ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులంటే ప్రాణం.. ఎంతో ప్రేమ, బాధ్యతగా ఉంటారట!
Numerology: పిల్లలకు తల్లిదండ్రులే ప్రపంచం. అయితే కొందరు పిల్లలు తల్లిదండ్రుల సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. వారి పట్ల అత్యధిక ప్రేమ, అనురాగాలను చూపుతుంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయట. మరి ఆ తేదీలు ఏమిటి? ఈ పిల్లల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయత వెలకట్టలేనివి. అయితే కొందరు పిల్లలు చిన్న వయసు నుంచే తల్లిదండ్రులను బాగా అర్థం చేసుకుని, వారి సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. తల్లిదండ్రుల విషయంలో వీరు ఎంతో ప్రేమ, ఆప్యాయంగా ఉంటారు. వారి సుఖసంతోషాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం పిల్లల పుట్టిన తేదీ తల్లిదండ్రుల విషయంలో వారి స్వభావంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన పిల్లలు వారి తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా, బాధ్యతగా, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. మరి ఆ పిల్లల పుట్టిన తేదీలు ఏమిటి? వారి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
మూల సంఖ్య 2
ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన పిల్లల మూల సంఖ్య 2 అవుతుంది. ఈ సంఖ్యకు చంద్రుడు అధిపతిగా ఉంటాడు. చంద్రుడి ప్రభావం వల్ల ఈ పిల్లలు ఎంతో సున్నిత మనస్కులుగా, భావోద్వేగాలు కలిగినవారిగా ఉంటారు. వీరు తల్లిదండ్రులను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇంట్లో ఎవరైనా బాధపడుతున్నా, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. వారు బయటకు చెప్పకుండానే వెంటనే గుర్తిస్తారు. తల్లిదండ్రులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకుంటారు. ఇతరుల పట్ల ప్రేమ, ఆప్యాయత చూపించడంలో వీరు ముందుంటారు.
మూల సంఖ్య 7
ఏ నెలలోనైనా 7, 16, 25 తేదీల్లో జన్మించిన పిల్లల మూల సంఖ్య 7 అవుతుంది. ఈ సంఖ్యకు కేతువు అధిపతిగా పరిగణిస్తారు. ఈ మూల సంఖ్య కలిగిన పిల్లలు కుటుంబ సంబంధాలకు, ప్రేమానురాగాలకు ఎంతో విలువ ఇస్తారని న్యూమరాలజీ చెబుతోంది. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడుచుకుంటారు. వారి చిన్న చిన్న కోరికలను తీర్చేందుకు ప్రయత్నిస్తారు. కష్టసమయాల్లో తల్లిదండ్రులకు అండగా నిలుస్తారు. ఏ విషయంలోనైనా కుటుంబ సభ్యుల భావాలను గౌరవిస్తారు. తల్లిదండ్రుల సంతోషం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు.
మూల సంఖ్య 9
ఏ నెలలోనైనా 9, 18, 27 తేదీల్లో జన్మించిన పిల్లల మూల సంఖ్య 9 అవుతుంది. ఈ సంఖ్యకు కుజుడు అధిపతిగా ఉంటాడు. కుజుడి ప్రభావం వల్ల ఈ పిల్లలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, చురుకుగా ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులకు ఏదైనా సమస్య ఎదురైతే ముందుగా స్పందించి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. వారి భద్రత, సంతోషానికి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే స్వభావం కలిగి ఉంటారు.
(ముఖ్య గమనిక: ఇవన్నీ సంఖ్యాశాస్త్రంలో ఉన్న నమ్మకాల ఆధారంగా చెప్పిన విషయాలు మాత్రమే. ఇవి నిజమేనని నిరూపించేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు. పిల్లల అసలు స్వభావం వారి పెంపకం, కుటుంబ వాతావరణం, విద్య, అనుభవాలపై కూడా ఆధారపడి ఉంటుంది)




