AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రేమకు ఫిదా.. ఎక్కడికి వెళ్లినా వెంటపడుతున్న ఉడత పిల్ల.. స్కూల్‌కు కూడా!

సాధారణంగా మనుషులను చూడగానే మాయమైపోయే జీవి అది.. కాస్త అలికిడైనా చాలు చెంగున చెట్టుపైకి దూకేసే ప్రాణి అది.. కానీ ఇక్కడ సీన్ రివర్స్. వారిని చూడగానే దానికి ఎక్కడ లేని ప్రాణం వచ్చేస్తుంది. వాళ్ల ఒడిలో వాలిపోతుంది.. వాళ్లు పెట్టే ఆహార పదార్థాలను ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంది.

M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 22, 2026 | 2:17 PM

Share
సాధారణంగా మనుషులను చూడగానే మాయమైపోయే జీవి అది.. కాస్త అలికిడైనా చాలు చెంగున చెట్టుపైకి దూకేసే ప్రాణి అది.. కానీ ఇక్కడ సీన్ రివర్స్. వారిని  చూడగానే  దానికి ఎక్కడ లేని ప్రాణం వచ్చేస్తుంది. వాళ్ల ఒడిలో వాలిపోతుంది.. వాళ్లు పెట్టే ఆహార పదార్థాలను ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంది.

సాధారణంగా మనుషులను చూడగానే మాయమైపోయే జీవి అది.. కాస్త అలికిడైనా చాలు చెంగున చెట్టుపైకి దూకేసే ప్రాణి అది.. కానీ ఇక్కడ సీన్ రివర్స్. వారిని చూడగానే దానికి ఎక్కడ లేని ప్రాణం వచ్చేస్తుంది. వాళ్ల ఒడిలో వాలిపోతుంది.. వాళ్లు పెట్టే ఆహార పదార్థాలను ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంది.

1 / 5
అంతటితో ఆగకుండా, ఆ చిచ్చరపిడుగులు ఎక్కడికి వెళ్తే.. అక్కడికి ‘నేను కూడా వస్తా’ అంటూ వాళ్లతో వెంటే  ప్రయాణమవుతోంది.
యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన లక్ష్మీప్రసన్న, అంజలి, చైత్ర అనే ముగ్గురు అక్క చెల్లెల్లు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే రెండు నెలల క్రితం స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా, మార్గ మధ్యలో కట్టెల మధ్య చిక్కుకుని విలవిలలాడుతున్న ఉడత పిల్ల కనిపించింది.

అంతటితో ఆగకుండా, ఆ చిచ్చరపిడుగులు ఎక్కడికి వెళ్తే.. అక్కడికి ‘నేను కూడా వస్తా’ అంటూ వాళ్లతో వెంటే ప్రయాణమవుతోంది. యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన లక్ష్మీప్రసన్న, అంజలి, చైత్ర అనే ముగ్గురు అక్క చెల్లెల్లు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే రెండు నెలల క్రితం స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా, మార్గ మధ్యలో కట్టెల మధ్య చిక్కుకుని విలవిలలాడుతున్న ఉడత పిల్ల కనిపించింది.

2 / 5
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మూగజీవిని చూసి ఆ పిల్లల మనసు ద్రవించింది. వెంటనే దాన్ని రక్షించి, ఇంటికి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి దానికి కంటికి రెప్పలా ఆహారం అందిస్తూ, అప్యాయతతో పెంచడం ప్రారంభించారు. ఆ అక్క చెల్లెలు..
చూపించిన ప్రేమానురాగాలకు ఉడత పిల్ల పూర్తిగా దాసోహమైపోయింది.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మూగజీవిని చూసి ఆ పిల్లల మనసు ద్రవించింది. వెంటనే దాన్ని రక్షించి, ఇంటికి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి దానికి కంటికి రెప్పలా ఆహారం అందిస్తూ, అప్యాయతతో పెంచడం ప్రారంభించారు. ఆ అక్క చెల్లెలు.. చూపించిన ప్రేమానురాగాలకు ఉడత పిల్ల పూర్తిగా దాసోహమైపోయింది.

3 / 5
ఇప్పుడు ఆ ముగ్గురితో ఎంతో చనువుగా మారిపోయింది. వాళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాలుతోంది. తలలపై ఎక్కుతూ, భుజాలపై తిరుగుతూ తెగ సందడి చేస్తోంది. చివరికి వాళ్లు పాఠశాలకు వెళ్తున్నా సరే.. పుస్తకాల సంచితో పాటు తాను కూడా బడి బాట పడుతోంది. ఆ ముగ్గురు చిన్నారుల సేవాతత్పరతను, ఆ ఉడత పిల్ల చూపిస్తున్న కృతజ్ఞతను చూసి మోత్కూరు ప్రజలు మురిసిపోతున్నారు.

4 / 5
ప్రకృతిలో మనుషులకు, జంతువులకు మధ్య ఉండే నిష్కల్మషమైన ప్రేమకు ఈ అపురూపమైన జీవన బంధం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. జీవకారుణ్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ‘ఉడత భక్తి’.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.

5 / 5
Follow Us