూన్స్, పాటలను ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలబెట్టాయి. అందులో అభినందం సాంగ్ ఒకటి. “అభి వందనం యమా రాజాగ్రణి.. సుస్వాగతం సుర చూడామణి.. తమ సుగుణాలు పలుమారు కీర్తించని” అంటూ సాగే ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్ షేక్ చేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యంతోపాటు దివంగత గాయకుడు ఎస్పీ బాలు, కే.ఎస్ చిత్ర తమ గాత్రంతో ప్రాణం పోశారు. ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం అందించారు. కాలం ఎంత మారినా, ఎన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నా.. పాత తరహా మధురమైన బాణీలను ఇష్టపడే మ్యూజిక్ లవర్స్ ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్‌లో రిపీట్ మోడ్‌లో వింటూనే ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రీల్స్ రూపంలోనూ ఈ పాటలు మళ్లీ ట్రెండ్ అవుతుండటం విశేషం. చిన్న చిత్రంగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన ‘యమలీల’ చిత్రంలోని ఈ పాట తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరగని మ్యూజికల్ మైలురాయిగా నిలిచిపోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

అభివందనం సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Follow Us