AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: రిలీజ్‌కు ముందే అంతర్జాతీయ అవార్డు.. ఇవాళ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్

టేకింగ్ పరంగా చెప్పాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా హాలీవుడ్ లెవెల్ లో ఉంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 10 హౌస్ లో ఉన్న అమన్ మసూద్ ఇందులో కీలక పాత్ర పోషించడం విశేషం. ఐఎమ్ డీబీలో ఏకంగా 10 కి 10 రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: రిలీజ్‌కు ముందే అంతర్జాతీయ అవార్డు.. ఇవాళ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 20, 2026 | 6:57 PM

Share

ఈ వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చేశాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి చేస్తున్నాయి. ది ఒడిస్సీ, ప్రేమనే ఊరిలో, కికూ చిరంజీవి, కల్ట్, అనుపమ క్రేజీ కల్యాణం, అన్బిల్ అవన్, హైకూ, అనుమాన పక్షి, చిరం, 418 వంటి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. అయితే వీటితో పాటు ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. కథ కథనాల పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే రిలీజ్ కు ముందే ఈ సినిమాకు ఉత్తమ మిస్టరీ చిత్రం అవార్డులు కూడా వచ్చాయి. న్యూయార్క్, కేన్స్ అంతర్జాతీయ చలనచిత్ర వేదికలపై ఈ సినిమాకు పురస్కారాలు దక్కాయి. ఇక ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. అలాగే ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 10కి 10 రేటింగ్ ఉండడం విశేషం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సందడి చేస్తోన్న అమన్ మసూద్ ఇందులో ఒక కీలక పాత్ర పోషించడం విశేషం. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలున్న ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో హీరోయిన్ ఒక బ్యాంకు ఉద్యోగి. అయితే ప్రతి రోజూ ఒక అపరిచితుడు ఆమె ఇంట్లోకి వచ్చి ఆమె పక్కనే పడుకుని, ఎలాంటి హాని తలపెట్టకుండా ఉదయాన్నే వెళ్లిపోతుంటాడు. మరోవైపు నగరంలో ఒక సైకో కిల్లర్ సంచరిస్తూ మహిళలను వరుసగా హతమారుస్తుంటాడు. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? హీరోయిన్ కు అతనికి సంబంధమేంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మయూఖ’ (Mayookha). శ్రీకాంత్ కాండ్రెగుల అలియాస్ శ్రీ తేజ్ ఎస్‌కే తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ చెంగప్ప మయూఖ పాత్రలో అదరగొట్టింది. అలాగే దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిష్మా డబ్బారా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, నవంబర్ 23న జియో హాట్‌స్టార్ లోనూ స్ట్రీమింగ్ కు రానుంది. అప్పుడు తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ వంటి 4 భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మయూఖ సినిమా ట్రైలర్..

h3>

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బిగ్ బాస్ అమన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్.. సైలెంట్ గా ఓటీటీలోకి..
బిగ్ బాస్ అమన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్.. సైలెంట్ గా ఓటీటీలోకి..
రూ.99కే కేజీ చికెన్ అంటూ ఆఫర్.. ఎగబడ్డ జనం.. కట్‌చేస్తే..
రూ.99కే కేజీ చికెన్ అంటూ ఆఫర్.. ఎగబడ్డ జనం.. కట్‌చేస్తే..
సెంచరీలతో కదం తొక్కిన కుమార్ కుశాగ్ర, తిలక్ వర్మ..
సెంచరీలతో కదం తొక్కిన కుమార్ కుశాగ్ర, తిలక్ వర్మ..
ఖరీదైన బాదం vs పేదోడి పల్లీలు.. చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే..
ఖరీదైన బాదం vs పేదోడి పల్లీలు.. చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే..
ఈ 4 చిట్కాలతో మిరప మొక్కలకు విపరీతమైన కాపు తథ్యం!
ఈ 4 చిట్కాలతో మిరప మొక్కలకు విపరీతమైన కాపు తథ్యం!
GTA 6 కోసం భార్య, కూతురికి లంచం.. డిస్టర్బ్ చేయొద్దంటూ డీల్
GTA 6 కోసం భార్య, కూతురికి లంచం.. డిస్టర్బ్ చేయొద్దంటూ డీల్
చలికాలం రాగానే.. ఏసీని బంద్ చేసే ముందు తప్పనిసరి జాగ్రత్తలు ఇవి!
చలికాలం రాగానే.. ఏసీని బంద్ చేసే ముందు తప్పనిసరి జాగ్రత్తలు ఇవి!
ఈ "ఎలక్ట్రిక్ సైకిల్" ఒక్కసారి ఛార్జ్ చేస్తే 209 కిలోమీటర్లు..
ఈ
నోటికి కారంగా అదిరిపోయే రుచితో గుత్తి వంకాయ ఉల్లికారం
నోటికి కారంగా అదిరిపోయే రుచితో గుత్తి వంకాయ ఉల్లికారం
మీ ఫోన్‌కు ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే
మీ ఫోన్‌కు ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే