OTT Movie: థియేటర్లలో పట్టించుకోలే.. ఇప్పుడు OTTలో తెగ చూస్తున్నారు.. టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
థియేటర్లలో ఆడని కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంటాయి. రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్ తో సత్తా చాటుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే తెలుగు సినిమా కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి జాబితాలోకే వస్తోంది. బిగ్ స్క్రీన్ పై నిరాశపర్చిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో దుమ్ము రేపుతోంది.

ఈ మధ్యన చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. ముఖ్యంగా స్టార్ యాక్టర్స్ లేని సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా కష్టమైపోయింది. ఎలాగోలా కొన్ని థియేటర్లు దొరికినా తక్కువ రోజుల్లోనే సినిమాను తీసేస్తున్నారు. అలాంటి సినిమాలకు ఓటీటీ వేదికలు ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇందులో స్టార్ యాక్టర్స్ లేరు. పైగా భారీ బడ్జెట్ సినిమా కూడా కాదాయే. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా జస్ట్ ఓ మోస్తరుగా ఆడింది. ముఖ్యంగా స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. దీంతో రిలీజైన తక్కువ రోజులకే థియేటర్లలో నుంచి వెళ్లిపోయిందీ సినిమా. అయితే ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ డిజిటల్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్ తో సత్తా చాటుతోంది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా కొత్తగ ఉంటుంది. అనకాపల్లి లో బుల్లెట్ అనే రౌడీ పేరంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. అదే ప్రాంతంలో డ్రగ్స్ బిజినెస్ చేసే నాయుడుతో బుల్లెట్‌కు తరచూ గొడవలు జరుగుతుంటాయి. మరోవైపు ఏఈ ఉద్యోగం చేస్తూ ఉరిలో నిజాయితీగా బతుకుతుంటాడు సాంబశివరావు. అయితే బుల్లెట్ ను చూసి రౌడీ గ్యాంగ్ లో చేరుతాడు సాంబశివరావు కుమారుడు సూర్య. ఇద్దరూ కలిసి ఊరిలో మరిన్ని దారుణాలకు పాల్పడుతారు. అయితే ఒక రోజు బుల్లెట్ కు ఎదురు తిరుగుతాడు సూర్య? మరి సూర్య అలా ఎందుకు చేశాడు? అమృత (సంధ్య వశిష్ట)తో అతని ప్రేమాయణం ఎలా సాగింది? బుల్లెట్, సూర్య, అమృత, నాయుడుల జీవితాలు ఏమయ్యాయి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు అనకాపల్లి. ఇదొక తెలుగు విలేజ్ యాక్షన్ డ్రామా. ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్, సంధ్యా వశిష్టలతో పాటు తారక్ పొన్నప్ప, త్రినాథరావు నక్కిన, ఇంద్రజ, నందిని రాయ్, సంగీత క్రిష్, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.నక్కిన నరేటివ్స్, భవ్యశ్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దేవ్జాండ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన అనకాపల్లి సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో ఐదో స్థానంలో నిలవడం విశేషం
అనకా పల్లి సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




