AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ఏళ్ల తర్వాత వీరికి తిరుగులేని అదృష్టం..కెరీర్, ఆర్థిక విషయాల్లో పురోగతి..!

Telugu Astrology: కొన్ని రాశుల వారికి 30 ఏళ్లు దాటిన తర్వాత జాతకం మారుతుంది. అదృష్టం కొత్త మలుపు తీసుకోనుంది. అప్పటివరకు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడంతో పాటు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనూహ్యమైన పురోగతి కనిపించనుంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవి? వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి?

30 ఏళ్ల తర్వాత వీరికి తిరుగులేని అదృష్టం..కెరీర్, ఆర్థిక విషయాల్లో పురోగతి..!
Lucky Zodiac Signs
Janardhan Veluru
|

Updated on: Nov 16, 2026 | 5:03 PM

Share

జ్యోతిషశాస్త్రం మేరకు కొన్ని రాశుల వారికి చిన్న వయసులోనే విజయాలు లభిస్తాయి. మరికొందరు మాత్రం జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా మూడు రాశుల వారికి 30 ఏళ్ల వయసు దాటిన తర్వాతే అదృష్టం కలిసివస్తుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. అప్పటివరకు ఎదురైన కష్టాలు, అడ్డంకులు క్రమంగా తొలగిపోయి కెరీర్‌, ఆర్థిక పరిస్థితి, సామాజిక గౌరవం విషయంలో మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయని చెబుతారు. ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..

1. వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశి వారు పట్టుదల, ఏకాగ్రత, దృఢ సంకల్పానికి ప్రాధాన్యం ఇస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించని స్వభావం వీరి సొంతం. అయితే చిన్న వయసులో వీరు కొన్ని భావోద్వేగపరమైన సమస్యలు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీని కారణంగా కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గినా, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. 30 ఏళ్లు దాటిన తర్వాత వీరి ఆలోచనా విధానంలో పరిణతి పెరుగుతుంది. ముఖ్యంగా కెరీర్, వ్యాపార రంగాల్లో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. క్రమంగా సామాజికంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. పట్టుదలతో చేసే ప్రయత్నాలు విజయానికి బాటలు వేస్తాయి.

2. మకర రాశి (Capricorn): మకర రాశికి శని అధిపతి. జ్యోతిషశాస్త్రంలో శనిని కర్మ, క్రమశిక్షణ, న్యాయానికి కారకుడిగా భావిస్తారు. ఈ రాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా తొందరపడకుండా ఓపికగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగుతారు. అందువల్ల ఇతరులతో పోలిస్తే వీరికి విజయాలు కొంత ఆలస్యంగా దక్కుతాయి. అయితే 30 ఏళ్ల తర్వాత వీరి జీవితంలో స్థిరత్వం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు, అధిక బాధ్యతలు చేపట్టే అవకాశాలు లభించే అవకాశముంది. వ్యాపారులకు వ్యాపార విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. నిరంతర శ్రమ, క్రమశిక్షణ వీరిని ఉన్నత స్థానాలకు చేర్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

3. కుంభ రాశి (Aquarius): ఈ రాశికి కూడా శని అధిపతి. ఈ రాశి వారు స్వతంత్ర ఆలోచనలు, కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇతరులు అనుసరించే సంప్రదాయ మార్గాలకు భిన్నంగా తమదైన శైలిలో ముందుకు వెళ్లాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం, సరైన నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్ల ఆశించిన ఫలితాలు వెంటనే అందుకోలేరు. 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత అనుభవం, పరిణతి పెరిగి జీవితంలో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో గౌరవం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు, అవకాశాలు వీరి ప్రతిభను నిరూపించుకునేందుకు సహాయపడతాయి. పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి గుర్తింపు పొందుతారు.

(గమనిక: ఇవి జ్యోతిషశాస్త్ర విశ్వాసాల ఆధారంగా అందించిన అంచనాలు మాత్రమే. ఒక వ్యక్తి విజయం వయసు లేదా రాశిపై మాత్రమే ఆధారపడి ఉండదు)

Follow Us