రాహువు అభయం.. త్వరలో ఈ రాశులకు విదేశీ ఉద్యోగ యోగం పక్కా..!
Foreign Job Astrology: మనలో చాలా మంది విదేశాల్లో ఉద్యోగం చేయాలని, అక్కడే స్థిరపడాలని కలలు కంటుంటారు. గ్రహాల సంచారం అనుకూలంగా మారడంతో త్వరలోనే వీరిలో కొన్ని రాశుల వారి కల నెరవేరే అవకాశముంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలకు కారకుడైన రాహువు త్వరలో రాశి మారనున్నాడు (Rahu Gochar 2026). ఈ సంచారంతో ఆరు రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు, ఉన్నత చదువులు, విదేశీ పర్యటనలకు సంబంధించిన అవకాశాలు కలిగే సూచనలు ఉన్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు విదేశీ ఉద్యోగాలకు, విదేశీ జీవితానికి కారకుడు. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ ఈ గ్రహం అనుకూలంగా ఉన్న పక్షంలో తప్పకుండా విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకునే అవకాశం లభిస్తుంది. డిసెంబర్ 5 నుంచి ఏడాదిన్నర పాటు రాహువు మకర రాశిలో (Rahu Transit 2026) సంచారం చేయబోతున్నందువల్ల విదేశీ వృత్తి ఉద్యోగాలకు, విదేశీ పర్యటనలకు, విదేశీ సంబంధాలకు అవకాశాలు లభిస్తాయి. రాహువు కుంభం వంటి స్థిర రాశిలో కంటే మకరం వంటి చర రాశిలో యోగకారకుడవుతాడు. రాహువు మకర సంచారంలో మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి తప్పకుండా విదేశీ అవకాశాలు లభిస్తాయి.
మేష రాశి
ఈ రాశికి దశమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగాలు చేయడా నికి అవకాశాలు లభిస్తాయి. తప్పకుండా విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఈ రాశికి చెందిన వృత్తుల వారు కూడా విదేశాల్లో స్థిరపడే అవకాశం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశీ పర్యటనలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులు ఎక్కువగా విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది.
వృషభ రాశి
ఈ రాశికి భాగ్య స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా కొద్ది ప్రయత్నంతో విదేశాల నుంచి ఆఫర్లు అందడం జరుగుతుంది.ల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వృత్తులవారికి కూడా విదేశాల్లో స్థిరత్వం లభించే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదే శాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. డిసెంబర్ లో విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
కర్కాటక రాశి
ఈ రాశికి రాహువు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల డిసెంబర్ తర్వాత ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా కొన్ని విదేశీ కంపె నీల నుంచి ఆహ్వానాలు అందే సూచనలున్నాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి విదేశాల నుంచి అనేక అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ ప్రయాణాలు, పర్య టనలు చేయవలసి వస్తుంది. విదేశీ ప్రయాణాలకు తప్పకుండా మార్గం సుగమమవుతుంది.
తులా రాశి
ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఈ రాశివారికి డిసెంబర్ మొదటి వారం నుంచి విదేశీ అవకాశాలు లభించడం ప్రారంభం అవుతుంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా ఉద్యోగులకు డిమాండ్ పెరిగి, విదేశాల నుంచి ఆహ్వానాలు అందే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేసు కుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఉన్నత పదవులు, భారీ సంపాదన పొందే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
ఈ రాశికి మూడవ స్థానంలోకి రాహువు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. విదేశీయానానికి అవకాశాలు వృద్ది చెందుతాయి. విదేశాల్లోనే వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆదాయ వృద్దికి అవకాశాలు కలుగుతాయి. అనేక దేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మకర రాశి
ఈ రాశిలో రాహువు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారికి దూర ప్రయాణాలు, విదేశీ ప్రయా ణాలు ఎక్కువవుతాయి. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు లభించి అనేక విధాలుగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు కొన్ని అరుదైన విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యో గులు కొద్ది ప్రయత్నంతో ఇతర దేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది.



