OTT Movie: ఇండియాతో సహా 10 దేశాల్లో నంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండింగ్.. ఓటీటీని ఊపేస్తోన్న రియల్ క్రైమ్ స్టోరీ
కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే రాబట్టింది. అయితే ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా రికార్డు వ్యూస్ అండ్ రేటింగ్స్ తో దుమ్ము రేపుతోంది.

ఇతర జానర్ల సినిమాలతో పోల్చుకుంటే సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు రీచ్ ఎక్కువ. ఒక్కోసారి థియేటర్లలో ఆడకపోయినప్పటికీ ఈ జానర్ సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంటాయి. అలా థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్, రేటింగ్స్ తో సత్తా చాటుతోంది. ఎంతలా అంటే మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా 3.2 మిలియన్ల (32 లక్షలు) వ్యూస్, 7.4 మిలియన్ల వ్యూయింగ్ హవర్స్ రికార్డు సాధించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఇండియాతో పాటు 10 దేశాల్లో నంబర్ వన్ ప్లేస్ లో ఈ సినిమా ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక యువతిపై జరిగిన దారుణ హత్యాచారం కేసులో నిందితులను డీసీపీ రమణ్ కుమార్ ఎన్కౌంటర్ చేస్తారు. దీంతో ప్రజల దృష్టిలో రమణ్ హీరోగా మారిపోతారు. అయితే ఆ ఎన్కౌంటర్ బూటకమనే అనుమానాలు తలెత్తుతాయి. ఈ కేసును విచారించడానికి ప్రత్యేక సిట్అధికారిణి గా డీసీపీ అజూనీ కోహ్లీ నియమితులవుతారు. ఇలా తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధమైన విచారణ అనే రెండు భిన్న సిద్ధాంతాల మధ్య జరిగే సంఘర్షణ ప్రేక్షకులను చివరి వరకు తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తుంది.
ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘దాయరా’ (Daayra). 2019లో హైదరాబాద్ లో జరిగిన దిశా రేప్, నిందితుల ఎన్ కౌంటర్ తదితర సంఘటనల ఆధారంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారుప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్. ఈ మోరల్ క్రైమ్ డ్రామాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు.ప్రగతి మిశ్రా, భవేష్ బబ్బాని, క్షితీ జోగ్, కన్వల్జిత్ సింగ్, అనూజా సాఠే తదితరులు కీలకపాత్రలు పోషించారు. నీత్ జైన్, ధవల్ గడా నిర్మించారు. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమా ఆడియెన్స్ ను కట్టిపేడస్తోంది. ముఖ్యంగా దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లో ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మొత్తం 14 దేశాల్లో టాప్-10లో ట్రెండ్ అవుతుండగా.. భారత్, యూఏఈ, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్, మాల్దీవులు, పాకిస్థాన్ సహా 10 దేశాల్లో నంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. ఓటీటీలో మంచి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి దాయరా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
దాయిరా సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




