Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఒకప్పుడు తెలుగు తెరపై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటి జయచిత్ర. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో ఆమె నటన గురించి చెప్పక్కర్లేదు. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె భగవంత్ కేసరి సినిమాతో తెలుగు తెరకు తిరిగి వచ్చింది. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి చిత్రంతో సీనియర్ నటి జయచిత్ర తెలుగు చిత్ర పరిశ్రమలోకి తిరిగి అడుగు పెట్టారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆమె ఈ సినిమా షూటింగ్ అనుభవాలు, బాలకృష్ణతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో పొన్నియన్ సెల్వన్ వంటి తమిళ చిత్రాలలో నటించిన జయచిత్ర, తెలుగులో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానులకు భగవంత్ కేసరితో దర్శనం ఇచ్చారు. ఈ సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్‌కి తల్లి పాత్రలో ఆమె నటించారు. “పెద్ద గ్యాప్ తర్వాత ఈ ప్రాజెక్ట్ నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణతో గతంలో మువ్వ గోపాలుడు, సమరసింహారెడ్డి వంటి చిత్రాలలో నటించిన జయచిత్ర, బాలయ్య ఎనర్జీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “అప్పుడు ఎలా చూశానో అంతకంటే రెట్టింపు ఎనర్జీతో బాలకృష్ణ గారు ఇప్పుడు ఉన్నారు. ఆయన పెర్ఫార్మెన్స్, ఆ డైలాగ్ ధ్వని సెట్లో గర్జన లాగా వినిపిస్తుంది. ఆయన సెట్లో ఉంటే వాతావరణం చాలా ఉత్సాహంగా, నవ్వుతూ ఉంటుంది. ఇతరులను సంతోషపెట్టే మాటలు మాట్లాడతారు” అని జయచిత్ర వివరించారు. బాలకృష్ణ తన పట్ల చూపిన ఆప్యాయతను, గౌరవాన్ని ఆమె మరువలేకపోయారు. ఇటీవల జరిగిన సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బాలకృష్ణ తన చేయి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకోవడం, సెట్‌లో కూడా ఒక అమ్మలాగే చూసుకోవడం వంటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. “చాలా ఏళ్ల తర్వాత నేను ఈ ఎఫెక్షన్‌ని ఇప్పుడు చూస్తున్నాను” అని ఆమె చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
బాలకృష్ణ చెప్పిన “కర్మ” డైలాగులు తనకు బాగా నచ్చాయని, సినిమా చూసిన ప్రేక్షకులు తన పాత్ర ఇంకా కొంచెం ఉంటే బాగుండేదని కోరుకోవడం క్యారెక్టర్ విజయాన్ని సూచిస్తుందని జయచిత్ర అన్నారు. హైదరాబాద్‌ను తన ఇల్లుగా అభివర్ణించిన జయచిత్ర, “హైదరాబాద్ ఇస్ మై హోమ్. అది మిస్ చేశాను ఇన్ని రోజులు. మళ్ళీ నన్ను నా హోమ్ పిలిపించింది. ఇక్కడ మా బంధువులతో ఉండాలి, సినిమాలు చేయాలి అనేది దేవుడి కృప. ఒక సూపర్ హిట్ ఫిలింలో నటించడం చాలా పరమానందం” అని అన్నారు. భగవంత్ కేసరి కేవలం కమర్షియల్ హిట్ కాదని, రొమాన్స్, సీరియస్‌నెస్, మోరల్స్, యాక్షన్, హ్యూమర్‌తో కూడిన ఒక చక్కటి మిశ్రమం అని ఆమె అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
బాలకృష్ణకు జ్యోతిష్యంపై ఉన్న నమ్మకం, శుభ ముహూర్తాలపై ఆయన శ్రద్ధ గురించి కూడా జయచిత్ర పంచుకున్నారు. బాలకృష్ణ ఉన్నతమైన వ్యక్తిత్వం, నటుడిగా ఆయనకున్న ప్రత్యేక లక్షణాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
బాలకృష్ణ, జయచిత్ర..

Balakrishna, Jayachitra
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
