AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్న స్టార్ హీరో శ్రీకాంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవాలు, తనకు రానటువంటి కొన్ని అవకాశాల గురించి చెప్పుకొచ్చారు.

Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
Srikanth
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2026 | 12:35 PM

Share

టాలీవుడ్ పరిశ్రమలో హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు శ్రీకాంత్. అప్పట్లో ఆయనకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతోమంది అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను చేయలేకపోయిన సినిమాల గురించి, స్టార్ హీరోలతో తనకున్న అనుబంధం గురించి మనసు విప్పి మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. తారక్ తనకు చాలా కాలం నుంచి తెలుసని శ్రీకాంత్ తెలిపారు. తాము సినిమాలు చేయకముందు శ్రీనగర్ కాలనీలో పక్కపక్కనే ఉండేవారమని, అప్పటి నుంచి ఆయన ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉన్నాయని అన్నారు. ఇమేజ్‌లు ఎంత మారినా మనుషులుగా వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

అయితే టాలీవుడ్‌లో ఎంతోమంది యంగ్ జనరేషన్, సీనియర్ హీరోలతో కలిసి నటించినప్పటికీ, టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు , రెబల్ స్టార్ ప్రభాస్‌లతో కలిసి నటించే అవకాశం మాత్రం తనకు ఇంతవరకు రాలేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఆ ఇద్దరు హీరోలతో నటించాలని ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ సందర్భం కుదరలేదని, భవిష్యత్తులో మంచి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. తన కుటుంబంలో ఎవరికి కూడా సినిమా నేపథ్యం లేదని, తాను కర్ణాటకలో పుట్టి పెరిగానని తెలిపారు. తన కుటుంబం పూర్తిగా వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిందని, ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా తన స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఒక బోనస్‌లా భావిస్తూ, ప్రేక్షకులు మెచ్చే వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నానని శ్రీకాంత్ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us
ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు
ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు
రెండు వన్డేల్లో గెలిచినా.. ఈ ముగ్గురితో గంభీర్‌కు టెన్షనే..!
రెండు వన్డేల్లో గెలిచినా.. ఈ ముగ్గురితో గంభీర్‌కు టెన్షనే..!
నీటి చుక్క పడగానే వెలిగే దీపం..కరెంట్ లేకుండానే ఎలా పని చేస్తుంది
నీటి చుక్క పడగానే వెలిగే దీపం..కరెంట్ లేకుండానే ఎలా పని చేస్తుంది
దీపావళి అమావస్య.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షమే
దీపావళి అమావస్య.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షమే
ఒకప్పుడు టీమిండియా సూపర్‌స్టార్లు.. గంభీర్ ఎంట్రీతో టీం నుంచి ఔట్
ఒకప్పుడు టీమిండియా సూపర్‌స్టార్లు.. గంభీర్ ఎంట్రీతో టీం నుంచి ఔట్
కొత్త పెళ్లి కూతురిలా తీన్మార్ డ్యాన్స్‌ ఇరగదీసింది..
కొత్త పెళ్లి కూతురిలా తీన్మార్ డ్యాన్స్‌ ఇరగదీసింది..
కస్టమర్లలా వచ్చి కళ్లముందే మాయం చేశారు.. జ్యువెలరీ షాపులో..
కస్టమర్లలా వచ్చి కళ్లముందే మాయం చేశారు.. జ్యువెలరీ షాపులో..
లక్ష్మీదేవికి ఏ పూలు సమర్పిస్తే అదృష్టమో తెలుసా?
లక్ష్మీదేవికి ఏ పూలు సమర్పిస్తే అదృష్టమో తెలుసా?
నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లిపీటలెక్కిన క్రేజీ హీరోయిన్
నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లిపీటలెక్కిన క్రేజీ హీరోయిన్
అవినీతి ఆరోపణలు.. పరాగ్వే అధ్యక్షుడిపై అభిశంసన వేటు
అవినీతి ఆరోపణలు.. పరాగ్వే అధ్యక్షుడిపై అభిశంసన వేటు