AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రహాల అనుకూలత.. ఈ ఏడాది చివరికల్లా వీరు అనుకున్నది సాధిస్తారు..!

Success Astrology: శుభ గ్రహాలతో పాటు పాప గ్రహాలు కూడా అనుకూలించడం వల్ల కొన్ని రాశులవారు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి ఈ ఏడాది చివరి లోగా తమ ఆశయాలు, ఆశలు, కలలు, కోరికలను సఫలం చేసుకునే అవకాశం ఉంది. తమ దీక్షాదక్షలతో తాము అనుకున్నది అనుకున్నట్టు సాధించే రాశుల్లో వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులు ఉండబోతున్నాయి. ఈ నెల(నవంబర్) 15 నుంచి జనవరి 2వ తేదీ వరకు అత్యధిక గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశులవారికి మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి తీరడంతో పాటు ఊహించని విధంగా విజయాలు, సాఫల్యాలు ఎక్కువ సంఖ్యలో కలిగే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 14, 2026 | 5:31 PM

Share
వృషభం: వ్యూహాత్మకంగా వ్యవహరించడం, దూరదృష్టి కలిగి ఉండడం, ఒక ప్రణాళిక ప్రకారం భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకోవడం వంటి లక్షణాలతో పాటు గట్టి పట్టుదల కలిగిన ఈ  రాశి వారు ఈ ఏడాది ఆదాయ వృద్ధికి, కుటుంబ పురోగతికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మదుపులు, పెట్టుబడులు పెంచడం, తమకు రావలసిన డబ్బును రాబట్టుకోవడం, ఆచితూచి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని సాధించి సంపన్నులయ్యే అవకాశం ఉంది.

1 / 6
మిథునం: పట్టుదలకు, ప్రణాళికలకు, పథకాలకు మారుపేరైన ఈ రాశివారు ఎంతో తెలివిగా అనేక విధాలుగా ఆదాయాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. పొదుపు పాటించడం, మదుపు చేయడం, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందడం వంటి చర్యల వల్ల  వీరి ఆదాయం వృద్ది చెందుతుంది. ప్లాన్లు వేయడంలో సిద్ధహస్తులైన వీరు ఆస్తిపాస్తులు కూడగట్టుకో వడంలో, ఆస్తి వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకుని బాగా లబ్ధి పొందడం జరుగుతుంది.

2 / 6
కన్య: ఈ రాశికి శుభ గ్రహాలతో పాటు రాహువు, రవి కూడా బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల అదనపు ఆదాయ మార్గాలు చేపట్టడం, ఖర్చులు బాగా తగ్గించుకోవడం, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల ద్వారా ఈ రాశివారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకునే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూటికి నూరు పాళ్లు కలిసి వస్తాయి. రావలసిన సొమ్మును, బాకీలు, బకాయిలను పట్టుదలతో రాబట్టుకుని ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు.

3 / 6
తుల: వ్యాపార దక్షతకు ప్రతిరూపమైన ఈ రాశివారు ఆదాయ వృద్దికి ప్రతి అవకాశాన్నీ, ప్రతి ప్రయ త్నాన్నీ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. వీరి కృషి ఫలితంగా ఈ ఏడాది వీరి ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉంది. ధన సంపాదనతో పాటు, ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడం, గృహ, వాహనాలను ఏర్పరచుకోవడం వంటి వాటి మీద కూడా దృష్టిసారిస్తారు. వీరు ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ సరికొత్త మార్పులు చేపట్టి ఆదాయాన్ని బాగా పెంచుకునే అవకాశం ఉంది.

4 / 6
మకరం: లక్ష్యసాధనకు, పట్టుదలకు, దీక్షా దక్షతలకు మారుపేరైన ఈ రాశివారు తప్పకుండా ఆదాయాన్ని పెంచుకుని సంపన్నుల జాబితాలో చేరడం జరుగుతుంది. ఈ ఏడాది వీరికి ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగా ఉంటుంది. ప్రతి రూపాయిని మదుపు చేయడం జరుగుతుంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఒక పద్ధతి ప్రకారం అదనపు ఆదాయాన్ని పెంచుకోవ డంతో పాటు ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా అంచనాల్ని మించి లాభం పొందుతారు.

5 / 6
కుంభం: రాశ్యధిపతి శని ధన స్థానంలో ఉండడంతో పాటు సప్తమ స్థానంలో గురు, కుజుల సంచారం వల్ల ఈ రాశివారిలో ధన కాంక్ష బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే ఈ రాశివారు తమకు రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు. అదనపు ఆదాయాన్ని మదుపులు, పెట్టుబడుల్లో పెట్టి లబ్ధి పొందడం జరుగుతుంది. సంపన్నులు కావాలన్న తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు.

6 / 6
Follow Us