Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
ప్రముఖ నటి సౌందర్యతో తనకున్న అనుబంధంపై సీనియర్ నటుడు సురేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఆమెతో తనది అన్న చెల్లెళ్ల బంధం మాత్రమేనని అన్నారు. తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న సమయంలోనే సౌందర్య స్టార్‌డమ్‌లోకి వచ్చారని సురేష్ గుర్తు చేసుకున్నారు. ఇద్దరి వయస్సు దగ్గరగా ఉండటం వల్ల తాము మంచి స్నేహితులుగా మారినట్లు చెప్పారు.

ప్రముఖ నటి సౌందర్యతో తనకున్న వ్యక్తిగత, వృత్తిపరమైన అనుబంధంపై నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. తమ మధ్య ఉన్నది స్వచ్ఛమైన అన్న చెల్లెళ్ల బంధం మాత్రమేనని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అవాస్తవ కథనాలను ఆయన ఖండించారు. తన భార్యతో కూడా సౌందర్య చాలా సన్నిహితంగా ఉండేవారని, తమ కుటుంబాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని వివరించారు. నటుడు సురేష్ మాట్లాడుతూ, “నేను సౌందర్యకు పరిచయం అయ్యే నాటికి ఆమె ఇప్పటికే స్టార్‌డమ్‌లోకి వచ్చారు. నేను అప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నాను, రాఘవేంద్రరావు గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశాను. మా ఇద్దరి వయస్సు దగ్గరగా ఉండటం వల్ల మేము త్వరగా క్లోజ్ అయ్యాం. ఆమె నన్ను అన్నయ్య అని పిలిచేది. మేము బాగా క్లోజ్ అయిన తర్వాత తరచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళం. ఏ సందేహం వచ్చినా ఒకరికొకరం పంచుకునేవాళ్ళం. మాది కేవలం వృత్తిపరమైన సంబంధం కాకుండా, ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం” అని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
సౌందర్య కుటుంబంతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని సురేష్ మరింతగా వివరించారు. “తమిళ షూటింగ్‌లకు వెళ్ళినప్పుడు, నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. సౌందర్య అన్నయ్య అమరనాథ్ నాకు సౌందర్య కన్నా ముందే మంచి ఫ్రెండ్. వారి కుటుంబంతో నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని. సౌందర్య స్టార్ కాబట్టి నేను వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. మేమిద్దరం కూడా ఒక అన్న చెల్లెలుగా ఉండేవాళ్ళం. నా భార్యతో కూడా సౌందర్య చాలా సన్నిహితంగా ఉండేది. ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్ళినా కూడా ఇద్దరం పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం” అని గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam: వాళ్లు ఏదో అనుకుంటారని ఆగకు.. జీవితంపై బ్రహ్మానందం చెప్పిన అద్భుతమైన మాటలు..
సౌందర్య భర్తతో తన పరిచయం గురించి కూడా సురేష్ వివరించారు. “సౌందర్య నన్ను మొదటిసారి కలిసినప్పుడు తన బావ ఉన్నాడని, అతను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని నాకు చెప్పింది. తర్వాత అతను కూడా సెట్‌కి వచ్చి, మా అందరినీ పరిచయం చేసుకున్నాడు. అందరితో మాట్లాడాడు. అప్పుడు అతను కూడా నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. మాది ఒక కుటుంబం లాంటిది. నా పెళ్లికి కూడా సౌందర్య హాజరయ్యింది. మేము, ఆ అమ్మాయి, ఇద్దరం అంత క్లోజ్. నా పెళ్లికి ఆమె రావడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు కూడా కలిసి చేశాం. అంతే కానీ, ఎప్పుడూ కూడా ఒకరి మీద ఒకరికి చెడ్డ అభిప్రాయం రాలేదు” అని సురేష్ స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Kodi Ramakrishna: ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో.. దాసరి గారు ఒక మాట అన్నారు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..
సురేష్, సౌందర్య..

Suresh, Soundarya Movies
ఎక్కువ మంది చదివినవి : SV Krishna Reddy: ఆమె అద్భుతమైన హీరోయిన్.. మధ్యతరగతి పాత్రలకు సరిగ్గా సెట్ అవుతుంది.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..
