AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రాల్లో గులాబీ ఒకటి. 1996 నవంబర్ 3న విడుదలైన ఈ మూవీ సంచలనం సృష్టించింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (వర్మ క్రియేషన్స్) , అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. తన తొలి చిత్రం గులాబీ గురించి మాట్లాడారు. ఇందులో జేడీ చక్రవర్తి, మహేశ్వరి హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..
Gulabi Movie
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2026 | 7:25 AM

Share

తెలుగు చిత్ర దర్శకుడు కృష్ణవంశీ, తన సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు అందుకున్నారు. “నిన్నే పెళ్లాడతా”, “సింధూరం”, “అంతఃపురం” వంటి చిత్రాలతో జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన కెరీర్ ప్రారంభంలో, తన తొలి చిత్రం గులాబీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణవంశీ సాధారణంగా తన సినిమాల ఫస్ట్ కాపీని చూసినప్పుడు అసంతృప్తికి లోనవుతానని, అది హార్ట్ బ్రేకర్‌గా ఉంటుందని వివరించారు. ఈ అనుభవం చంద్రలేఖ వంటి చిత్రాలతో పాటు అన్ని సినిమాల విషయంలోనూ ఎదురైందని తెలిపారు. అయితే, కాలక్రమేణా దాన్ని నియంత్రించుకోవడం అలవాటైందని చెప్పారు. తాను ఏ సినిమా విజయాన్నైనా ముందే అంచనా వేయలేనని, అలాంటి బ్రహ్మం గారిని కాదని సరదాగా అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

గులాబీ చిత్రం గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటి టబును అనుకున్నారని, ఆమెకు కథ కూడా బాగా నచ్చిందని కృష్ణవంశీ వెల్లడించారు. అయితే, అప్పట్లో “రుక్కు రుక్కు రుక్” అనే పాటతో టబుకు అనూహ్యమైన స్టార్‌డమ్ లభించింది. దీంతో ఆమె డేట్స్ పూర్తిగా నిండిపోయాయి. గులాబీ కోసం ఆరు నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. అంత సమయం లేకపోవడంతో, చిత్ర బృందం టబు స్థానంలో వేరొక హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి వచ్చిందని కృష్ణవంశీ పేర్కొన్నారు. ఇది గులాబీ టీమ్ అనుభవించిన ఒక కీలకమైన సవాలు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

అంతేకాకుండా, గులాబీ చిత్రం నిర్మాణానికి ముందు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను కూడా కృష్ణవంశీ పంచుకున్నారు. ఆయన నిర్మాత సురేష్ బాబును సంప్రదించారు. సురేష్ బాబు కథ విని నచ్చితే, వెంకటేష్‌తో సినిమా చేయవచ్చని ప్రతిపాదించారు. అయితే, కృష్ణవంశీ తన తొలి సినిమాను చక్రవర్తితోనే తీయాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. సురేష్ బాబు వెంకటేష్‌తో తీయమని కోరినప్పటికీ, తాను చక్రవర్తితోనే తీస్తానని కృష్ణవంశీ స్పష్టం చేశారు. దీంతో వారిద్దరి మధ్య సినిమా కుదరలేదని, ఆ ప్రాజెక్ట్ అప్పుడు ముందుకెళ్లలేదని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

టబు..

View this post on Instagram

A post shared by Tabu (@tabutiful)

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us