AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonali Bendre: క్యాన్సర్‌తో ఆస్పత్రిలో.. ఆ స్టార్ హీరో చేసిన సాయం జీవితంలో మర్చిపోలేను: సోనాలి బింద్రే

టాలీవుడ్ అందాల తార సోనాలి బింద్రే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ మెరిసిన ఈ ముద్దుగుమ్మ 2018లో ప్రమాదకరమైన క్యాన్సర్ మహమ్మారి బారిన పడింది. చాలా ఏళ్ల పాటు ట్రీట్ మెంట్ తీసుకుని ఈ మహమ్మారిని పూర్తిగా జయించింది.

Sonali Bendre: క్యాన్సర్‌తో ఆస్పత్రిలో.. ఆ స్టార్ హీరో చేసిన సాయం జీవితంలో మర్చిపోలేను: సోనాలి బింద్రే
Sonali Bendre
Basha Shek
|

Updated on: Nov 22, 2026 | 6:33 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది సోనాలి బింద్రే. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె తన అందం, అభినయంతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, కన్నడ, మరాఠి సినిమాల్లోనూ మెరిసిందీ అందాల తార. మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. ఇక హిందీలో అయితే సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే క్యాన్సర్ మహమ్మారి బారిన పడింది సోనాలి. 2018లో మెటస్టాటిక్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఉన్నట్లుగా నిర్ధారణ అయిందని తెలిపింది. దీంతో వెంటనే న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుందీ అందాల తార. ఇ్ కీమోథెరపీ సమయంలో తీసిన ఫోటోలను, గుండు చేయించుకున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది సోనాలి. తద్వారా తనలాంటి ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు ధైర్యాన్నిచ్చింది.

కాగా క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న సోనాలి ఇప్పుడు మళ్లీ నటిగా బిజీ అయిపోయింది. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజి బిజీగా ఉంటోంది. కాగా సందర్భమొచ్చినప్పుడల్లా తన క్యాన్సర్ చికిత్స అనుభవాలను అందరితో పంచుకుంటోంది సోనాలి. ఇదే క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటోన్న సమయంలో తనకు ఓ స్టార్ ‍హీరో పూర్తి మద్దతుగా నిలిచారని తెలిపింది.

ఇవి కూడా చదవండి

‘ క్యాన్సర్‌ చికిత్స కోసం నేను అమెరికాలోని న్యూయార్క్ వెళ్లిపోయాను. ఆ సమయంలో నా ట్రీట్ మెంట్ గురించి సల్మాన్ ఖాన్ పదే పదే ఆరా తీశాడు. అంతే కాదు నేను చికిత్స పొందుతున్నప్పుడు పలు సార్లు న్యూయార్క్ వచ్చాడు. నాకు అత్యంత అవసరమైన సమయంలో హీరో సల్మాన్ ఖాన్‌ అండగా నిలిచాడు. అలాగే పలు సార్లు నా భర్తకు ఫోన్ చేసి అక్కడ సరైన వైద్యులు ఉన్నారో లేదో తెలుసుకున్నాడు. వారితో కూడా మాట్లాడాలని సల్మాన్‌ అడిగాడు’ అని సల్మాన్ పై ప్రశంసలు కురిపించింది సోనాలి.

సోనాలి బింద్రే లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్యాన్సర్‌తో ఆస్పత్రిలో.. ఆ స్టార్ హీరో చేసిన సాయం మర్చిపోలేను
క్యాన్సర్‌తో ఆస్పత్రిలో.. ఆ స్టార్ హీరో చేసిన సాయం మర్చిపోలేను
ఇతరుల తప్పులకు అమాయకులను శిక్షించకూడదు.. జీవితసత్యం చెప్పే నీతికథ
ఇతరుల తప్పులకు అమాయకులను శిక్షించకూడదు.. జీవితసత్యం చెప్పే నీతికథ
ట్రంప్‌ ద్రోహి అంటున్న అభిమాని రోడ్స్
ట్రంప్‌ ద్రోహి అంటున్న అభిమాని రోడ్స్
ఓటీటీలోకి సూర్య బ్లాక్ బస్టర్ మూవీ.. 'సీన్'స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి సూర్య బ్లాక్ బస్టర్ మూవీ.. 'సీన్'స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Video: భారత్-పాక్ మ్యాచ్‌లో హీట్ పెంచిన గంభీర్ శిష్యుడు..!
Video: భారత్-పాక్ మ్యాచ్‌లో హీట్ పెంచిన గంభీర్ శిష్యుడు..!
సమంతకు మగ బిడ్డ.. రాజ్ నిడిమోరు సోదరి ఏం చేసిందో తెలుసా?
సమంతకు మగ బిడ్డ.. రాజ్ నిడిమోరు సోదరి ఏం చేసిందో తెలుసా?
బిగ్ షాక్.. 3 నెలల్లోనే 26 కిలోల బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా?
బిగ్ షాక్.. 3 నెలల్లోనే 26 కిలోల బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా?
IND vs PAK: టాస్‌లో వివాదం.. మరోసారి అదే సీన్..!
IND vs PAK: టాస్‌లో వివాదం.. మరోసారి అదే సీన్..!
ఇండియాస్ "బ్లాక్ మ్యాజిక్" క్యాపిటల్ ఏది ? ఆ స్టోరీ ఏంటి ??
ఇండియాస్
వైకుంఠ చతుర్దశి: శివుడిని, విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే సకల శుభాలు
వైకుంఠ చతుర్దశి: శివుడిని, విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే సకల శుభాలు