Lucky Stars: ఈ జన్మ నక్షత్రాలకు అదృష్టమే అదృష్టం..! లిస్ట్‌లో మీ స్టార్ ఉందా?
Birth Star Astrology: ఈ ఏడాది చివరి నాటికి తొమ్మిది నక్షత్రాల వారికి గ్రహాల అనుకూల సంచారంతో అదృష్టం కలిసిరానుంది. రాజయోగాలు, ధనయోగాలతో పాటు ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. ఇంతకీ ఆ అదృష్ట నక్షత్రాలు ఏవి? వీరికి కలగబోయే శుభ ఫలితాలేంటి?

Lucky Stars
జ్యోతిషశాస్త్రంలో నక్షత్రాలన్నిటికీ ప్రాధాన్యం ఉన్నప్పటికీ, గ్రహ సంచారం మీద వీటి ప్రాధాన్యం, అదృష్టం వంటివి ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఆఖరు లోగా తొమ్మిది నక్షత్రాలవారు మాత్రం మహా అదృష్టవంతులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రవి, కుజ, రాహువులకు చెందిన కృత్తిక, మృగశిర, ఆర్ద్ర, ఉత్తర, చిత్త, స్వాతి, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, శతభిషం నక్షత్రాలు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. వీరికి రాజ యోగాలు, ధన యోగాలతో పాటు, మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరడం, ఆరోగ్య భాగ్యం కలగడం, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడం జరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల ఫలిస్తుంది.
- కృత్తిక: గ్రహ రాజు రవికి చెందిన కృత్తికా నక్షత్రం ఎక్కువగా రాజయోగాలు, ధన యోగాలు కలిగే అవ కాశం కనిపిస్తోంది. ఇక నుంచి ఈ నక్షత్రం వారికి అదృష్టం కలిసి వస్తూనే ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదల వంటివి చోటు చేసుకుం టాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.
- మృగశిర: కుజుడికి సంబంధించిన ఈ నక్షత్రం తప్పకుండా ఒక వెలుగు వెలుగుతుంది. ఉన్నతోద్యోగాలు, విదేశీ ఉద్యోగాలతో ఈ నక్షత్రంవారి దశ తిరుగుతుంది. జీవనశైలి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనేక వైపుల నుంచి సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగాపెరుగుతాయి.
- ఆర్ద్ర: రాహువుకు చెందిన ఈ నక్షత్రం ఈ ఏడాది రాజయోగాలు, ధన యోగాలనిస్తుంది. ఈ నక్షత్రానికి చెందినవారు తప్పకుండా సంపన్నులవుతారు. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. జరగవలసిన శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది.
- ఉత్తర: ఈ నక్షత్రానికి రవి అధిపతి కావడం, ఈ రవి వృశ్చిక, ధనూ రాశుల్లో బాగా అనుకూలంగా ఉండ డం వల్ల ఈ నక్షత్రం వారికి అనేక పర్యాయాలు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనారోగ్యానికి తగ్గ వైద్య చికిత్స లభిస్తుంది. మదుపులు, పెట్టుబడులు రెట్టింపు లాభాలనిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగు తాయి. లాటరీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఉన్నత స్థితికి చేరుకుంటుంది.
- చిత్త: కుజుడికి చెందిన ఈ నక్షత్రం ఈ ఏడాది బాగా ఎక్కువగా ప్రకాశించబోతోంది. ఈ నక్షత్రానికి చెందిన వారు ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కుతారు. ఒక సంస్థకు ఉన్నతాధికారి లేదా సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరగ డంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల కూడా లాభాలు వృద్ధి చెందుతాయి.
- స్వాతి: రాహువుకు చెందిన ఈ నక్షత్రం వారికి రాజయోగాలు కలగబోతున్నాయి. రాహువు డిసెంబర్ 5న మకర రాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి వీరి జీవితం మారిపోయే అవకాశం ఉంది. రాజకీ యాలు, ప్రభుత్వ రంగంలోనివారికి అధికార యోగం పడుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభి స్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో తప్ప కుండా పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని దాటిపోతాయి.
- ఉత్తరాషాఢ: ఈ నక్షత్రానికి అధిపతి అయిన రవి తనకు మిత్ర క్షేత్రాలైన వృశ్చిక, ధనూ రాశుల్లో సంచారం చేయడం వల్ల ఈ నక్షత్రం వారికి అన్ని రంగాల్లోనూ ఊహించని పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. సంపన్నుడితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
- ధనిష్ఠ: ఈ నక్షత్రాధిపతి కుజుడు మరో రెండు నెలలపాటు సింహ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ నక్షత్రంవారికి తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. శ్రమ తక్కువ, లాభం ఎక్కువగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు బాగా సక్సెస్ అవు తాయి.
- శతభిషం: ఈ నక్షత్రానికి అధిపతి అయిన రాహువు డిసెంబర్ 5న మకర రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ నక్షత్రంవారికి మహర్దశ ప్రారంభం అవుతుంది. ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. ఆదా యం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. సంతాన ప్రాప్తి సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థికంగా బాగా పురోగతి చెందే అవకాశం కూడా ఉంది.
Follow Us