AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 3 పెళ్లిళ్లు ఫెయిల్ అయ్యాయి.. 17 ఏళ్ల జీవితాన్ని కోల్పోయా.. హీరోయిన్ ఆవేదన..

సాధారణంగా సినీరంగంలో హీరోయిన్స్ పర్సనల్ విషయాల గురించి నిత్యం ఏదోక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ఈమధ్య కాలంలో తారల పెళ్లిళ్లు, లవ్, బ్రేకప్ విషయాలతోపాటు విడాకుల గురించి సైతం ఏదోక రూమర్ చక్కర్లు కొడుతునే ఉంటుంది. తాజాగా ఓ హీరోయిన్ తన జీవితంలో జరిగిన మూడు పెళ్లిళ్ల గురించి చెప్పుకొచ్చింది.

Tollywood : 3 పెళ్లిళ్లు ఫెయిల్ అయ్యాయి.. 17 ఏళ్ల జీవితాన్ని కోల్పోయా.. హీరోయిన్ ఆవేదన..
Meera Vasudevan
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2026 | 3:24 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది హీరోయిన్ మీరా వాసుదేవన్. 2003లో వచ్చిన రూల్స్ ప్యార్ కా సూపర్ హిట్ ఫార్ములా సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమెకు ఎక్కువగా మలయాళీ భాషలలోనే ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఆమె వయసు 44 సంవత్సరాలు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి చెబుతూ మూడు వివాహాలు విడాకులు కావడానికి గల కారణాలను వెల్లడించింది. తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సముద్రకని దర్శకత్వం వహించిన ‘ఉన్నైచ్ శరణదాయినేన్’ చిత్రం ద్వారా తమిళంలో పాపులర్ అయ్యింది మీరా వాసుదేవన్. ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటిస్తూ బుల్లితెరపై కూడా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మూడు పెళ్లిళ్లు విఫలం కావడం పై స్పందించింది. ఆ పెళ్లిళ్లు తన జీవితంలో తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలని, వాటివల్ల తన జీవితంలోని 17 స్వర్ణ సంవత్సరాలను కోల్పోయానని మీరా బాధతో అన్నారు. వివాహంలో శారీరక, మానసిక వేధింపులు, ద్రోహం, మోసం వంటివి ఎప్పటికీ ఆమోదయోగ్యం కావని ఆమె పేర్కొన్నారు. తన మూడవ వివాహం గురించి మాట్లాడుతూ, ఆ పెళ్లి గొప్ప ప్రేమ వల్ల జరగలేదని మీరా అన్నారు. ఆ వ్యక్తి తన కొడుకు పట్ల చూపిన ప్రేమ, శ్రద్ధే తనను ఆ పెళ్లి వైపు నడిపించాయని ఆమె చెప్పింది. తన కొడుకుకు మంచి తండ్రి దొరకాలని తాను ఆశించానని, కానీ తన అంచనాలు తప్పయ్యాయని ఆమె తెలిపింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

మూడు విఫలమైన వివాహాలు చేసుకున్న మహిళగా సమాజం తనపై ముద్ర వేస్తుందని తాను ఆందోళన చెందడం లేదని కూడా ఆమె అన్నారు. వైవాహిక జీవితంలోని తన అనుభవాలు తనను బలమైన మహిళగా తీర్చిదిద్దాయని చెప్పిన మీరా, తాను ఇప్పుడు ఒంటరిగా, ఆర్థికంగా స్వతంత్రంగా జీవిస్తున్నానని తెలిపారు. ఎవరిపైనా ఆధారపడని తన కొడుకుకు తాను ఒక బలమైన తల్లిగా, ఆదర్శంగా నిలవాలనుకుంటున్నానని కూడా ఆమె అన్నారు. 44 ఏళ్ల మీరా వాసుదేవన్ ఒంటరిగా జీవిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

మీరా వాసుదేవన్..

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

Follow Us
3 సార్లు చెత్త పెళ్లిళ్లు చేసుకున్నా.. 44 ఏళ్ల వయసులో ఒంటరిగా..
3 సార్లు చెత్త పెళ్లిళ్లు చేసుకున్నా.. 44 ఏళ్ల వయసులో ఒంటరిగా..
పెట్రోల్, డీజిల్‌పై కొత్త ట్యాక్సులు.. కేంద్రం బిగ్ అప్డేట్..
పెట్రోల్, డీజిల్‌పై కొత్త ట్యాక్సులు.. కేంద్రం బిగ్ అప్డేట్..
ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై.. ఇకపై కొత్త అవతారంలో తల..
ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై.. ఇకపై కొత్త అవతారంలో తల..
మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా.. మీ మనసు చెప్పే రహస్యం..
మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా.. మీ మనసు చెప్పే రహస్యం..
ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి.. ప్రతీ రోజూ బోలెడెంత డబ్బులు
ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి.. ప్రతీ రోజూ బోలెడెంత డబ్బులు
డ్యూటీలో ఉన్నట్టు రికార్డులు.. కట్‌చేస్తే ఫామ్‌హౌస్‌లో జల్సాలు..
డ్యూటీలో ఉన్నట్టు రికార్డులు.. కట్‌చేస్తే ఫామ్‌హౌస్‌లో జల్సాలు..
తెలంగాణపై అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. వర్షాలే వర్షాలు
తెలంగాణపై అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. వర్షాలే వర్షాలు
అప్పుడు లావుగా ఉన్నా అన్నారు.. ఇప్పుడు చిక్కిపోయా అంటున్నారు
అప్పుడు లావుగా ఉన్నా అన్నారు.. ఇప్పుడు చిక్కిపోయా అంటున్నారు
మాసూద సినిమాలో ముసుగు దెయ్యం బయట ఎలా ఉందో చూశారా.?
మాసూద సినిమాలో ముసుగు దెయ్యం బయట ఎలా ఉందో చూశారా.?
ఆవ నూనె vs కొబ్బరి నూనె.. చలికాలంలో జుట్టుకు ఏది ఎక్కువ మేలు
ఆవ నూనె vs కొబ్బరి నూనె.. చలికాలంలో జుట్టుకు ఏది ఎక్కువ మేలు