అతనితో వర్క్ చేయడం ఒక పీడకల.. మాట్లాడే పద్ధతి కూడా తెలియదు.. స్టార్ హీరోపై హైదరాబాదీ హీరోయిన్ సంచలన ఆరోపణలు
దియా మీర్జా.. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో సెటిలైపోయింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లోనూ నటిస్తోన్న ఈ అందాల తార తాజాగా ఓ స్టార్ నటుడిపై సంచలన ఆరోపణలు చేసింది.

హైదరాబాద్ కు చెందిన బాలీవుడ్ నటి దియా మీర్జా గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. దీపావళికి ముందు, ఆమెకు సంబంధించిన ఒక వీడియోను బీఎంసీ (BMC) పంచుకుంది. ఈ వీడియోలో, దీపావళిని ఎలా జరుపుకోవాలో ఆమె ఒక సందేశం ఇచ్చారు. అయితే దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. చాలా మంది దియాను తప్పుపట్టారు. దీపావళి ఎలా జరుపుకోవాలో తమకు బోధించవద్దని రాజకీయ నాయకులు నటికి హిత బోధ చేశారు. అయితే ఎలాగోలా ఆ విషయం సద్దుమణిగింది. అయితే దియా ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై సంచలన ఆరోపణలు చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో, నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి పనిచేస్తున్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె బహిరంగంగా మాట్లాడింది. ‘ఇది ఒక పీడకలలా ఉంది, అతనికి మాట్లాడే సంస్కారం లేదు. అంతేకాక, అతను చాలా అహంకారి. అతని వ్యక్తిత్వం అస్సలు ఆమోదయోగ్యం కాదు’ అంటూ నవాజుద్దీన్ సిద్దీఖీపై ఆగ్రహం వ్యక్తం చేసింది దియా. ప్రస్తుతం ఈ నటి షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దియా పోస్ట్ ఒక పీఆర్ స్టంట్ అని కొందరు అంటున్నారు. దియా తన పోస్ట్‌లో వాడిన క్యారెక్టర్ అనే పదాన్ని హైలైట్ చేస్తూ, ఇది కచ్చితంగా వారి కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్లు పెడుతున్నారు.
కాగా దియా మీర్జా చేసిన ఈ విమర్శలపై నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా అంతే వేగంగా, ఘాటుగా స్పందించాడు. ఆమె పోస్టుకు రిప్లై ఇస్తూ.. ‘ఒకరి యాటిట్యూడ్‌లో లోపాలు వెతకడం చాలా తేలిక.. దమ్ముంటే నా పనిలో తప్పులు వెతికి చూపించండి’ అంటూ ఛాలెంజ్ విసిరాడు. ఇలా ఇద్దరు దిగ్గజ నటుల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వీరిద్దరూ ఎంతో ప్రొఫెషనల్ నటులని, ఇలా బహిరంగంగా తిట్టుకోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు దియా తన పోస్ట్‌లో వాడిన క్యారెక్టర్ అనే పదాన్ని హైలైట్ చేస్తూ, ఇది కచ్చితంగా వారి కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్లు పెడుతున్నారు. నవాజుద్దీన్, దియా ఇద్దరూ చాలా మర్యాదస్తులని, వారి మధ్య గొడవలు జరిగే అవకాశమే లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అసలు విషయానికి వస్తే.. దియా మీర్జా, నవాజుద్దీన్ సిద్దిఖీ కలిసి ‘డాక్టర్ హసన్’ అనే ఒక కొత్త ఓటీటీ మెడికల్ డ్రామా సిరీస్ కోసమే దియా, నవాజుద్దీన్ లు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో నవాజుద్దీన్ ‘డాక్టర్ ఇమ్రాన్ హసన్’గా, దియా ‘డాక్టర్ పలక్ జైన్’గా కనిపించనున్నారు. డిసెంబర్ 27న జియోహాటర్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సిరీస్ ప్రమోషన్ కోసమే వీరిద్దరూ ఇలా పోస్ట్ లు పెడుతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా, వీరిద్దరి ఈ ‘సోషల్ మీడియా వార్’ మాత్రం రాబోయే సిరీస్ పై అంచనాలను అమాంతం పెంచేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




