AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బా ఏం సినిమా రా బాబు.. బుర్రపాడు.! పెట్టింది రూ.65 కోట్లు.. హీరో రెమ్యునరేషన్ అంత కూడా రాబట్టలేదు

టాలీవుడ్ లో వరుస హిట్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో ఇరుముడి సినిమా దూసుకుపోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా థియేటర్స్ లో విడుదలైన సినిమాలు హిట్ టాక్ తో పాటు భారీ కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి.

అబ్బా ఏం సినిమా రా బాబు.. బుర్రపాడు.! పెట్టింది రూ.65 కోట్లు.. హీరో రెమ్యునరేషన్ అంత కూడా రాబట్టలేదు
Movie
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2026 | 12:55 PM

Share

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలు రిలీక్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వందల కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కానీ, భారీ తారాగణం, ఆకాశాన్నంటే ప్రమోషన్స్ ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొడుతుంటాయి. అలాంటి కోవకు చెందిన సినిమానే ఈ సినిమా కూడా.. అక్కినేని యువ హీరో అఖిల్ కెరీర్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాల్లో ‘ఏజెంట్’ ఒకటి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో పాటు పొడవాటి జుట్టుతో సరికొత్త అవతారంలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో అఖిల్ కెరీర్‌లో ‘ఏజెంట్’ ఓ మర్చిపోలేని చేదు అనుభవంగా మిగిలిపోయింది.

సాధారణంగా సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కానీ ‘ఏజెంట్’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. పలు కారణాలతో ఈ సినిమా డిజిటల్ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 2025 మార్చి 14న సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సుమారు రూ.65 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఏజెంట్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లను సాధించలేకపోయింది. మొత్తంగా రూ. 13 కోట్ల వరకే రాబట్టింది ఈ మూవీ. భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టైలిష్ మేకింగ్ ఉన్నప్పటికీ బలమైన కథనం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది.

ఫలితంగా నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సినిమా పరాజయం కారణంగా నిర్మాతలపై పడిన ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని అఖిల్ తన రెమ్యునరేషన్‌ను కూడా వదులుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై అధికారిక వివరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్ పరాజయం తర్వాత అఖిల్ తన తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేశాడు. సరైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నం చేశాడు. ఫైనల్ గా అఖిల్ లెనిన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. లెనిన్ సినిమాతో ఎట్టకేలకు అఖిల్ హిట్ అందుకున్నాడు. దాంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us